తెలంగాణ - 3 పద్మశ్రీ, 1 పద్మభూషణ్
ఆంధ్రప్రదేశ్ - 3 పద్మశ్రీ
తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్యలను పద్మశ్రీలు వరించాయి.
భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా(తెలంగాణ)కు సంయుక్తంగా పద్మభూషణ్ ప్రకటించింది. దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులకు
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే ఉత్సవాల
సందర్భంగా ప్రతి ఏడాది ప్రకటించిన విధంగానే 2022లో 128 మందికి పద్మ
అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్
అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో గరికపాటి నర్సింహారావు, సుంకర వెంకట ఆదినారాయణకు, గోసవీడు
షేక్ హసన్‌కు పద్మశ్రీ అవార్డులను 2022 ప్రకటించారు.