ఆస్కార్ 2022 - 94వ అకాడమీ అవార్డ్స్

  • కరోనా కారణంగా రెండు సంవత్సరాల వరకు ఆగిపోయిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఎట్టకేలకు 2022 సంవత్సరంలో తిరిగి కోలాహాలంగా ప్రారంభమైంది.
  • స్మిత్ మరియు ప్రెజెంటర్ మధ్య చిన్నపాటి ఘర్షణ మినహా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో కన్నుల పండుగగా జరిగింది.
  • ఈ ఏడాది కూడా ఉత్తమ డైరెక్టర్ అవార్డును లేడీ డైరెక్టర్ గెలుచుకోవడం మరో విశేషం. ఇక ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్నాడు), ఉత్తమ నటిగా జెస్సికా ఎంపికయ్యారు.
  • ఈ ఏడాది ఉత్తమ సినిమాగా 'కోడా' నిలిచింది. మనలోని భావాలను వ్యక్తీకరించడానికి మాటలే కాదు.. సైగలు కూడా సరిపోతాయని.. అవి కూడా మనల్ని హత్తుకుంటాయని ఆస్కార్ కమిటీ అభిప్రాయపడింది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి చిత్రం ఇదే. కోడా తన స్ట్రీమింగ్ సర్వీసును ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం విశేషం.
  • 12 ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న 'ది పవర్ ఆఫ్ ది డాగ్' కేవలం ఒకే ఒక్క(ఉత్తమ డైరెక్టర్ విభాగం) అవార్డుతో సరిపెట్టుకుంది.
  • పది నామినేషన్లు దక్కించుకున్న 'డ్యూన్' చిత్రం ఏకంగా ఆరు ఆస్కార్ అవార్డులను కైవశం చేసుకుంది.బెస్ట్ ఫారిన్ సినిమాగా జపాన్ సినిమా 'డ్రైవ్ మై కార్' నిలిచింది.
  • 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో మన దేశం నుంచి రింటూ థామస్ డైరక్షన్ చేసిన 'రైటింగ్ విత్ ఫైర్' నామినేషన్ దక్కించుకున్నప్పటికీ, ఆస్కార్ తేలేక పోయింది.

 


 అంతర్జాతీయం 24.03.2022 - 30.03.2022

2022 ఆస్కార్ విజేతలు వీరే.. 
* బెస్ట్ ఫిల్మ్ - చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్(CODA) 
* బెస్ట్ యాక్టర్ - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) 
* బెస్ట్ యాక్ట్రెస్ - జెస్సికా చస్టేన్(ద ఐస్ ఆఫ్ టామీ ఫే)
 * బెస్ట్ డైరెక్టర్ - జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ద డాగ్) 
* బెస్ట్ సపోర్ట్ యాక్టర్ - ట్రాయ్ కోట్సర్(CODA) 
* బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ) 
* బెస్ట్ సినిమాటోగ్రఫీ - గ్రెగ్ ఫ్రెజర్(డ్యూన్) 
* బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నో టైమ్ టు డై 
* బెస్ట్ డాక్యుమెంటరీ ఫియేచర్ - సమ్మర్ ఆఫ్ సోల్ 
* బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే - షాన్ హెడర్ (CODA) 
* బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - బెల్ ఫాస్ట్ (కెన్నత్ బ్రానా) 
* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జెన్నీ బీవన్(క్రూయెల్లా) 
* బెస్ట్ ఇంటర్నేషనల్ ఫియేచర్ - డ్రైవ్ మై కార్(జపాన్) 
* బెస్ట్ యానిమేటెడ్ ఫియేచర్ - ఎన్ కాంటో 
* బెస్ట్ ఒరిజినల్ స్కోర్ -హన్స్ జిమ్మర్(డ్యూన్)
 * బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ - డ్యూన్(పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్ జర్) 
* బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జో వాకర్(డ్యూన్) 
 * బెస్ట్ సౌండ్ -డ్యూన్(మాక్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్ లెట్) 
* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - డ్యూన్ 
* బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ - ద ఐస్ ఆఫ్ ది టామీ ఫే 
* బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్ - ది లాంగ్ గుడ్ బై 
* బెస్ట్ యానిమేటెడ్ ఫార్ట్ ఫిలిమ్ - ది విండ్ షీల్డ్ పైపర్ 
* బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ - ద క్వీన్ ఆఫ్ బాస్కెట్ బాల్