BIOLOGY PRACTICE BITS 3

 

  1. మానవ శరీరంలో అధికంగా ఉండే పదార్థం నీరు కాగా మూలకం ఏది?
    1) క్యాల్షియం 2) కార్బన్‌
    3) ఆక్సిజన్‌ 4) ఇనుము
  2. కింది వాటిలో జన్యుసంబంధ వ్యాధి కానిది?
    1) హీమోఫీలియా- రక్తం గడ్డకట్టకపోవడం
    2) వర్ణాంధత్వం- ప్రాథమిక వర్ణాలను గుర్తించకపోవటం
    3) ఆల్బునిజం- మెలనిన్‌ అనే చర్మవర్ణకం లోపం వల్ల చర్మం తెలుపుగా ఉండటం
    4) అథ్లెట్‌ఫూట్‌- పాదం బాగా వాచి
    రక్తస్రావం కావడం
  3. జతపర్చండి
    ఎ. పెన్సిలిన్‌ 1. మొదటి వ్యాక్సిన్‌
    బి. మశూచి 2. మొదటి డ్రగ్‌
    సి. డీడీటీ 3. మొదటి యాంటీబయాటిక్‌
    డి. ప్రాంటోసిల్‌ 4. మొదటి కీటకనాశిని
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-3, బి-2, సి-4, డి-1
    3) ఎ-4, బి-1, సి-3, డి-2
    4) ఎ-3, బి-1, సి- 4, డి-2
  4. పక్షవాతానికి కారణమయ్యే లాథరిజం అనే వ్యాధి దేనివల్ల వస్తుంది?
    1) సోయాబీన్‌ను అధికంగా
    తీసుకోవడం వల్ల
    2) కేసరిపప్పు అధికంగా తీసుకోవడం
    3) విషపూరిత పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం
    4) విషపూరిత చేపలను ఆహారంగా
    తీసుకోవడం
  5. బేకర్స్‌ ఈస్ట్‌ అని దేనిని పిలుస్తారు?
    1) సాఖరోమైసిస్‌ సెరివీసియే
    2) సాఖరోమైసిస్‌ పోంబే
    3) పెనిసిలియం నోటేటం
    4) ఆస్పర్జిల్లస్‌ ప్లావస్‌
  6. ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రమే జరిగే విభజన ?
    1) సమవిభజన
    2) క్షయకరణ విభజన
    3) ఎమైటాటిస్‌ విభజన
    4) కణవిభజన
  7. కింది వాటిలో జన్యుశాస్త్ర పరిజ్ఞానాన్ని మానవ శ్రేయస్సుకు అనువర్తించే జీవశాస్త్ర శాఖ ఏది?
    1) బయోనిక్స్‌ 2) యుఫెనిక్స్‌
    3) యూజెనిక్స్‌ 4) యూథెనిక్స్‌
  8. వీనస్‌ ఫ్లవర్‌ బాస్కెట్‌ అని పిలిచే జంతువు?
    1) స్పాంజిల్లా 2) యూప్లెక్టెల్లా
    3) యాస్పాంజియా 4) క్షయోనా
  9. మానవ హృదయంలోని ఏ గది దళసరి గోడలను కలిగి ఉంటుంది?
    1) కుడికర్ణిక 2) ఎడమ కర్ణిక
    3) కుడి జఠరిక 4) ఎడమ జఠరిక
  10. ECG లో జఠరికల సంకోచాన్ని సూచించేది?
    1) P- తరంగం
    2) PQ- మధ్యకాల వ్యవధి
    3) QRS- సంక్లిష్టం
    4) T- తరంగం
  11. రంగులేని, వాసనలేని, క్షోభ్యత కలిగించని చాలా అపాయకరమైన వాయువు ఏది?
    1) CO 2) NO2
    3) SO2 4) CH4
  12. ఒక ATP అణువు జలవిశ్లేషణ వల్ల ఇచ్చేశక్తి కేలరీల్లో..?
    1) 6200 2) 7200
    3) 8200 4) 9200
  13. వన్యప్రాణుల సంరక్షణకుగాను పాల్‌గెట్టి అవార్డు అందుకున్నది ఎవరు?
    1) బీర్బల్‌ సహానీ
    2) సలీమ్‌ అలీ
    3) మహేశ్వరి
    4) వెంకట్రామన్‌
  14. బయోగ్యాస్‌లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ పరిమాణం?
    1) 10-20%
    2) 30-40%
    3) 50-60%
    4) 70-80%
  15. కొబ్బరికాయలో నూనెను ఇచ్చే భాగం?
    1) బాహ్యఫలకవచం
    2) అంతరఫలకవచం
    3) మధ్యఫలకవచం
    4) అంకురచ్ఛదం

1-2,     2-3,     3-2,     4-3,     5-1, 

6-2,     7-3,     8-4,     9-3,     10-2, 

11-1,     12-1,     13-4,     14-1,     15-3.