పడవలు ప్రవాహలు

 

  • M అనేది నిలకడగా వున్న నీటిలో పడవ వేగం
  • S అనేది నదిలో ప్రవహిస్తున్న నీటివేగం
  • ds అనేది నది ప్రవాహ దిశలో పడవవేగం  ds = M+S=నీటివేగం+పడవ వేగం
  • us అనేది నది ప్రవాహనికి వ్యతిరేఖ దిశలో పడవవేగం
us = M-S
M =ds+us2
S = dsus2
 
 
Q. నిలకడగా వున్న నీటిలో పడవవేగం 18 km/h,నదిలో ప్రవహిస్తున్న నీటివేగం 8 km/h .అయినా ప్రవాహ దిశలో పడవవేగం ఎంత?
A.   M= 18 , S = 8
   ds =M+S = 18+ 8 = 26 km/h
Q. నిలకడగా వున్న నీటిలో పడవవేగం 24 km/h,నదిలో ప్రవహిస్తున్న నీటివేగం 6 km/h .అయినా ప్రవాహానికి వ్యతిరేకదిశలో పడవవేగం ఎంత?
A.   us = M-S = 24-6=18 km/h
Q. నిలకడగా వున్న నీటిలో పడవవేగం 16 km/h ఆ పడవలో ఒక వ్యక్తి నది ప్రవాహదిశలో 20km/h వేగంతో ప్రయాణించెను.అయినా నదిలో ప్రవహిస్తున్న నీటివేగం ఎంత?
A.  M = 16, ds=20, M+S = 20 , M+S= ds
  16+S =20
   S = 20-16 = 4km/h
Q. 3 km/h వేగం తో ప్రవహిస్తున్న నది ప్రవాహం లో ఒక బాలుడు 15 km/h వేగం తో ఈదెను.అయినా అతను నిలకడగ వున్న నీటిలో ఎంత దూరం ఈదగలడు?
A. S = 3
  ds=15 ds=M+S
   M+S = 15
   M+3 = 15
  M = 12km/h
Q. నిలకడగావున్న నీటిలో పడవ వేగం 24 km/h ఆ పడవలో ఒక వ్యక్తి నది ప్రవాహానికి ఎదురుగా 18 km/h వేగంతో పయాణించెను. అయినా నదిలో ప్రవహిస్తున్న నీటివేగం ఎంత?
A.   m = 24, us = 18, us = M-S
   24 -S = 18
   S = 6 km/h
Q. ఒక బాలుడు నది ప్రవాహానికి వ్యతిరేఖ దిశలో 12 km/h వేగంతో ఈదును.ప్రవాహవేగం 3 km/h అయినా అతను ప్రవాహనికి వాలుగా ఎంత వేగంతో ఈదగలడు.
A.  ds = 12, S= 3 , us= M-S
  M-3 =12 , M= 15
   ds = 15 +3 =18 km/h
Q. నిలకడగా వున్న నీటిలో పడవవేగం 24 km/h. పడవలో ఒక వ్యక్తి నది ప్రవాహానికి వాలుగా 32 km/h వేగంతో ప్రయాణించెను. అయినా నది ప్రవాహానికి వ్యతిరేఖ దిశలో పడవవేగం ఎంత?
A. M= 24, ds=32 M+S = 32
  24+S = 32
   S= 8 us= M-S us=24-8 =16 km/h
Q. పడవలో ఒక వ్యక్తి నీటి ప్రవాహదిశలో 24 km/h వేగంతో ప్రయాణించెను, అతను నీటి ప్రవాహనికి వ్యతిరేఖ దిశలో 16 km/h వేగంతో ప్రయాణించెను.అయినా నిలకడగా వున్న నూటిలో పడవవేగం ?
A.  ds = 24, us = 16
  M=ds+us2
   24+162 =20 km/h
Q. ఒక బాలుడు నీటి ప్రవాహదిశలో 18 km/h వేగంతోనూ,నీటి ప్రవాహానికి వ్యతిరేఖ దిశలో 15 km/h వేగంతోనూ ప్రయాణించెను. అయినా నదిలో ప్రవహిస్తున్న నీటి వేగం ఎంత?
A.  ds =18 us = 15
   S = dsus2
   = 18152 = 1.5 km/h
Q. ఒక బాలుడు నది ప్రవాహానికి వ్యతిరేకదిశలో 12 km/h వేగంతో ఈదెను అయినా నిలకడగా వున్న నీటిలో అతను ఎంత వేగంతో ఈదగలడు.
A.  us = 12 ds = 20 M = 20+122= 16 km/h