POLITY PRACTICE BITS 2

 

  1. కింది వాటిలో రాజ్యాంగ సంస్థల్లో సరైన వాటిని గుర్తించండి?
    1) జాతీయాభివృద్ధి మండలి
    2) ఆర్థిక సంఘం
    3) జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌
    4) వెనుకబడిన వర్గీయుల స్థితిగతుల కమిషన్‌
    1) 1, 2, 3, 4 2) 1, 2, 3
    3) 2, 3, 4 4) 1, 4
  2. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా మూడోసారి మమతా బెనర్జి ఏ రోజున ప్రమాణం చేశారు?
    1) 6-5-2021 2) 7-5-2021
    3) 4-5-2021 4) 5-5-2021
  3. జతపర్చండి
    జాబితా-1 జాబితా-2
    (సంస్థలు) (ప్రకరణలు)
    ఎ. ఆర్థికసంఘం 1. ప్రకరణ 148
    బి. కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
    2. ప్రకరణ 280
    సి. ఎన్నికల సంఘం 3. ప్రకరణ 315
    డి. భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌
    4. ప్రకరణ 324
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-2, బి-3, సి-4, డి-1
    3) ఎ-2, బి-3, సి-1, డి-4
    4) ఎ-2, బి-4, సి- 1, డి-3
  4. రాజ్యాంగ నిర్మాణ సభలో ఆశయాలు, లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినది ? 1) బీఎన్‌ రావ్‌ 2) అంబేద్కర్‌
    3) జవహర్‌లాల్‌ నెహ్రూ
    4) రాజేంద్రప్రసాద్‌
  5. కింది వివరణలో ఏది సరైనది?
    రెండు లేదా అంతకంటే ఎక్కువ అవసరాలను తీర్చేందుకు పార్లమెంట్‌ శాసనం ద్వారా ఒక ఉమ్మడి రాష్ట్రపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసే సందర్భం
    1) ఏర్పాటు చేయడం అవసరమని రాష్ట్రపతి భావించినప్పుడు
    2) సంబంధిత రాష్ట్ర గవర్నర్‌లు అలాంటి కమిషన్‌ను ఏర్పాటు చేయమని కేంద్రాన్ని అభ్యర్థించినప్పుడు
    3) సంబంధిత రాష్ట్ర శాసన సభలు దాని ఏర్పాటు కోసం ఒక తీర్మానం
    ఆమోదించినప్పుడు
    4) అది అవసరమని పార్లమెంట్‌
    భావించినప్పుడు
  6. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది?
    1) పార్లమెంట్‌ 2) రాష్ట్ర శాసన సభ
    3) రాష్ట్రపతి 4) గవర్నర్‌
  7. హేతువు (ఏ): రాష్ర్టాల ఏర్పాటుకు రాజ్యాంగ బద్ధత రాజ్యాంగంలో లేదు
    కారణం: (ఆర్‌): చిన్న రాష్ర్టాలకు అంబేద్కర్‌ ప్రారంభంలో వ్యతిరేకం, తర్వాత అనుకూలం
    1) ఏ, ఆర్‌ లు సరైనవి. ఏ కు ఆర్‌ సరైన
    వివరణ
    2) ఏ, ఆర్‌ లు సరైనవి. ఏ కు ఆర్‌ సరైన
    వివరణ కాదు
    3) ఏ వాస్తవం, ఆర్‌ అవాస్తవం
    4) ఏ అవాస్తవం, ఆర్‌ వాస్తవం
  8. కింది స్టేట్‌మెంట్లలో సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి?
    1) 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు సహ రాష్ట్రహోదా కల్పించారు
    2) 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింకు పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పించారు
    3) సిక్కిం గురించి రాజ్యాంగంలో వివరించే నిబంధన 371(ఎఫ్‌)
    4) సిక్కిం దేశంలో 21వ రాష్ట్రంగా ఏర్పడింది
  9. జతపర్చండి
    రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం
    ఎ. గుజరాత్‌ 1. 1971
    బి. నాగాలాండ్‌ 2. 1960
    సి. హర్యానా 3. 1963
    డి. హిమాచల్‌ప్రదేశ్‌ 4. 1966
    1) ఎ-2, బి-3, సి-4, డి-1
    2) ఎ-2, బి-1, సి-4, డి-3
    3) ఎ-2, బి-3, సి-1, డి-4
    4) ఎ-2, బి-4, సి- 1, డి-3
  10. భోజ్‌పురి రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం ఏ రాష్ర్టాలకు సంబంధించింది?
    1) బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌
    2) బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా
    3) బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌
    4) బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌
  11. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన బిల్లు (తెలంగాణ రాష్ట్ర) ఏర్పాటుకు గెజిట్‌ జారీ చేసిన రోజు?
    1) 2014, ఫిబ్రవరి 20
    2) 2014, మార్చి 1
    3) 2014, మార్చి 4
    4) 2014, మార్చి 3
  12. జతపర్చండి (రాష్ర్టాల పేర్లు మార్పు)
    ఎ. యునైటెడ్‌ ప్రావిన్స్‌ 1. తమిళనాడు
    బి. ట్రావెన్‌కోర్‌ కొచ్చి 2. ఉత్తరప్రదేశ్‌
    సి. మైసూర్‌ 3. కేరళ
    డి. మద్రాస్‌ 4. కర్నాటక
    1) ఎ-2, బి-3, సి-4, డి-1
    2) ఎ-2, బి-4, సి-1, డి-3
    3) ఎ-2, బి-3, సి-1, డి-4
    4) ఎ-2, బి-1, సి- 4, డి-3
  13. జతపర్చండి (ప్రత్యేక రాష్ట్రం- డిమాండ్‌)
    ఎ. బోడోల్యాండ్‌ 1. మణిపూర్‌
    బి. విదర్భ 2. కర్నాటక
    సి. కొడుగు 3. మహారాష్ట్ర
    డి. కికియు 4. అస్సాం
    1) ఎ-4, బి-3, సి-1, డి-2
    2) ఎ-4, బి-2, సి-1, డి-3
    3) ఎ-4, బి-3, సి-2, డి-1
    4) ఎ-4, బి-1, సి- 3, డి-2
  14. జతపర్చండి (ఏపీ పునర్‌ విభజన బిల్లు-తెలంగాణ ఏర్పాటు బిల్లు)
    ఎ. 2013 అక్టోబర్‌ 3
    1. కేంద్రమంత్రివర్గం ఆమోదం
    బి. 2014 జనవరి 30
    2. ఏపీ శాసనసభలో సమైక్య తీర్మానం
    సి. 2014 ఫిబ్రవరి
    3. లోక్‌సభ ఆమోదం
    డి. 2014 మార్చి 4
    4. గెజిట్‌ జారీ
    1) ఎ-1, బి-2, సి-4, డి-3
    2) ఎ-1, బి-4, సి-3, డి-2
    3) ఎ-1, బి-3, సి-4, డి-2
    4) ఎ-1, బి-2, సి- 3, డి-4
  15. జతపర్చండి
    ఎ. 10వ రాజ్యాంగ సవరణ (1961)
    1. పాండిచ్చేరి
    బి. 12వ రాజ్యాంగ సవరణ (1962)
    2. దాద్రానగర్‌ హవేలి
    సి. 13వ రాజ్యాంగ సవరణ
    3. డయ్యూ డామన్‌
    డి. 14వ రాజ్యాంగ సవరణ
    4. నాగాలాండ్‌
    1) ఎ-1, బి-2, సి-4, డి-3
    2) ఎ-2, బి-3, సి-4, డి-1
    3) ఎ-1, బి-2, సి-3, డి-4
    4) ఎ-2, బి-3, సి- 1, డి-4

1-3,     2-4,     3-2,     4-3,     5-3, 

6-4,     7-4,     8-4,     9-1,     10-1, 

11-3,     12-1,     13-3,     14-4,     15-2