ECONOMY PRACTICE BITS 4

 

  1. ప్రణాళిక వనరుల్లో లోటు ద్రవ్య విధానం వల్ల వచ్చే ఇబ్బంది?
    1) ద్రవ్య సరఫరా, ద్రవ్యోల్బణం
    పెరుగుతుంది
    2) ద్రవ్య సరఫరా పెరిగి పేదరికం తగ్గుతుంది
    3) ద్రవ్య సరఫరా తగ్గి డిమాండ్‌ తగ్గుతుంది
    4) ద్రవ్య సరఫరా స్థిరంగా ఉండి ఉద్యోగ కల్పన స్తబ్దత
  2. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి భారతదేశంలో నోడల్‌ ఏజెన్సీ ఏది?
    1) పర్యావరణ మంత్రిత్వ శాఖ
    2) జాతీయాభివృద్ధి మండలి
    3) నీతి ఆయోగ్‌
    4) నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌
  3. 2వ పంచవర్ష ప్రణాళిక వైఫల్యానికి కారణం?
    ఎ. విదేశీ మారక నిల్వల కొరత
    బి. శక్తికి మించిన లక్ష్యం
    సి. వ్యవసాయం నుంచి పరిశ్రమలకు
    ప్రాధాన్యత మార్చడం
    డి. పైవన్నీ
    1) ఎ, బి 2) బి, సి
    3) ఎ 4) డి
  4. ఆర్థికాభివృద్ధిలో ద్వంద్వత్వం అంటే?
    1) ద్వంద్వ ధరల విధానం
    2) వ్యవస్థాగతమైన, అవ్యవస్థాగతమైన వ్యవస్థలు ఉండటం
    3) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు
    సమకాలికంగా ఉండటం
    4) కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళిక
    వ్యవస్థలు ఉండటం
  5. నేషనల్‌ స్టాటిస్టికల్‌ కమిషన్‌ ఏర్పాటుకు కారణం?
    1) దత్తాంశ సేకరణలో ఇబ్బందుల
    తొలగింపు
    2) దేశ జాతీయాదాయ వృద్ధికి అవసరమైన వనరుల సేకరణ
    3) జాతీయాదాయ మదింపులో గల
    సమస్యల పరిష్కారం
    4) ఇతర దేశాలతో దేశపు జాతీయాదాయాన్ని తులనాత్మకంగా అధ్యయనం చేయడం
  6. జతపర్చండి
    ఎ. ఉద్యోగుల బీమా చట్టం 1. 1979
    బి. కనీస వేతనాల చట్టం 2. 1976
    సి. సమాన వేతనాల చట్టం 3. 1948
    డి. అంతర్‌రాష్ట్ర వలస కార్మికుల చట్టం
    4. 1948
    1) ఎ-4, బి-3, సి-2, డి-1
    2) ఎ-3, బి-4, సి-1, డి-2
    3) ఎ-1, బి-3, సి-2, డి-4
    4) ఎ-2, బి-3, సి-4, డి-1
  7. ‘మేరా గావ్‌- మేరా గౌరవ్‌’ దేనికి సంబంధించినది?
    1) ప్రవాస భారతీయులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం
    2) పార్లమెంట్‌ సభ్యులు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం
    3) వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలను దత్తత తీసుకుని వ్యవసాయ విస్తీర్ణాన్ని
    పెంచడానికి కృషి చేయడం
    4) గ్రామ సర్పంచ్‌ నేతృత్వంలో గ్రామాల అభివృద్ధి
  8. పిసి కల్చర్‌ అంటే?
    1) చేపల పెంపకం
    2) ద్రాక్షతోటల పెంపకం
    3) పట్టుపురుగుల పెంపకం
    4) కూరగాయల పెంపకం
  9. ఒక దేశంలో శిశు జనాభా వృద్ధిరేటు కంటే పనిచేసే వయస్సు గల జనాభా వృద్ధిరేటు అధికంగా ఉంటే అది దేనికి దారితీస్తుంది?
    1) అధిక ఆధారిత నిష్పత్తి
    2) అల్ప ఆధారిత నిష్పత్తి
    3) అనాధారిత నిష్పత్తి
    4) మధ్యస్థ ఆధారిత నిష్పత్తి
  10. దేశంలో విదేశీ మారక ద్రవ్యం, స్వేచ్ఛా మార్కెట్‌, రాష్ర్టాల రుణ సంబంధ విషయాల్లోని చట్టాలను అవి అమలైన సంవత్సరాల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి?
    1) MRTP, FERA, FEMA, FRBM
    2) FERA, MRTP, FRBM, FEMA
    3) FRBM, FEMA, FERA, MRTP
    4) MRTP, FEMA, FERA, FRBM

 

 1-1,     2-3,     3-4,     4-2,     5-2, 

6-1,     7-3,     8-1,     9-2,     10-1