POLITY PRACTICE BITS 3

  1. భారత్‌ గణతంత్ర దేశం అంటే?
    1) ప్రజాస్వామ్యం దేశం కావడం వల్ల
    2) పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం కావడం వల్ల
    3) నిర్ణీత కాలానికి రాజ్యాధినేత ఎన్నిక కావడం
    4) పైవన్నీ
  2. కింది వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగిన దేశం?
    1) రష్యా 2) భారత్‌
    3) ఫ్రాన్స్‌ 4) స్విట్జర్లాండ్‌
  3. భారత రాజ్యాంగ ప్రవేశిక పాఠం దేన్ని చేకూర్చడానికి లక్షిస్తుంది?
    1) ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు
    2) పౌరులకు ప్రాథమిక విధులు
    3) వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యత, సమగ్రత
    4) ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
  4. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
    ఎ. పార్లమెంట్‌ దేశంలోని మనుగడలో గల ఏ రాష్ట్ర సరిహద్దును అయినా మార్పులు చేసే అధికారాన్ని కలిగి ఉంది
    బి. దేశంలో ఏదైనా రాష్ట్ర సరిహద్దులను మార్చే ఒక బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేపెట్టాలి
    1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
    3) ఎ, బి 4) ఏదీకాదు
  5. దేశంలో ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానం ఏ నిబంధనలో పొందుపర్చబడింది?
    1) ప్రకరణ 368 2) ప్రకరణ 130
    3) ప్రకరణ 70 4) ప్రకరణ 3
  6. స్టేట్‌మెంట్‌ 1: రాజ్యాంగం స్వేచ్ఛాయుత రాజ్యాంగాన్ని కలిగి ఉంది
    స్టేట్‌మెంట్‌ 2: రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించింది
    1) స్టేట్‌మెంట్‌ 1, 2 సరైనవి. 1కు 2 సరైన వివరణ
    2) స్టేట్‌మెంట్‌ 1, 2 సరైనవి. 1కు 2 సరైన వివరణ కాదు
    3) స్టేట్‌మెంట్‌ 1 వాస్తవం, 2 అవాస్తవం
    4) స్టేట్‌మెంట్‌ 1 అవాస్తవం, 2 వాస్తవం
  7. జతపర్చండి
    లిస్ట్‌-1 లిస్ట్‌-2
    ఎ. ఆదేశిక సూత్రాలు 1. ఐర్లాండ్‌
    బి. అత్యవసర పరిస్థితుల్లో అవలంబించే విధానాలు 2. జర్మనీ
    సి. గవర్నర్‌ను నియమించే విధానం 3. కెనడా
    డి. రాజ్యాంగ సవరణ విధానం 4. దక్షిణాఫ్రికా
    1) ఎ-1, బి-2, సి-3, డి-4
    2) ఎ-2, బి-1, సి-3, డి-4
    3) ఎ-2, బి-1, సి-4, డి-3
    4) ఎ-1, బి-2, సి-4, డి-3
  8. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికను సవరించారు?
    1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975
    2) 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
    3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976
    4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978
  9. కింది ఏ మార్గాల ద్వారా ఒక వ్యక్తి పౌరసత్వ చట్టం 1955 ప్రకారం భారత పౌరుడు అవుతాడు?
    ఎ. పుట్టుక ద్వారా
    బి. పౌరసత్వం ద్వారా
    సి. నమోదుద్వారా
    డి. జాతీయీకరణం ద్వారా
    ఇ. భూభాగాలు కలుపుకోవడం ద్వారా
    1) ఎ, బి, సి, డి, ఇ 2) ఎ, బి
    3) ఎ, బి, సి, ఇ 4) బి, డి, ఇ
  10. కింది వాటిలో సరైనది?
    1) భారత సుప్రీంకోర్టు- ఆర్టికల్‌ 318
    2) కేంద్ర ఎన్నికల సంఘం- ఆర్టికల్‌ 324
    3) యూనియన్‌ పబ్లిక్‌ కమిషన్‌-ఆర్టికల్‌ 332
    4) అటార్నీ జనరల్‌- ఆర్టికల్‌ 351
  11. కింది వాటిలో ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిని సరైన వరుస క్రమంలో అమర్చండి?
    ఎ. వీవీ గిరి బి. జీఎస్‌ పాఠక్‌
    సి. బీడీ జెట్టి డి. హిదయతుల్లా
    1) బి, ఎ, సి, డి 2) ఎ, బి, డి, సి
    3) ఎ, బి, సి, డి 4) ఎ, సి, డి, బి
  12. చట్టం ముందు అందరూ సమానులే అనే అంశానికి మినహాయింపును సరైన వాటిని గుర్తించండి?
    ఎ. రాష్ట్రపతి బి. గవర్నర్‌
    సి. విదేశీ యాత్రికులు డి. దౌత్యవేత్తలు
    1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
    3) ఎ, బి, డి 4) ఏదీకాదు
  13. జతపర్చండి
  14. లిస్ట్‌-1 లిస్ట్‌-2 ఎ. ఆర్టికల్‌ 39 (ఎ) 1. సహకార సంఘాల స్థాపన బి. ఆర్టికల్‌ 43(ఎ) 2. ఉచిత న్యాయసహాయం సి. ఆర్టికల్‌ 43(బి) 3. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ డి. ఆర్టికల్‌ 48 (ఎ)
    1. పారిశ్రామిక యాజమాన్యంలో
      కార్మికులను భాగస్వామ్యం చేయాలి
      1) ఎ-1, బి-2, సి-3, డి-4
      2) ఎ-1, బి-3, సి-4, డి-2
      3) ఎ-2, బి-4, సి-1, డి-3
      4) ఎ-2, బి-4, సి-3, డి-1
  15. కింది వారిలో భారత రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారు?
    ఎ. హైకోర్ట్‌ న్యాయమూర్తులను
    బి. కేంద్రపాలిత ప్రాంత లెప్టినెంట్‌
    గవర్నర్లను
    సి. ఉపరాష్ట్రపతిని
    డి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను
    1) ఎ, బి, సి 2) బి, సి, డి
    3) ఎ, బి, డి 4) బి, డి

1-3,     2-4,     3-3,     4-1,     5-4, 

6-1,     7-1,     8-3,     9-3,     10-2, 

11-3,     12-3,     13-3,     14-3,     15-4.