BIOLOGY PRACTICE BITS 7

 

  1. ట్రైకోఫోబియా అంటే కింది వాటిలో దేన్ని చూసి భయపడటం?
    1) వెంట్రుకలు 2) సాలెపురుగు
    3) జంతువులు 4) దంతాలు
  2. టాటోనీమ్‌ అంటే?
    1) జాతి, ప్రజాతి ఒకే పేరు కలిగి ఉండటం
    2) రెండు జీవులకు ఒకే పేరు ఉండటం
    3) జాతి, ప్రజాతి వేర్వేరు పేర్లను కలిగి ఉండటం
    4) ఒక జాతిలోని వేర్వేరు ఉపజాతులకు ఒకే పేరు ఉండటం
  3. తేనెటీగ లార్వాను ఏమని పిలుస్తారు?
    1) మూగట్‌ 2) రిగ్లర్‌
    3) టంబ్లర్‌ 4) గ్రబ్‌
  4. సముద్ర ఎలుక అని దేన్ని పిలుస్తారు?
    1) పలాలోపురుగు 2) జలగ
    3) వానపాము 4) ఆఫ్రొడైట్‌
  5. ఫిర్రమోన్స్‌ అంటే?
    1) వృక్ష హార్మోన్స్‌
    2) జీర్ణక్రియను నియంత్రించే జంతు హార్మోన్స్‌
    3) పునరుత్పత్తి శక్తిని ప్రేరేపించే హార్మోన్స్‌
    4) తమ జాతి జీవులను గుర్తించే కీటక హార్మోన్స్‌
  6. మిల్ట్‌ అంటే?
    1) కప్పలు, చేపల శుక్రకణాల సమూహం
    2) కప్పల అండాల సమూహం
    3) చేపల శుక్రకణాల సమూహం
    4) చేపల అండాల సమూహం
  7. కింది వాటిలో వేర్లు లేని మొక్క?
    1) చిక్కుడు 2) బఠాని
    3) గోధుమ 4) ఉల్ఫియా
  8. జన్యువులు ఏ విధంగా అమర్చబడి ఉంటాయి?
    1) క్రోమోజోమ్‌ నిలువునా సమాంతర వరుసల్లో అమర్చబడి ఉంటాయి
    2) క్రోమోజోమ్‌ నిలువునా రేఖియంగా అమర్చబడి ఉంటాయి
    3) సర్పిలాకారంగా అమర్చబడి ఉంటాయి
    4) అస్తవ్యస్తంగా అమర్చబడి ఉంటాయి
  9. పెరాక్సిజోమ్‌ల విధి?
    1) విషపదార్థాలను తొలగించడం
    2) ఆక్సీకరణ చర్యలను జరపడం
    3) ఎ 4) ఎ, బి
  10. వృక్షకణంలో కేంద్రకం మధ్యలో కాకుండా కణకవచానికి దగ్గరగా వస్తుంది ఎందుకు?
    1) పెద్ద మైట్రోకాండ్రియా ఉండటం వల్ల
    2) పెద్దరిక్తిక కణంలోని ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించడం
    3) కణంలోని ప్రధానమైన కణాంగాలు కణం మధ్యలో అమరి ఉండటం
    4) పెద్ద ప్లాస్టిడ్‌ల వల్ల
  11. రిక్తికలకు సంబంధించి సరైనది?
    1) వృక్ష, జంతుకణాల్లో రెండింటిలో ఇవి
    కనిపిస్తాయి
    2) జంతుకణాల్లో ఇవి ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి
    3) లేత వృక్షకణాల్లో ఇవి అధిక సంఖ్యలో ఉండి తర్వాతి దశల్లో అన్ని కలిసి ఒకే పెద్ద రిక్తికగా మారుతాయి
    4) ఏదీకాదు
  12. కాఫీలో కలిపే చికోరి పౌడర్‌ దేని నుంచి గ్రహిస్తారు?
    1) వేరు 2) కాండం
    3) ఆకులు 4) విత్తనాలు
  13. ‘ట్రకోమా’ అనే వ్యాధి ఏ భాగానికి కలుగుతుంది?
    1) హృదయం 2) మెదడు
    3) ఊపిరితిత్తులు 4) కళ్లు
  14. దేశంలో మొదటిసారి అత్యవసరంగా తయారుచేసిన టీకా మందు?
    1) మలేరియా టీకా మందు
    2) ఎఫ్‌ఎమ్‌డీ టీకా మందు
    3) హెచ్‌బీవీ టీకా మందు
    4) బీసీజీ టీకామందు
  15. గోబర్‌ గ్యాస్‌లో ప్రధాన ఘటకం?
    1) మీథేన్‌ 2) ఈథేన్‌
    3) క్లోరిన్‌ 4) ప్రొఫేన్‌

1-1,     2-1,     3-4,     4-4,     5-4, 

6-1,     7-4,     8-2,     9-3,     10-2, 

11-3,     12-1,     13-4,     14-3,     15-3