HISTORY PRACTICE BITS 19

1. సముద్రగుప్తుడి అలహాబాద్ స్తంభ శాసన రచయిత ఎవరు?
ఎ. కుమార వల్లభుడు
బి. హరిసేనుడు
సి. దేవీగుప్తుడు
డి. హరిపుత్ర
సమాధానం: బి

2. కింది బౌద్ధమత శాఖలలో సిలోన్‌లో బాగా వేళ్లూనుకొన్నది ఏది?
ఎ. మహాయాన బౌద్ధమతం
బి. హీనయాన బౌద్ధమతం
సి. మహేంద్ర బౌద్ధమతం
డి. వజ్రయాన బౌద్ధమతం
సమాధానం: బి

3. దేవర్ణి క్షమాశ్రవణుడు ఎవరు?
ఎ. వల్లభిలో జరిగిన రెండో జైన పరిషత్తు అధ్యక్షుడు
బి. వైశేయాన సంప్రదాయ స్థాపకుడు
సి. వాకాటన్ రాజ్యంలోని ప్రముఖ ఆస్థానకవి
డి. మైత్రికులలో మొదటి గొప్పరాజు
సమాధానం: ఎ

4. మూడో బౌద్ధమత పరిషత్తు ఎక్కడ జరిగింది?
ఎ. పాటలీపుత్రం
బి. పెషావర్
సి. శాక్యపురి
డి. కనౌజ్
సమాధానం: ఎ

5. తంజావూరులోని రాజరాజేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు?
ఎ. రాజరాజ చోళుడు
బి. రాజేంద్ర చోళుడు
సి. రాజాధిరాజు
డి. నరసింహావర్మ
సమాధానం: ఎ

6. మొగలు చక్రవర్తిగా అక్బర్ పట్టాబిషక్తుడయ్చేటప్పటికి అతని వయస్సు ఎంత?
ఎ. 13ఏండ్లు
బి. 10ఏండ్లు
సి. 21ఏండ్లు
డి. 19ఏండ్లు
సమాధానం: ఎ

7. కామందకుడి నీతిసారం మనకు ఎవరి నుంచి ఎక్కువగా సమాచారం అందిస్తుంది?
ఎ. మౌర్యులు
బి. గుప్తులు
సి. బహుమనీ రాజులు
డి. విజయనగర సామ్రాజ్యం గురించి
సమాధానం: బి

8. గుప్తులకాలంలో వర్తకుల సముదాయాన్ని ఏమనేవారు?
ఎ. పుగ
బి. శ్రేణి
సి. కర్షపణ
డి. రూప్యక్
సమాధానం: ఎ

9. మొగలుల కాలంలో నగదు లావాదేవీలన్నింటికీ ఉన్న మౌలిక యూనిట్‌ను ఏమనేవారు?
ఎ. బంగారు మెహర్ లేదా అష్రఫ్
బి. వెండి రూపాయి
సి. రాగి డామ్ లేదా పైసా
డి. ఏదీకాదు
సమాధానం: ఎ

10. మౌర్యుల మంత్రి పరిషత్తును ఏమనేవారు?
ఎ. సమహర్తసభ
బి. అధ్యక్షమండలి
సి. మంత్రి పరిషత్తు
డి. దమ్మ మహామాత్రులు
సమాధానం: సి