ఇండియన్ అసోసియేషన్ (Indian National Association)

           1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్ నాయకత్వలో ఉన్న యువ బెంగాల్ జాతీయవాదులు దీన్ని స్థాపించారు. ఈ సంస్థ ముఖ్య ఆశయాలు:

1. ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలతో భారత ప్రజలను సమైక్యపరచడం.
2. హిందూ ముస్లిం సఖ్యతను పెంపొందించడం.
3. దేశంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని సృష్టించడం మొదలైనవి. ఇండియన్ అసోసియేషన్ రాజకీయ సమైక్యతా సాధన దిశగా నడిచింది.

          ఈ అసోసియేషన్ 1883లో కలకత్తాలో మొదటి జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. 1885 డిసెంబర్ 25, 26, 27 తేదీల్లో బొంబాయిలో జరిగిన రెండో సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. అయితే 1885 డిసెంబరు 28న ఏఓ హ్యూమ్ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైన ఉమేష్‌చంద్ర బెనర్జీ ఆహ్వానం మేరకు సురేంద్రనాథ్ బెనర్జీ 1886లో తాను నెలకొల్పిన నేషనల్ కాన్ఫరెన్స్‌ను జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.