లాభ-నష్టాలు

* లాభం = అమ్మిన ధర -కొన్న ధర
* నష్టం = కొన్న ధర-అమ్మిన ధర
* లాభం% = 100× లాభంకొన్నధర
* నష్టం% = 100×నష్టంకొన్నధర
* రాయితీ ని వస్తువు యొక్క ముద్రించిన ధర పై మత్రమే లెక్కించవలెను
* ఒక వస్తువును కొన్నధర రూ. c, అమ్మిన ధర రూ. s అనుకోండి. నష్టశాతం = l % అయితే వీటి మధ్య సంబంధం
s = c*100l100 or c = 100*s100l
* ఒక వ్యాపారి రెండు వస్తువులను విడివిడిగా ఒకే ధరకు అమ్మాడు. మొదటిదానిపై x % లాభం, రెండో దానిపై x % నష్టం వచ్చింది. మొత్తంమీద అతడికి నష్టం (ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ నష్టమే ఉంటుంది). 
 
Q. అమ్మిన వెలకు కొన్నవెలకు నిష్పత్తి 3:2 అయితే లాభశాతం ఎంత?
A. అమ్మిన వెలకు,కొన్నవెలకు నిష్పత్తి 3:2
  కాబట్టి అమ్మిన వెల = 3x అనుకుంటే
   కొన్నవెల = 2x అవుతుంది
  లాభం = 3x-2x = x
  లాభాశాతం = లాభం×100కొన్నవెల
   ⇒ x2x×100 = 50
Q.ఒక వస్తువును రూ.450కి అమ్మితే 25% నష్టం వస్తుంది. అయితే 50% లాభం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి?
A. అమ్మిన వెల = రూ. 450, నస్టం = 25%
   అయితే కొన్నవెల = అమ్మిన వెల×100100నస్టశాతం
   ⇒ 450×10010025=600
   కాబట్టి ఆ వస్తువు కొన్నవెల = రూ .600
   ఇప్పుడు 50% లాభం రావాలంటే ఆ వస్తువును అమ్మవలసిన వెల
   ⇒ కొన్నవెల×(100+లాభాశాతం)100
   ⇒ 600×(100+50)100= 900
   ⇒ 900
Q.15 వస్తువుల కొన్నవెల, 12 వస్తువుల అమ్మిన వెల సమానం అయితే లాభశాతం/నస్టశాతం ఎంత?
A. ఒక వస్తువు కొన్నవెల = x అనుకుంటే , అప్పుడు దత్తాశం నుంచి
   ⇒ 15 × x = 12 × అమ్మిన వెల
   ⇒ అమ్మిన వెల = 15×x12= 5x4
   ⇒ లాభం = 5x4x= 5x4
   ⇒ లాభ శాతం = x4x×100 = 25
Q. ఒక వ్యాపారి వస్తువులను కొన్న ధరకు అమ్ముతానని చెప్పి బరువు 1 కే.జి. కి బదులుగా 900 గ్రాములే తూచాడు. అతడి లాభశాతం ఎంత?
A. బరువులో తేడా x = 1000-900 = 100 గ్రాములు.
  ⇒ నిజ బరువు y =1000
  ⇒ లాభ శాతం = 100900×*100 = 1119 %
  ⇒ లాభ శాతం = 1119 %
Q.ఒక పుస్తకాన్ని 120 రూ.కొనుగోలు చేసి 150 రూ.కి అమ్మెను అయిన లాభ శాతం ఎంత?
A. 150-120=30
  100×30120=25%
Q. ఒక పెన్ ను 4.50 రూ లకు కొనుగోలు చేసి 6 రూ లకు అమ్మిను అయినా లభ శతం ఎంత?
A.   1 రూ =100 పైసలు
   లాభం = 50 పైసలు
  లాభ శాతం= 100×150450=33.3%
Q. ఒక సైకిల్ ను 900 రూ లకు కొనుగోలు చేసి 300 రూ ల తో రిపేర్ చేయించి 1500 రూ లకు అమ్మెను.అయిన లాభ శాతం ఎంత?
A.  సైకిల్ కొన్న ధర+రిపేర్ ఖర్చు =900+300=1200 రూ
   అమ్మిన వెల =1500 రూ
  లాభం =300 రూ
  లాభ శాతం = 100×3001200=25%
Q. ఒక పండ్ల వ్యాపారి డజను మామిడి పండ్లను 15 రూ లకు కొనుగోలు చేసి ఒక్కక్కటి 1.50 రూ కు అమ్మిన లాభ శాతం ఎంత?
A.  కొన్న వెల =15 రూ
  అమ్మిన వెల =12×1.5=18 రూ
  లాభ శాతం = 100×315=20%
Q. ఒక గడియారాన్ని 300 రూ లకు కొనుగోలు చేసి 240 రూ లకు అమ్మెను అయిన నష్ట శాతం?
A. నష్ట శాతం = 100×60300=20%
Q. ఒక పుస్తకాని 150 రూ లకు అమ్మడం వల్ల 30రూ లాభం కలదు అయిన లాభ శాతం?
A. లాభ శాతం = 100×30120=25%
Q. ఒక పుస్తకాని 60 రూ లకు అమ్మడం వల్ల 15 రూ నష్టం కలదు అయిన నష్ట శాతం?
A. నష్ట శాతం = 100×1575=20%
Q.ఒక వ్యాపారి 5 రూ లకు 6 పెన్నులు కొనుగోలు చేసి 6 రూ లకు 5 పెన్నులు అమ్మెను అయిన లాభ శాతం ఎంత?
A.  6 5
   5 6 ⇒ 6×6 - 5×5 = 11
   లాభ శాతం = 100 × 1125= 44%
Q.10 రూ లకు 11 పుస్తకాలు కొని 11రూ లకు 10 పుస్తకాలు అమ్మెను అయిన లాభ శాతం?
A.  11 10
  10 11 ⇒10×10 - 11×11 = 21
  లాభ శాతం = 100× 21100 = 21%
Q. ఒక పుస్తకాన్ని 270 రూ లకు అమ్మడం వల్ల 10% నష్టం కలదు అయినా దాని కొన్న ధర?
A. 90→270
  100→? ⇒ 270× 10090 = 300 రూ
Q.ఒక కుర్చీని 1040 రూ లకు అమ్మడం వల్ల 20% నష్టం కలదు అయిన దాన్ని కొన్న ధర?
A. 80% → 1040
  100 → ? ⇒ 1040 × 10080 = 1300 రూ
Q. ఒక రేడియోని 720 రూ లకు అమ్మడం వలన 20 శాతం లాభం కలదు అయినా దాని కొన్న ధర ఎంత?
A. 120 -> 720
   100 -> ? ⇒ 100 × 720120 = 600 రూ
Q. 24 పుస్తకాలు కొన్నధర 30 పుస్తకాలు అమ్మినధరకి సమానం అయిన నష్ట శాతం?
A.  30-24 = 6
  నష్ట శాతం = 100 × 630 = 20%
Q. 40 నారింజ పండ్లు కొన్న ధర 30 నారింజ పండ్లు అమ్మిన ధరకు సమానం అయిన లభ శాతం?
A.  40-30 = 10
  లభ శతం = 100 × 1030 = 33.33%
Q. ఒక వ్యాపరి వరుసగా 2 రాయితీలు 30%,10% ఇచ్చెను అయిన మొత్తం ఎంత శాతం రాయితీ ఇచ్చెను?
A. 100× 70100 ×90100 = 63
  ⇒ 100-63 = 37%
Q. ఒక మోసకారి వ్యాపరి తన వస్తువులను కొన్నధరకె అమ్ముతాడు కానీ 25% లాభం రావడానికి 1kg బరువుకు బదులు ఎంత బరువును ఉపయోగించవలెను.
A.  125% → 1000 గ్రా
   100% → ?
   1000×100125=800 గ్రా
Q. ఒక వ్యాపారి తన వస్తువుపై 20% ఎక్కువ ధరని ముద్రించి 10% రాయితీ ప్రకటించెను అయినా లాభ శాతం ఎంత?
A.  100× 20100 × 90100 = 108
  108-100 = 8%
Q. ఒక వ్యాపారి తన వస్తువుపై 10% రాయితీ ఇచ్చెను. 17% లాభం కలదు.అయినా తన వస్తువుపై ఎంత శాతం ఎక్కువ ధరను ముద్రించెను.
A. 100× y100 × 90100 = 117
   y = 130
   130-100=30%
Q.A అనే వ్యక్తి ఒక గడియారాన్ని కొనుగోలు చేసి 20% లాభంతో B కి అమ్మెను. B అనే వ్యక్తి 10% నష్టం తో C కి అమ్మెను.C అనే వ్యక్తి 540 రూ చెల్లించెను అయినా A కొన్నధర ఎంత?
A.  y × 120100 × 90100 = 540
   y= 500