GEOGRAPHY PRACTICE BITS 2

 

  1. కింది వాటిని జతపర్చండి
    ఎ. యాదాద్రి 1. భువనగిరి
    బి. మహబూబ్‌నగర్‌ 2. మన్యంకొండ
    సి. మేడ్చల్‌ 3. కీసరగుట్ట
    డి. వికారాబాద్‌ 4. అనంతగిరి కొండలు
    1) 1- ఎ, 2-బి, 3-సి, 4-డి
    2) 1-సి , 2-బి, 3-ఎ, 4-డి
    3) 1- ఎ, 2-సి, 3-డి, 4-బి
    4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
  2. తెలంగాణకు తూర్పు ఆగ్నేయం వైపు ఉన్న రాష్ట్రం?
    1) కర్ణాటక 2) మహారాష్ట్ర
    3) ఆంధ్రప్రదేశ్‌ 4) ఛత్తీస్‌గఢ్‌
  3. హైదరాబాద్‌ సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది?
    1) 480 మీ. 2) 600 మీ.
    3) 900 మీ. 4) 1030 మీ.
  4. సింగరేణి స్థాపించిన సంవత్సరం?
    1) 1914 2) 1951
    3) 1921 4) 1931
  5. నీస్‌, గ్రానైట్‌ ఎక్కువగా ఉన్న జిల్లా?
    1) నిజామాబాద్‌ 2) సంగారెడ్డి
    3) మెదక్‌ 4) పైవన్నీ
  6. రత్నగర్భ అని ఏ రాష్ర్టానికి పేరు?
    1) తెలంగాణ 2) ఏపీ
    3) కర్ణాటక 4) కేరళ
  7. దక్కన్‌ పీఠభూమిలో ఎత్తయిన ప్రాంతం?
    1) లక్ష్మీదేవికొండ 2) సత్నాల కొండ
    3) సోలామైల్‌ 4) యాదగిరి
  8. హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య వ్యాపించి ఉన్న కొండలు?
    1) దేవరకొండలు 2) రత్నగిరులు
    3) బాలాఘాట్‌ 4) రాఖీకొండలు
  9. కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది?
    1) కొయనా 2) శబరి
    3) పూర్ణ 4) ప్రవర
  10. తెలంగాణలో గోదావరి నది పొడవు మొత్తం?
    1) 440 కి.మీ 2) 720 కి.మీ
    3) 1440 కి.మీ 4) 560 కి.మీ
  11. నదులను గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
    1) లిమ్నాలజీ 2) పెదాలజీ
    3) పాటమాలజీ 4) హైడ్రాలజీ
  12. రాష్ట్రంలో గోదావరి నదికి కుడివైపున గల జిల్లాలు?
    ఎ. నిజామాబాద్‌ బి. మంచిర్యాల
    సి. జగిత్యాల డి. పెద్దపల్లి
    1) ఎ, బి 2) బి, సి
    3) బి, సి, డి 4) ఎ, బి, సి,డి
  13. రాష్ట్రంలో కృష్ణానది ప్రవహించే శాతం?
    1) 44% 2) 27%
    3) 25.2% 4) 22.2%
  14. మూసీ నది పొడవు?
    1) 130 కి.మీ 2) 250 కి.మీ
    3) 135 కి.మీ 4) 220 కి.మీ
  15. కింది వాటిలో సరికానిది?
    1) ఎల్లంపల్లి- పెద్దపల్లి, మంచిర్యాల
    2) కాళేశ్వరం- భూపాలపల్లి
    3) మంచ- నిజామాబాద్‌
    4) ప్రాణహిత, చెవేళ్ల- నవీపేట

1-1,     2-3,     3-2,     4-3,     5-4,

6-1,     7-3,     8-3,     9-1,     10-1,

11-1,     12-4,     13-2,     14-2,     15-1