- మానవునిలో చిన్న ఎముక ఏది?
1) జత్రుక 2) స్టెపిన్
3) ఉరోమేఖల 4) భుజాస్థి - కంటిలోని కిటికి అని దేనికి పేరు?
1) కంటిపొర 2) శుక్లపటలం
3) కనుపాప 4) నేత్రపటలం - చర్మంలో పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఏవి?
1) స్పర్శగ్రాహకాలు 2) నాసిసెప్టార్స్
3) ఫాసియన్ కణాలు 4) ఉష్ణగ్రాహకాలు - చర్మం బరువు ఎంత?
1) 400 కి.గ్రా 2) 4 కి.గ్రా
3) 2 కి.గ్రా 4) 14 కి.గ్రా - కప్పలో భూమి మీద దేని ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది?
1) ఊపిరితిత్తులు 2) చర్మం
3) అస్యకుహరం 4) యూరోక్రోమ్ - మానవుడిని ఇతర జంతువులతో పోల్చినప్పుడు వాసన పసిగట్టే సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది?
1) ఎక్కువ 2) తక్కువ
3) సమానం 4) మధ్యస్థం - మానవుడు పీల్చే గాలిలో కంటే విడుదల చేసే గాలిలో తక్కువగా ఉండే వాయువు?
1) ఆక్సిజన్ 2) కార్బన్‌డైఆక్సైడ్
3) నైట్రోజన్ 4) జడవాయువులు - ఆహారం ముక్కలు చేసేందుకు తోడ్పడే దంతాలు ఏవి?
1) కోరపళ్లు 2) రదనికలు
3) కుంతకాలు 4) విసురు దంతాలు - గుండె గదులకు రక్తాన్ని సరఫరా చేసేవి?
1) కరోనరి సిర 2) కరోనరీ ధమని
3) పుపుస సిర 4) పుపుస ధమని - గుండెను అఘాతాల నుంచి కాపాడేది?
1) పుపుస ద్రవం
2) మస్తిష్క మేరుద్రవం
3) హృదయావరణ ద్రవం
4) సిలోమర్ ద్రవం - ఏ ధమని ద్వారా మలిన రక్తం ప్రవహిస్తుంది?
1) కరోటిడ్ ధమని 2) పుపుస ధమని
3) ఎడదైహిక మహా ధమని
4) ఉదరాంత్ర ధమని - నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు ?
1) సమానంగా ఉంటాయి
2) నాడీ స్పందన రేటు కంటే హృదయ స్పందన రేటు ఎక్కువ
3) హృదయ స్పందన రేటు కంటే నాడీ స్పందన రేటు ఎక్కువ
4) ఏదీకాదు - ద్వివలయ రక్తప్రసరణలో రక్తం గుండె ద్వారా ఎన్నిసార్లు ప్రవహిస్తుంది?
1) ఒకసారి 2) రెండుసార్లు
3) మూడుసార్లు 4) నాలుగుసార్లు - రక్తం గడ్డకట్టిన తర్వాత పైన పేరుకునే ద్రవం?
1) ప్లాస్మా 2) శోషరసం
3) సీరం 4) ఏదీకాదు - రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం?
1) 2 నిమిషాలు
2) 3-6 నిమిషాలు
3) 9 నిమిషాలు
4) 15-20 నిమిషాలు
1-3, 2-2, 3-2, 4-4, 5-1,
6-2, 7-1, 8-3, 9-4, 10-3
11-2, 12-1, 13-2, 14-3, 15-2,