BIOLOGY PRACTICE BITS 5

 

  1. అప్పుడే జన్మించిన శిశువులో శ్వాసక్రియారేటు (నిమిషానికి)
    1) 32 2) 26
    3) 28 4) 72
  2. బీపీని తగ్గించడానికి తోడ్పడే రసాయనం?
    1) డై ఇథైల్‌ ఈథర్‌ 2) కొకైన్‌
    3) రిసర్ఫిన్‌ 4) మార్ఫిన్‌
  3. కింది వాటిలో సరైన వ్యాఖ్య?
    1) మొక్కలు అన్ని సమయాల్లో కిరణజన్య సంయోగక్రియను నిర్వర్తిస్తాయి
    2) మొక్కలు రాత్రి కిరణజన్య సంయోగ క్రియ, పగలు శ్వాసక్రియ జరుపుతాయి
    3) మొక్కలు పగలు కిరణజన్య సంయోగ క్రియ, అన్ని సమయాల్లో శ్వాసక్రియ
    జరుపుతాయి
    4) ఏదీకాదు
  4. పొడవుగా ఉన్న మొక్కల్లో నీరు కింది పద్ధతుల ద్వారా చేరుతుంది?
    1) వేరు పీడనం, బాష్పోత్సేకం
    2) ద్రవాభిసరణం
    3) వేరు పీడనం
    4) బాష్పోత్సేకం, ద్రవాభిసరణం
  5. ద్వినామీకరణ అంటే?
    1) ఒక జీవికి రెండుసార్లు పేరు పెట్టడం
    2) జాతి నామం, ప్రజాతి నామం ఉండటం
    3) శాస్త్రీయ, అశాస్త్రీయ నామాలుండటం
    4) జీవి రెండు దశలను వివరించడం
  6. ఉబ్బసం వ్యాధికి ఏ మొక్క ఆకులను ఉపయోగిస్తారు?
    1) దతూర 2) సొలానమ్‌
    3) పైసాలిస్‌ 4) పెట్యూనియా
  7. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేది?
    1) కాలేయం 2) క్లోమం
    3) జఠరగ్రంథి 4) ఆంత్రగ్రంథి
  8. పైత్యరస వర్ణకాలు ఏ విధంగా ఏర్పడతాయి?
    1) ఎర్రరక్త కణాల విచ్ఛిత్తిలో
    2) తెల్లరక్త కణాల విచ్ఛిత్తిలో
    3) తెల్లరక్త కణాలు ఏర్పడటంలో
    4) ఎర్రరక్త కణాలు ఏర్పడటంలో
  9. జఠర గ్రంథుల నుంచి ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరికామ్లం క్రియ ఏమిటి?
    1) బ్యాక్టీరియాను నాశనం చేయడం
    2) ప్రొటీన్లను జీర్ణం చేయడం
    3) జలవిశ్లేషణ
    4) కొవ్వులను జీర్ణం చేయడం
  10. మానవుని రక్తంలోని రక్త గ్రూపులు ఏ పదార్థాలతో నిర్మితమై ఉంటాయి?
    1) లిపిడ్‌ 2) కార్బొహైడ్రేట్‌
    3) ఎంజైమ్‌ 4) ప్రొటీన్లు
  11. బియ్యపు పొట్టులో ఉండే విటమిన్‌?
    1) బి6 2) బి2
    3) బి1 4) బి12
  12. స్త్రీలలో స్త్రీ బీజ ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్‌?
    1) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌
    2) ఈస్ట్రోజెన్‌
    3) థైరాక్సిన్‌
    4) ఫాలికిల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌
  13. టిష్యు టైప్‌ ప్లాస్మినోజన్‌ 4 యాక్టివేటర్‌ అనే ఔషధాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు?
    1) గుండెను చైతన్య పర్చడానికి
    2) నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి
    3) రక్తపు గడ్డలను కరిగించడానికి
    4) కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి
  14. అమైనో ఆమ్లాలకు సంబంధించినవి?
    1) జంతువులకు అమైనో ఆమ్లాలు ప్రొటీన్ల ద్వారా మాత్రమే అందుతుంది
    2) ఇవి యాంటీబాడీస్‌ (ప్రతిరక్షకాలు)
    ఉత్పత్తికి మూలం
    3) ఇవి శరీర నిల్వ ఆహారపదార్థాలు
    4) శరీరంలో ఉత్పత్తి కాని అవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య-9
  15. జతపర్చండి
    ఎ. టయలిన్‌ 1. నోరు
    బి. రెనిన్‌ 2. జీర్ణాశయం
    సి. ట్రిప్సిన్‌ 3. క్లోమం
    డి. మాల్టేజ్‌ 4. చిన్నపేగు
    1) ఎ-4, బి-3, సి-1, డి-2
    2) ఎ-3, బి-1, సి-4, డి-2
    3) ఎ-4, బి-2, సి-3, డి-1
    4) ఎ-1, బి-2, సి-3, డి-4

 

1-1,     2-3,     3-3,     4-1,     5-2,

6-1,     7-2,     8-1,     9-1,     10-4,

11-3,     12-4,     13-3,     14-3,     15-4