GEOGRAPHY PRACTICE BITS 1

 

  1. తెలంగాణ రాష్ట్ర భూభాగం మొత్తం దేశ భాగంలో ఎంత శాతాన్ని కలిగిఉంది?
    1) 2.49% 2) 3.49%
    3) 4.39% 4) 4.23%
  2. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలు ఏ రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి?
    1) ఆంధ్రప్రదేశ్‌ 2) మహారాష్ట్ర
    3) కర్ణాటక 4) ఛత్తీస్‌గఢ్‌
  3. తెలంగాణ రాష్ట్ర పుష్పం?
    1) ఇప్పపువ్వు 2) లోటస్‌
    3) మోదుగుపువ్వు 4) తంగేడుపువ్వు
  4. ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది?
    1) 1956 రాష్ట్ర పునర్విభజన చట్టం
    2) 2013 తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం
    3) 2014 తెలంగాణ పునర్విభజన చట్టం
    4) 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం
  5. రాష్ట్ర భూభాగం కింది దేనిలో భాగం?
    1) కేంద్ర ఉన్నత భూభాగం
    2) మాల్వా పీఠభూమి
    3) దక్కన్‌ పీఠభూమి 4) ఏదీకాదు
  6. రాష్ట్ర భూభాగం దాదాపుగా ఏ ఆకారంలో ఉంది?
    1) త్రిభుజం
    2) విషమబాహు త్రిభుజం
    3) సమబాహు త్రిభుజం
    4) సమద్విబాహు త్రిభుజం
  7. ఆదిలాబాద్‌ జిల్లాలోని సాత్మల కొండలు కింది వాటిలో దేని రూపాంతరాలు?
    1) తూర్పుకనుమలు
    2) పశ్చిమకనుమలు
    3) వింధ్యపర్వతాలు
    4) సాత్పూర పర్వతాలు
  8. కందికల్‌ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
    1) ఉమ్మడి నిజామాబాద్‌
    2) ఉమ్మడి ఆదిలాబాద్‌
    3) ఉమ్మడి వరంగల్‌
    4) ఉమ్మడి మహబూబ్‌నగర్‌
  9. రాష్ట్ర భూభాగంలో ఏ శీతోష్ణస్థితి నెలకొని ఉంది?
    1) సముద్ర ప్రభావిత
    2) ఖండాంతర్గత
    3) ఎడారి
    4) ఆల్ఫెన్‌
  10. రాష్ట్రంలో సంభవించే వర్షపాతం అధికంగా ఏ స్వభావానికి చెందినది?
    1) పర్వతీయ
    2) సంవాహన
    3) చక్రవాత
    4) ఏదీకాదు
  11. లేటరైట్‌ నేలలు ఏ జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
    1) ఉమ్మడి ఖమ్మం
    2) ఉమ్మడి మెదక్‌
    3) ఉమ్మడి రంగారెడ్డి
    4) ఉమ్మడి నల్లగొండ
  12. రాష్ట్రంలో నదీవ్యవస్థ ఏ దిశ నుంచి ఏ దిశ వైపు కదులుతుంది?
    1) వాయవ్యం నుంచి ఈశాన్యం
    2) ఈశాన్యం నుంచి నైరుతి
    3) ఆగ్నేయం నుంచి వాయవ్యం
    4) వాయవ్యం నుంచి ఆగ్నేయం
  13. మీనాంబరం పేరుతో పిలిచే నది?
    1) డిండి 2) హరిద్ర
    3) తుంగభద్ర 4) కడెం
  14. నవ్య తెలంగాణలో విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా?
    1) ఖమ్మం 2) కొత్తగూడెం
    3) జయశంకర్‌ భూపాలపల్లి 4) రంగారెడ్డి
  15. రాష్ట్రంలో వైశాల్యపరంగా మొదటి 5జిల్లాల వరుస క్రమాన్ని అమర్చండి?
    ఎ. కొత్తగూడెం బి. నాగర్‌కర్నూల్‌
    సి. నల్లగొండ డి. భూపాలపల్లి
    ఇ. రంగారెడ్డి
    1) సి, డి, ఇ, ఎ, బి 2) బి, ఎ, ఇ, డి, సి
    3) ఎ, బి, సి, డి, ఇ 4) ఇ, డి, సి, బి, ఎ

1-2,     2-3,     3-4,    4-4,     5-3,
6-4,     7-2,     8-3,     9-2,     10-1,
11-2,     12-4,     13-1,     14-2,     15-3,