BIOLOGY PRACTICE BITS 6

 

  1. విటమిన్‌ A లోపం వల్ల కలిగే వ్యాధికానిదేది?
    1) నిక్టోలోపియా 2) గ్లిరాప్తాల్మియా
    3) ఆస్టియోమలేషియా
    4) కెరటోమలేషియా
  2. అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సంబంధించి సరైనది?
    ఎ. ఇవి మన శరీరంలో ఉత్పత్తి కావు. కాబట్టి బయటనుంచి ఆహారంగా తీసుకోవాలి
    బి. ఇవి రక్తప్రసరణ సాఫీగా జరిగేటట్లు చేస్తా యి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఉపయోగకరం
    1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
  3. జతపరచండి.
    1) కుంతకాలు ఎ. విసురుదంతాలు
    2) రదనికలు బి. నమిలే దంతాలు
    3) అగ్రచర్వణకాలు సి. చీల్చేదంతాలు
    4) చర్వణకాలు డి. కోరపళ్లు
    1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
    2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
    3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
    4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
  4. జాకబ్‌సన్‌ అనే జ్ఞానేంద్రియం ఉన్న జీవి?
    1) పాము 2) తేలు 3) బల్లి 4) రొయ్య
  5. క్లోమాన్ని మిశ్రమ గ్రంథి అనేందుకు కారణం?
    1) వినాళభాగం, నాళసహిత భాగం రెండూ కలిగి ఉంటుంది
    2) ఇది ఎంజైమ్‌లు, హార్మోన్‌లను
    స్రవిస్తుంది
    3) ఇది జీర్ణక్రియలో, గ్లూకోజ్‌ నియంత్రణలో పాల్గొంటుంది
    4) పైవన్నీ
  6. రేడియో ధార్మిక కిరణాల ప్రభావానికి మొదట గురయ్యే భాగం ఏది?
    1) మెదడు 2) హృదయం
    3) మూత్రపిండాలు 4) ఊపిరితిత్తులు
  7. శ్వాసక్రియా రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది?
    1) చిన్నపిల్లలు 2) యువకులు
    3) మధ్యవయస్కులు 4) ముసలివారు
  8. కింది వాటిలో సరైనది
    ఎ. అంతస్రావిక గ్రంథుల్లో అతిచిన్నది పీయూషగ్రంథి
    బి. పీయూషగ్రంథి అన్ని అంతస్రావ
    గ్రంథులను తన ఆధీనంలో ఉంచుతుంది
    1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
  9. కింది వాటిని జతపర్చండి హార్మోన్‌ లోపం వల్ల కలిగే వ్యాధి
    1. ఆల్డోస్టిరాన్‌ ఎ. క్రెటినిజం
    2. పారాథార్మోస్‌ బి. కుషింగ్‌ వ్యాధి
    3. కార్టిసాల్‌ సి. టెటాని
    4. థైరాక్సిన్‌ డి. ఎడిసన్స్‌ వ్యాధి
      1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
      2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
      3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
      4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  10. కింది వాటిలో సరైనది?
    ఎ. ముష్కాలను తొలగించడాన్ని ఆర్కిడెక్టమీ అంటారు
    బి. పురుషుల్లో హార్మోన్‌ల అసమతుల్యం వల్ల క్షీరగ్రంథులు ఏర్పడటాన్ని గైనకోమాస్టియా అంటారు
    1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
  11. చెవిలో సమతాస్థితిలో పాల్గొనే నిర్మాణాలు
    1) యుస్టేషియన్‌ నాళం, కర్ణావర్తం
    2) కర్ణావర్తం, పేటిక
    3) పేటిక, అర్థవర్తుల కుల్యాలు
    4) యుస్టేషియన్‌ నాళం, పేటిక
  12. థిసియాలజీ అంటే?
    1) టీబీ అధ్యయనం
    2) టెటనస్‌ అధ్యయనం
    3) న్యూమోనియా అధ్యయనం
    4) డిప్తీరియా అధ్యయనం
  13. ప్రపంచంలో మొదట తయారుచేసిన కృత్రిమ డ్రగ్‌ ఏది? అది ఏ వ్యాధి నివారణకు వాడతారు?
    1) టెట్రాసైక్లిన్‌ 2) పెన్సిలిన్‌, ఆంత్రాక్స్‌
    3) క్లోరోమైసిటివ్‌, టీబీ
    4) ప్రాంటోసిల్‌, మెనింజైటిస్‌
  14. అతినిద్ర వ్యాధి కలిగించే కారకం ఏది?
    1) లీష్మానియా 2) క్లాస్ట్రీడియం
    3) ట్రిపనోసోమా 4) ఎంటమీబా
  15. పంది మాంసం ద్వారా మానవునిలో వ్యాపించే వ్యాధి?
    1) పైలేరియా 2) టీనియాసిస్‌
    3) ఆస్కారియాసిస్‌ 4) కాండిడియాసిస్‌

 1-3,     2-3,     3-2,     4-1,     5-4,

6-4,     7-1,     8-3,     9-4,     10-3, 

11-2,     12-1,     13-4,     14-3,     15-2.