BIOLOGY PRACTICE BITS 10

  1. మరాస్‌మస్‌ వ్యాధికి కారణం?
    1) ప్రొటీన్‌ల లోపం
    2) కేలరీల లోపం
    3) ప్రొటీన్‌, కేలరీలలోపం
    4) విటమిన్‌ల లోపం
  2. హానికర రక్తహీనతను కలుగజేసే విటమిన్‌?
    1) బి1 2) బి2 3) బి6 4) బి12
  3. కాల్సిఫెరాల్‌ లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి?
    1) రికెట్స్‌ 2) గాయిటర్‌
    3) స్టెరిలిటి 4) యాంటీబ్లీడింగ్‌
  4. పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే ద్రవం?
    1) ఆల్కహాల్‌ 2) అయోడిన్‌
    3) KOH 4) మొలాసిన్‌
  5. నియాసిన్‌/ నికోటినికామ్లం లోపం వల్ల కలిగే వ్యాధి?
    1) బెరిబెరి 2) ఎనిమియా
    3) పెల్లాగ్రా 4) హానికర రక్తహీనత
  6. ‘వెజిటెబుల్‌ కార్వింగ్‌’ అంటే?
    1) కూరగాయలను కొనడం
    2) కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో దాచడం
    3) కూరగాయలను వండటం
    4) కూరగాయలను వివిధ ఆకారాలు,
    డిజైన్లతో అలంకరించడం
  7. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే బ్యాక్టీరియా?
    1) లాక్టిక్‌ యాసిడ్‌, బ్యాక్టీరియా
    2) లాక్టోబాసిల్లన్‌
    3) ఆర్కే (సల్ఫర్‌ బ్యాక్టీరియా)
    4) పైవన్నీ
  8. ఆహారనాళంలో జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం?
    1) చిన్నపేగు 2) జీర్ణాశయం
    3) ఆస్యకుహరం 4) నోరు
  9. మానవునిలో ‘గవద బిళ్లల వ్యాధి’ కి గురయ్యే లాలాజల గ్రంథులు?
    1) నిమ్ననేత్ర 2) పెరోటిక్‌
    3) అధోజిహ్విక 4) అధోజంభిక
  10. వానపాములో శ్వాసాంగం ఏది?
    1) ఊపిరితిత్తులు 2) చర్మం
    3) మొప్పలు 4) వాయునాళ శ్వాసక్రియ
  11. ప్రోత్రాంబిన్‌ను త్రాంబిన్‌గా మార్చడానికి త్రాంబోకైనేజ్‌ అనే ఎంజైమ్‌ తోడ్పడుతుంది. దీనిని విడుదల చేసేవి?
    1) RBCలు 2) WBCలు
    3) రక్తఫలకికలు 4) గ్రాన్యులోసైట్లు
  12. కింది వాటిలో వేటిని సూక్ష్మరక్షకభటులు అంటారు?
    1) ఎసిడోఫిల్‌ 2) బేసోఫిల్స్‌
    3) లింఫోసైట్లు 4) న్యూట్రోఫిల్స్‌
  13. ముష్కాల నుంచి ఏర్పడే హార్మోన్‌ ఏది?
    1) ఈస్ట్రోజన్‌ 2) టెస్టోస్టిరాన్‌
    3) ప్రొజెస్టిరాన్‌ 4) ప్రోలాక్టిన్‌
  14. తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం వంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏది?
    1) మజ్జాముఖం 2) అనుమస్తిష్కం
    3) మస్తిష్కం 4) ఏదీకాదు
  15. క్షయవ్యాధి ఏ సూక్ష్మజీవుల వల్ల కలుగుతుంది?
    1) శైవలాలు 2) శిలీంధ్రాలు
    3) బ్యాక్టీరియా 4) వైరస్‌

1-3,     2-4,     3-1,    4-2,     5-3,
6-4,     7-3,     8-3,    9-2,     10-2,
11-3,     12-4,     13-2,    14-1,     15-3,