POLITY PRACTICE BITS 6

 


  1. కింది వాటిలో సరైనది కానిది ఏది?
    1) 1892 భారత కౌన్సిళ్ల చట్టం- ఎన్నిక విధానం
    2) 1909 భారత కౌన్సిళ్ల చట్టం- బాధ్యతాయుత ప్రభుత్వం
    3) 1919 భారత ప్రభుత్వ చట్టం- ప్రావిన్షియల్‌ అటానమి
    4) 1935 భారత ప్రభుత్వ చట్టం- ద్వంద్వ ప్రభుత్వం
  2. కింది అంశాలను కోడ్‌ ఆధారంగా సరైన వరుస క్రమంలో అమర్చండి?
    ఎ. సీ రాజగోపాలచారి ప్లాన్‌
    బి. వేవెల్‌ ప్లాన్‌
    సి. మౌంట్‌బాటన్‌ ప్లాన్‌
    డి. క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌
    1) 1, 2, 3, 4 2) 2, 3, 4, 1
    3) 1, 2, 4, 3 4) 2, 1, 3, 4
  3. కింది వాటిలో ముసాయిదా కమిటీ సభ్యులు సరైన వారిని గుర్తించండి?
    ఎ. కేఎం మున్షీ
    బి. జవహర్‌లాల్‌ నెహ్రూ
    సి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
    డి. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌
    1) 1, 3, 4 2) 1, 4
    3) 1, 3 4) 2, 3, 4
  4. కింది వాటిని జతపర్చండి.
    ఎ. ముసాయిదా కమిటీ చైర్మన్‌
    1. లార్డ్‌ మౌంట్‌బాటన్‌
    బి. రాజ్యాంగపరిషత్తు సభ్యుడు
    2. రాజేంద్రప్రసాద్‌
    సి. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు
    3. బీఆర్‌ అంబేద్కర్‌
    డి. చివరి బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌
    4. జవహర్‌లాల్‌ నెహ్రూ
    ఇ. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు
    5. కేఎం మున్షీ
    ఎఫ్‌. రాజ్యాంగ పరిషత్తుకు ముఖ్య
    న్యాయసలహాదారుడు
    1) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-ఎఫ్‌
    2) 1-డి, 2-ఇ, 3-ఎఫ్‌, 4-బి, 5-ఎ
    3) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5- సి
    4) 1-డి, 2-సి, 3-ఎఫ్‌, 4-బి, 5- ఎ
  5. కింది వ్యాఖ్యల్లో సరైనది/సరైనవి?
    ఎ. భారత్‌లో ఉన్న సివిల్‌ సర్వీసులపై ఏర్పాటు చేసిన కమిషన్‌ సిఫారసు అనుసారం 1926లో చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను భారత్‌లో నెలకొల్పారు
    బి. భారత ప్రభుత్వ చట్టం 1935 సమాఖ్య వ్యవస్థను, రాష్ట్రస్థాయిలో (ప్రావిన్స్‌లతో) పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు
    1) ఎ 2) బి
    3) ఎ, బి 4) ఏదీకాదు
  6. కింది వాటిని జతపర్చండి
    రాజ్యాంగ నిర్మాణ సభ కమిటీ చైర్మన్‌
    ఎ. సారథ్య కమిటీ
    1. సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌
    బి. ప్రాథమిక హక్కుల ఉపకమిటీ
    2. రాజేంద్రప్రసాద్‌
    సి. కేంద్రరాజ్యాంగ కమిటీ
    3. జేబీ కృపలాని
    డి. ప్రావిన్స్‌ల రాజ్యాంగ కమిటీ
    4. జవహర్‌లాల్‌ నెహ్రూ
    1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
    2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
    3) 1- బి, 2-డి, 3-సి, 4-ఎ
    4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
  7. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికారాల పంపిణీకి గల ఆధారమైన పథకం?
    1) 1909 మింటో మార్లే సంస్కరణలు
    2) మాంటెగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు
    3) 1935 భారత ప్రభుత్వ చట్టం
    4) 1947 భారత స్వాతంత్య్ర చట్టం
  8. భారత చరిత్ర ప్రకారం రాజ్యాంగ నిర్మాణ సభలోని ప్రావిన్స్‌లకు చెందిన సభ్యులు?
    1) ఆ ప్రావిన్స్‌ల ప్రజలచే ప్రత్యక్షంగా
    ఎన్నుకోబడినవారు
    2) భారత జాతీయ కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌ ద్వారా నామినేట్‌ అయ్యారు
    3) రాజ్యాంగ వ్యవహారాల్లో వారి ప్రావీణ్యం కారణంగా ప్రభుత్వం ద్వారా ఎంపికయ్యారు
    4) ప్రావిన్స్‌ల విధాన సభల ద్వారా
    ఎన్నుకోబడినవారు
  9. జతపర్చండి
    ఎ. మద్రాస్‌ మున్సిపాలిటీ
    1. 1772
    బి. జిల్లా కలెక్టర్‌ పదవి
    2. 1860
    సి. బడ్జెట్‌ విధానం ప్రవేశపెట్టుట
    3. 1921
    డి. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఏర్పాటు
    4. 1687
    1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
    2) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
    3) 1- డి, 2-ఎ, 3-సి, 4-బి
    4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
  10. జతపర్చండి ఎ. 1946, డిసెంబర్‌ 9
    1. ఆశయాలు, లక్ష్యాల తీర్మానం
      బి. 1946, డిసెంబర్‌ 11
    2. రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం
      సి. 1946, డిసెంబర్‌ 11
    3. రాజ్యాంగ పరిషత్తు శాశ్వత అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌
      డి. 1949, నవంబర్‌ 26
    4. రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఆమోదించింది
      1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
      2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
      3) 1- ఎ, 2-డి, 3-సి, 4-బి
      4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  11. కింది వాటిని జతపర్చండి
    ఎ. నాస్తిక రాజ్యం
    1. మత విరుద్ధ రాజ్యం
    బి. మత ప్రాతిపదిక రాజ్యం
    2. మతానికి అనుకూల రాజ్యం
    సి. లౌకిక రాజ్యం
    3. మత వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది
    డి. రీకాల్‌
    4. ప్రజా ప్రతినిధులు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఓటర్లు కాలపరిమితి కంటే ముందే తొలగించే పద్ధతి
    1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
    2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
    3) 1- ఎ, 2-డి, 3-సి, 4-బి
    4) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
  12. కింది వ్యాఖ్యల్లో సరైనవి?
    ఎ. సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ నిర్మాణసభ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనవారు
    బి. హెచ్‌సీ ముఖర్జీని రాజ్యాంగ నిర్మాణ సభ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు
    1) ఎ 2) బి
    3) ఎ, బి 4) ఏదీకాదు
  13. కింది వాటిని జతపర్చండి
    విషయం రాజ్యాంగ భాగం
    ఎ. ఆర్థిక, ఆస్తులు, ఒప్పందాలు, వ్యాజ్యాలు
    1. భాగం-5
    బి. కేంద్ర న్యాయ వ్యవస్థ
    2. భాగం-12
    సి. రాష్ర్టాల కార్యనిర్వాహకశాఖ
    3. భాగం-11
    డి. కేంద్ర రాష్ర్టాల మధ్య సంబంధాలు 4. భాగం-6
    1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
    2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
    3) 1- డి, 2-ఎ, 3-బి, 4-సి
    4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
  14. జతపర్చండి
    (దేశాలు, స్వీకరించిన అంశాలు)
    ఎ. రాజ్యాంగ సవరణ విధానం 1. జర్మనీ
    బి. ఆదేశిక సూత్రాలు 2. కెనడా
    సి. అత్యవసర పరిస్థితులు 3. దక్షిణాఫ్రికా
    డి. అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం 4. ఐర్లాండ్‌
    1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
    2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
    3) 1- సి, 2-బి, 3-ఎ, 4-బి
    4) 1-డి, 2-బి, 3-బి, 4-ఎ
  15. జతపర్చండి? (చట్టాలు) ఎ. 1919 చట్టం
    1. వైశ్రాయ్‌ కార్యనిర్వాహక మండలిలో ముఖ్య సైన్యాధికారి పదవిలో భారతీయుడిని నియమించడం
      బి. 1935 చట్టం
    2. డొమినియన్‌స్టేటస్‌ (స్వతంత్ర ప్రతిపత్తి)
      సి. 1940 ఆగస్టు ప్రతిపాదనలు
    3. ఫెడరల్‌ కోర్ట్‌ (సుప్రీంకోర్టు) ఏర్పాటు
      డి. 1945 వేవెల్‌ ప్రణాళిక
    4. హైకమిషనర్‌ పదవి ఏర్పాటు
      1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
      3) 1- డి, 2-సి, 3-ఎ, 4-బి
      4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
  16. జతపర్చండి? (చట్టాలు)
    ఎ. క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌
    1. 1940 ఆగస్ట్‌ 8
    బి. వేవెల్‌ ప్రణాళిక 2. 1945
    సి. క్రిప్స్‌ ప్రతిపాదనలు 3. 1946 మార్చి 23
    డి. ఆగస్ట్‌ ప్రతిపాదనలు 4. 1942 మార్చి 22
    1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
    2) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
    3) 1- సి, 2-బి, 3-డి, 4-ఎ
    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
  17. హేతువు (ఏ): రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వచట్టం అత్యంత మూలాధారమైనది
    కారణం (ఆర్‌): 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి 70 శాతం అంశాలు
    స్వీకరించారు
    1) ఏ, ఆర్‌ సరైనవి. ఏ కు ఆర్‌ సరైన వివరణ
    2) ఏ, ఆర్‌ సరైనవి. ఏ కు ఆర్‌ సరైన వివరణ కాదు
    3) ఏ వాస్తవం, ఆర్‌ అవాస్తవం
    4) ఏ అవాస్తవం, ఆర్‌ వాస్తవం
  18. కింది స్టేట్‌మెంట్లలో సరికానిది గుర్తించండి?
    1) రాజ్యాంగ నిర్మాణ సభ 1946లో ఏర్పడింది
    2) రాజ్యాంగ పరిషత్తు తొలిసమావేశానికి రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షత వహించారు
    3) రాజ్యాంగ పరిషత్తు తొలి సమావేశం 1946 డిసెంబర్‌ 9న జరిగింది
    4) రాజ్యాంగ పరిషత్తులో మొత్తం
    22 కమిటీలు ఉన్నాయి
  19. ఇటీవల వార్తల్లో నిలిచిన పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో నదియా జిల్లా ప్రాముఖ్యం ఏమిటి?
    1) ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే జిల్లా
    2) సర్జికల్‌స్ట్రైక్స్‌ జరిపిన జిల్లా
    3) కొత్తగా ఏర్పడిన జిల్లా
    4) ఏదీకాదు
  20. గణతంత్ర విధానం అంటే ఏమిటి?
    1) ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నికవడం
    2) నిర్ణీతకాలానికి ఎన్నిక ద్వారా ఎన్నికవడం
    3) నామినేట్‌ అవడం
    4) ప్రజాభిప్రాయం ద్వారా ఎన్నికవడం

1-1,     2-3,     3-3,     4-3,     5-3, 

6-1,     7-3,     8-4,     9-4,     10-2, 

11-2,     12-3,     13-2,     14-3,     15-2, 

16-3,     17-1,     18-2,     19-1,     20-2