పైపులు - తొట్టెలు

 

* తొట్టిని నింపడానికి, ఖాళీ చేయడానికి పైపు ఉపయోగపడుతుంది.
* నింపేది కూడికగా (in let), ఖాళీచేసేది తీసివేతగా (out let) పరిగణించాలి.
* ఒక పంపు ఒక నీళ్ల ట్యాంకును నింపడానికి x గంటలు పడితే, ఒక గంటలో ఆ పంపు నింపే భాగం = 1x
* ఒక పంపు నిండి ఉన్న నీళ్ల ట్యాంకును y గంటల్లో ఖాళీచేస్తే ఒక గంటలో ఆ పంపు ఖాళీ చేసే భాగం = 1y
* ఒక పంపు ట్యాంకును x గంటల్లో నింపుతుంది. నిండి ఉన్న ట్యాంకును మరో పంపు y గంటల్లో ఖాళీ చేస్తుంది. (y>x) రెండు పంపులు ఒకేసారి తెరిస్తే 1 గంటలో నిండే భాగం = 1x1y
* ఒక పంపు ట్యాంకును x గంటల్లో నింపుతుంది. నిండి ఉన్న ట్యాంకును మరో పంపు y గంటల్లో ఖాళీ చేస్తుంది. (x>y) రెండుపంపులు ఒకేసారి పనిని ప్రారంభిస్తే 1 గంటలో ఖాళీచేసే భాగం = 1y1x
 
 
 
Q.A,B అనే రెండు పంపులు ఒక ట్యాంకును వరుసగా 20, 30 నిమిషాల్లో నింపుతాయి. రెండు పంపులు ఒకేసారి పని ప్రారంభిస్తే ట్యాంకు ఎంతకాలంలో నిండుతుంది?
A. 12 నిమిషాలు అవుతుంది. ఈ ప్రశ్నలో A అనే పంపు 1 నిమిషంలో నింపే భాగం =120, B అనే పంపు 1 నిమిషంలో నింపే భాగం =130
  రెండు పంపులు 1 నిమిషంలో నింపే భాగం = 120+130 = 3+260 = 112 నిమిషాలు అవుతుంది
   or 20×3020+30 = 60050 =12 నిమిషాలు నిండుతుంది
Q. ఒక పంపు ఒక ట్యాంకును 4 గంటల్లో నింపుతుంది. మరొక పంపు అదే ట్యాంకును 9 గంటల్లో ఖాళీచేస్తుంది. రెండు పంపులను ఒకేసారి తెరిచినట్లయితే ఆ ట్యాంకు ఎంతకాలంలో నిండుతుంది?
A. 1419 = 9436 = 536 =7.2
   మొత్తం ట్యాంకు నిండటానికి పట్టేకాలం = 365 = 7.2 గంటలు.
Q.ఒక ట్యాంకును A అనే పంపు 5 గంటల్లో, B అనే పంపు 10 గంటల్లో, C అనే పంపు 30 గంటల్లో నింపుతాయి. 3 పంపులు ఒకేసారి తెరిచినట్లయితే ఎంత సమయంలో ట్యాంకు నిండుతుంది?
A.  15+110+130 = 6+3+130 = 1030 =13
   3 పంపులు ఒకేసారి తెరిచినట్లయితే 3 గంటల్లో నిండుతుంది
Q. A, B అనే పంపులు ఒక ట్యాంకును వరుసగా 5, 6 గంటల్లో నింపుతాయి. C అనే పంపు 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. 3 పంపులు ఒకేసారి తెరిచినట్లయితే ట్యాంకు ఎంత కాలంలో నిండుతుంది?
A.   15+16112 = 12+10560
    = 1760 =3 917 గంటల్లో నిండుతుంది
   or 5×6×126×12+5×126×5 = 3 917 గంటల్లో నిండుతుంది
Q. ఒక పంపు ఒక ట్యాంకును నింపుతుంది. మరో పంపుకు ఈ పంపు కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యం ఉంది. రెండు పంపులు కలిపి ఒక ట్యాంకును 36 నిమిషాల్లో నింపుతాయి. ఆలస్యంగా నింపే పంపు ఎంత సమయంలో ట్యాంకును నింపుతుంది?
A.  1x+13x = 136
   3+13x =136
   43x = 136 (అడ్డగుణకారం చేస్తే)
   3x = 36 × 4
   3x =144 నిమిషాలు.
Q.ఒక పంపు ఒక ట్యాంకును 6 గంటల్లో నింపుతుంది. సగం ట్యాంకు నిండిన తర్వాత అదే పని సామర్థ్యం ఉన్న మరో 3 పంపులు మొత్తం ట్యాంకును నింపడానికి ఎంత సమయం పడుతుంది?
A. ఈ ప్రశ్నలో ఒక పంపు 6 గంటల్లో నింపుతుంది. సగం ట్యాంకు నిండటానికి 3 గంటలు పడుతుంది.
4 పంపులు 1 గంటలో నింపే భాగం = 4 × 16
     = 23
ట్యాంకు ఇంకా సగ భాగం మిగిలింది = 12
సగభాగం నాలుగు పంపులు నింపడానికి పట్టేకాలం
 = 32 × 12 = 34 × 60 = 45 నిమిషాలు.
 మొత్తం ట్యాంకు నిండటానికి పట్టేకాలం 3 గంటల 45 నిమిషాలు.
Q. ఒక పైపు ఒక ట్యాంకును 2 గంటల్లో నింపుతుంది. ట్యాంకు అడుగు భాగంలో లీకేజి ఉండటం వల్ల ఆ ట్యాంకు 2 1/3 గంటల్లో నిండుతుంది. నిండి ఉన్న ట్యాంకు లీకేజి వల్ల ఎంతలో ఖాళీ అవుతుంది?
A. 14 గంటలు అవుతుంది.
   పైపు 2 గంటల్లో నింపుతుంది.
  అది 1 గంటలో నింపే భాగం = 12
లీకేజి ఉండటం వల్ల అది 2 13 గంటల్లో నిండుతుంది.
ఇది 1 గంటలో ఖాళీ చేసే భాగం = 173 = 37
1237 = 7614 = 114
  మొత్తం ట్యాంకు 14 గంటల్లో ఖాళీ అవుతుంది.
Q. రెండు పైపులు A , B ఒక ట్యాంకును వరుసగా 15, 20 నిమిషాల్లో నింపుతాయి. రెండు పైపులు ఒకేసారి పని ప్రారంభించాయి. 4 నిమిషాల తర్వాత A పైపు మూసివేశారు. అయితే మొత్తం ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది?
A. 14 నిమిషాల 40సెకన్లు అవుతుంది.
   ఈ ప్రశ్నలో ఎ, బి పైపులు 1 నిమిషంలో నింపే భాగం = 115+120 = 4+360 = 760
   4 నిమిషాల్లో ఆ రెండు పైపులు నింపే భాగం =760 × 4 = 715
మిగిలినభాగం =815 ఈ భాగం Bపైపు నింపాలి.
  815×20 = 323 = 10 23 నిమిషాలు అంటే
  10 నిమిషాల 40 సెకన్లు.
మొత్తం ట్యాంకు నిండటానికి పట్టేకాలం
  = 4 నిమిషాలు + 10 నిమిషాలు, 40 సెకన్లు.
   14 నిమిషాల 40 సెకన్లు.
Q. 3 పైపులు A, B, C లు కలిసి ఒక ట్యాంకును 6 గంటల్లో నింపుతాయి. మూడింటిని ప్రారంభించిన 2 గంటల తర్వాత C పైపును ఆపివేశారు. మిగిలిన ట్యాంకును A, B లు కలిసి 7 గంటల్లో నింపాయి. C ఒక్కటే ఆ ట్యాంకును ఎన్ని గంటల్లో నింపగలదు?
A. 14 అవుతుంది.
   ఈ ప్రశ్నలో 3 పైపులు 1 గంటలో నింపేభాగం = 16 తర్వాత 2 గంటల్లో నింపే భాగం =16 × 2 = 13
  మిగిలిన భాగం = 1- 13=23
  A,B 7 గంటల్లో =23 వ వంతు నింపుతాయి.
   1 గంటలో నింపే భాగం = 23 × 17 = 221
   C = (A+B+C)-(A+B) = 16221
   = 342 =114
   C పైపు ఒక్కటే 14 గంటల్లో నింపుతుంది.
Q. 2 పైపులు A, B కలిసి ఒక ట్యాంకును 4 గంటల్లో నింపుతాయి. B అనే పైపు ఒక్కటే ట్యాంకును నింపడానికి A కంటే 6 గంటలు ఎక్కువగా తీసుకుంది. అయితే A పైపు ఒక్కటే ఎంత సమయంలో ట్యాంకును నింపుతుంది?
A. 6 గంటలు అవుతుంది.
   A అనే పైపు ఒక్కటే x గంటల్లో ట్యాంకును నింపుతుంది. అప్పుడు B అనే పైపు (x+6) గంటల్లో నింపుతుంది. రెండు పైపులు 1 గంటలో నింపే భాగం 1/x + 1/(x+6) = 1/4
   x+6+xx(x+6) = 1 (అడ్డ గుణకారం చేస్తే)
   => 4 (2x + 6) = x (x + 6)
   => 8x+24 = x²+6x
   => x²+6x-8x-24 = 0
   => x²-2x-24 = 0
   => x²-6x+4x-24 = 0
   => x(x-6)+4(x-6) = 0
   => (x-6)(x+4) = 0
   x = 6 గంటలు.