BIOLOGY PRACTICE BITS 2

 

  1. చిన్న పిల్లల్లో డయేరియా వ్యాధికి కారణం?
    1) రోటా వైరస్‌ 2) కరోనా వైరస్‌
    3) పారామిక్సో వైరస్‌ 4) ఎంటిరో వైరస్‌
  2. వైరస్‌ ముఖ్య లక్షణం?
    1) పత్రహరితం లేకపోవడం
    2) నిర్జీవుల్లో మాత్రమే ద్విగుణీకరం
    చెందగలవు
    3) కొవ్వులతో తయారుచేయబడి ఉంటాయి
    4) అతిథేయిల్లో మాత్రమే ప్రత్యుత్పత్తి
    జరుపుకోగలవు
  3. జతపర్చండి
    ఎ. దుంపకాండం 1. అల్లం, పసుపు
    బి. కొమ్ము 2. చేమ, కంద
    సి. కందం 3. బంగాళదుంప
    డి. లశునం 4. ఉల్లి, వెల్లుల్లి
    1) ఎ-2, బి-4, సి-1, డి-3
    2) ఎ-3, బి-1, సి-2, డి-4
    3) ఎ-4, బి-2, సి-3, డి-1
    4) ఎ-1, బి-3, సి-4, డి-2
  4. ఔషధంగా వాడే సూక్ష్మజీవనాశిని (యాంటీబయాటిక్‌) విధి?
    1) బ్యాక్టీరియాను చంపడం
    2) బ్యాక్టీరియా భవిష్యవృద్ధిని పరీక్షించడం
    3) బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే WBC కణాల ఉత్పత్తిని ప్రేరేపించడం
    4) యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపించడం
  5. వైరస్‌ వ్యాధి కానిది?
    1) గవద బిల్లలు (మంప్స్‌)
    2) టైఫాయిడ్‌
    3) ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా)
    4) పచ్చకామెర్లు (జాండీస్‌)
  6. కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?
    1) హీమోఫీలియా- రక్తం గడ్డ కట్టకపోవడం
    2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను
    గుర్తించకపోవడం
    3) ఆల్బునిజం- మెలనిన్‌ అనే చర్మవర్ణకం లోపం వల్ల చర్మం తెల్లగా ఉండటం
    4) అథ్లెట్‌ఫూట్‌- పాదం బాగా వాచి
    రక్తస్రావం కావడం
  7. వివృత బీజాలకు, ఆవృత బీజాలకు గల భేదం?
    1) వివృత బీజాల్లో ఫలం ఉండదు.
    ఆవృత బీజాల్లో ఉంటుంది
    2) వివృత బీజాల్లో ఫలం ఉంటుంది.
    ఆవృత బీజాల్లో ఉండదు
    3) వివృత బీజాల్లో, ఆవృత బీజాల్లో ఫలం ఉండదు
    4) వివృత బీజాల్లో, ఆవృత బీజాల్లో ఫలం ఉంటుంది
  8. కింది వాటిలో సరికానిది?
    1) సిల్వికల్చర్‌- ఫలాల పెంపకం
    2) ఎపికల్చర్‌- తేనెటీగల పెంపకం
    3) వర్మికల్చర్‌- వానపాము
    4) ష్రింప్‌కల్చర్‌- రొయ్యలు
  9. అయోడిన్‌ అధికంగా గల పదార్థాలు?
    1) సముద్రపు రొయ్యలు, చేపలు
    2) సముద్రపు కలుపు మొక్కలు, ఉప్పు
    3) కాలేయం, గుడ్లు 4) 1, 2
  10. అల్బుమిన్యూరియా అంటే?
    1) మూత్రం ద్వారా ప్రొటీన్ల నష్టం
    2) మూత్రం ద్వారా రక్తం నష్టం
    3) మూత్రం ద్వారా రాళ్లు నష్టం
    4) మూత్రం ద్వారా గ్లూకోజ్‌ నష్టం
  11. కింది వాటిలో సరైనది?
    ఎ. ఆల్డోస్టిరాన్‌ అనేది ఒక గ్లూకోకార్టికాయిడ్‌
    బి. లైంగిక కార్టికాయిడ్స్‌ స్త్రీలలో ఎక్కువయితే మగవారి లాగా మీసాలు రావడాన్ని
    ‘విరిలిజం’ అంటారు
    1) ఎ 2) బి
    3) ఎ, బి 4) ఏదీకాదు
  12. జతపర్చండి
    ఎ. థైరాక్సిన్‌ 1. టానింగ్‌
    బి. పారాథార్మోన్‌ 2. గ్రేవ్స్‌ వ్యాధి
    సి. లైంగిక కార్టికాయిడ్స్‌
    3. ఆస్టియోపోరోసిస్‌
    డి. MSH 4. విరిలిజం
    1) ఎ-2, బి-3, సి-4, డి-1
    2) ఎ-2, బి-4, సి-2, డి-1
    3) ఎ-2, బి-3, సి-1, డి-4
    4) ఎ-2, బి-4, 1-4, డి-3
  13. కింది వాటిలో సరైనది?
    ఎ. అలైంగిక ప్రత్యుత్పత్తి వల్ల జీవపరిమాణం జరుగుతుంది
    బి. అలైంగిక ప్రత్యుత్పత్తి అభివృద్ధి చెందని జీవుల్లో జరుగుతుంది
    1) ఎ 2) బి
    3) ఎ, బి 4) ఏదీకాదు
  14. కవలల్లో కూడా వేలిముద్రలు ఒకేవిధంగా ఉండవు కారణం?
    1) బాహ్యచర్మంలో ఎత్తులు ఉండటం
    2) అంతఃచర్మంలో ఎత్తులు ఉండటం
    3) బాహ్యచర్మంలో ఎత్తుపల్లాలు ఉండటం
    4) అంతఃచర్మంలో ఎత్తుపల్లాలు ఉండటం
  15. అతినిద్ర వ్యాధి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది?
    1) సీ-సీ ఈగ 2) శాండ్‌ ఫ్లై
    3) రాట్‌ ఫ్లై 4) ఏడిస్‌

1.1           2. 4    3. 2    4. 3    5.2

6. 4         7. 1    8. 1    9. 4    10. 1 

11. 2        12. 7  13.3   14. 4  15. 1