HISTORY PRACTICE BITS 7

 1. హరప్పా నాగరికతా పట్టణంలో వృత్తాకార పట్టణ ప్రణాళిక కలిగిన ప్రదేశం ఏది?
ఎ. మొహంజోదార్
బి. లోథాల్
సి. చన్హుదారో
డి. బన్వాలి
సమాధానం: డి

2. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా పరిగణించారు?
ఎ. రుగ్వేదం
బి. యజుర్వేదం
సి. సామవేదం
డి. అధర్వణ వేదం
సమాధానం: సి

3. మానవత్వ ప్రతిపాదిన అశోకుడు ఏరోజున కొందరు ఖైదీలను విడుదల చేశాడు?
ఎ. జన్మదినం
బి. పట్టాభిషేకం రోజున
సి. బౌద్ధమతాన్ని అవలంబించిన రోజు
డి. కళింగ ఆక్రమణ రోజు
సమాధానం: బి

4. చైనా యాత్రికుడు ఫాహియాన్ ఎవరి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు?
ఎ. చంద్రగుప్త మౌర్యుడు
బి. సముద్రగుప్తుడు
సి. రెండో చంద్రగుప్తుడు
డి. హర్షవర్ధనుడు
సమాధానం: సి

5. సూర్యసిద్ధాంతాన్ని రచించింది?
ఎ. బ్రహ్మగుప్త
బి. ఆర్యభట్ట
సి. వరాహమిహిర
డి. ఏవరూ కాదు
సమాధానం: బి

6. వేదకాలంలో గోరపరాధము(పెద్ద నేరము)గా పరిగణించబడింది?
ఎ. వ్యక్తిని హత్యచేయుట
బి. ఎద్దును చంపటం
సి. రాజుకు ద్రోహం చేయుట
డి. గర్భస్రావం
సమాధానం: డి

7. ప్రాచీన సమాజంలో ఏ వర్గంవారు జైనమతాన్ని ఎక్కువగా అనుసరించేవారు?
ఎ. వర్తకులు
బి. వృత్తిపనివారు
సి. వ్యవసాయదారులు
డి. క్షత్రియులు
సమాధానం: ఎ

8. వ్యవసాయ పన్ను పద్ధతిని రద్దు చేసిన తొలి సుల్తాను?
ఎ. ముబారక్ ఖిల్జీ
బి. గియాసుద్దీన్ తుగ్లక్
సి. మహ్మద్ బిన్ తుగ్లక్
డి. ఫిరోజ్ షా తుగ్లక్
సమాధానం: సి

9. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్నూలు పాలెగాడు?
ఎ. చిన్నప్పరెడ్డి
బి. నరసింహారెడ్డి
సి. కే సుబ్బారెడ్డి
డి. దండసేన
సమాధానం: బి

10. మా కొద్దు ఈ తెల్లదొరతనం అనే పాటను రచించిన వారు?
ఎ. గురజాడ అప్పారావు
బి. గరిమెళ్ల సత్యనారాయణ
సి. ఉన్నవ లక్ష్మీనారాయణ
డి. త్రిపురనేని రామస్వామి చౌదరి
సమాధానం: బి