‘ప్రకటనలు - వాదనలు’ చాప్టర్‌లోని ప్రశ్నలు ప్రకటనల రూపంలో ఉంటాయి.
ప్రకటనల కింద రెండు వాదనలు అవును లేదా కాదు అని ఇస్తారు. ఈ ప్రశ్నలకు జవాబు
గుర్తించడానికి సూచనలు..
*. ఈ చాప్టర్‌లోని ప్రశ్నలకు జవాబు గుర్తించేటప్పుడు ఆ జవాబు
(వాదనలు) ప్రకటనకు సంబంధించి ఉండాలి. కానీ నిజ జీవితానికి సంబంధించి
అన్వయించుకోకూడదు.
*. బలమైన వాదనే సరైన వాదన అవుతుంది. అవును అని ఉన్నా, లేదా కాదు అని ఉన్నా బలమైన వాదనే సరైంది.
*. వాదనల్లో తిరిగి ప్రశ్నించినట్టు ఉంటే ఆ వాదన సరైంది కాదు.
*. వాదనలు నిజాలుగా ఉండాలి. కానీ ఊహలుగా ఉండకూడదు.
ఉదాహరణ:
ప్రకటన: భారతదేశంలో రూపాయికే కిలో బియ్యం ఇవ్వొచ్చా?
వాదన -1: అవును, పేదరిక నిర్మూలనకు కేవలం ఇదొక్కటే మార్గం.
వాదన -2: కాదు, ప్రభుత్వంపై ఇప్పటికే అధిక భారం ఉంది.
సమాధానం: 2 మాత్రమే సరైంది
వివరణ: పేదరిక నిర్మూలనకు ఇదొక్కటే మార్గం అని చెప్పడం
మిగతా అంశాలను విస్మరించినట్టే అవుతుంది కాబట్టి వాదన 1 సరైంది కాదు. కానీ
వాదన 2 మాత్రమే సరైంది, బలంగా ఉంది.
కింద ప్రకటనలు, వాటి కింద రెండు వాదనలు ఉన్నాయి. ఆ
వాదనలను జాగ్రత్తగా విశ్లేషించి ఏ వాదన బలమైందో, ఏది బలహీనమైందో/ పేలవమైందో
గుర్తించాలి. ఆప్షన్‌ను కింది విధంగా ఎంచుకోవాలి.
1. కేవలం వాదన-1 మాత్రమే బలమైంది అయితే.
2. కేవలం వాదన-2 మాత్రమే బలమైంది అయితే.
3. రెండు వాదనలూ సరైనవి కాకపోతే.
4. రెండు వాదనలూ సరైనవి అయితే.
Q. ప్రకటన: భారత్‌లో ఒక రాష్ర్టం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లడం నిషేధించాలా?
వాదన -1: కాదు, ప్రతి పౌరుడు రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించవచ్చు.
వాదన -2: అవును, దీని ద్వారా వనరులు సద్వినియోగం అవుతాయి.
జ. Option (1)
Q. ప్రకటన: కళాశాలల్లో / యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలు అవసరమా?
వాదన -1: లేదు, దీనివల్ల క్యాంపస్‌లో రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది.
వాదన -2: అవును. ఇది అవసరం ఎందుకంటే విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులు.
జ. Option (4)
Q. ప్రకటన: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అవసరమా?
వాదన -1: అవును. భారత్ శాంతి సౌభ్రాతృత్వాన్ని కోరుకునే దేశం.
వాదన -2: కాదు. ఎందుకంటే ముందుగా భారత్‌లో పేదరికాన్ని తొలగించాలి.
జ. Option (1)
Q. ప్రకటన: పెళ్లికి ముందే కాబోయే జంటకు వైద్య పరీక్షలు అవసరమా?
వాదన -1: లేదు. అలాంటి ఆలోచన ఊహించలేనిది/ భరించరానిది.
వాదన -2: అవును. దీనివల్ల జన్యులోపాలతో పుట్టే బిడ్డల సంఖ్య తగ్గుతుంది.
జ. Option (2)
Q. ప్రకటన: ఎల్పీజీపై సబ్సిడీని విరమించాలా?
వాదన -1: లేదు. ఇది మామూలు ప్రజలపై భారాన్ని పెంచుతుంది.
వాదన -2: అవును. దీనివల్ల నిజమైన పేదలు లబ్ధిపొందడం లేదు.
జ. Option (1)
Q. ప్రకటన: కిరోసిన్‌పై సబ్సిడీ పెంచాలా?
వాదన -1: అవును. దీనిమూలంగా పేదలకు మేలు జరుగుతుంది.
వాదన -2: కాదు మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేదు.
జ. Option (1)
Q. ప్రకటన: కత్తి కంటే కలం గొప్పదా?
వాదన -1: అవును. ఎందుకంటే రచయితలు ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తారు.
వాదన -2: కాదు. ఎందుకంటే కత్తి బలంతో ఒక వ్యక్తి అందరినీ జయించవచ్చు.
జ. Option (1)
Q. ప్రకటన: ప్రయోగ పరీక్షల కోసం జంతువులను చంపాలా?
వాదన -1: అవును. అవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి.
వాదన -2: కాదు. మేం అహింసకు సహకరిస్తాం.
జ. Option (3)
Q. ప్రకటన: సైన్యంలో చేరడానికి 18 ఏళ్ల లోపు వారిని అనుమతించాలా?
వాదన -1: లేదు. 18 ఏళ్ల లోపు వారికి శారీరక, మానసిక ఎదుగుదల తగినంత ఉండదు. కాబట్టి వారు ఆ భారాన్ని మోయలేరు. వాదన-2: అవును. ఎక్కువ కాలం సైన్యంలో సేవ చేయడానికి, దేశంలో ఆర్మీని అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుంది.
జ. Option (1)
Q. ప్రకటన: ప్రైవేటు రంగంలో కూడా బలహీన వర్గాల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలా?
వాదన -1: లేదు. ప్రైవేటు రంగం వారు దీన్ని అంగీకరించరు.
వాదన -2: అవును. దీనివల్ల ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
జ. Option (2)
Q. ప్రకటన: అన్ని పొగాకు ఉత్పత్తులను మనదేశంలో నిషేధించాలా?
వాదన -1: లేదు. దీనివల్ల నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది.
వాదన -2: కాదు. దీనివల్ల పొగాకు ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి సమకూరదు.
జ. Option (3)
Q. ప్రకటన: మనదేశంలో ఆదాయ పన్ను రద్దు చేయాలా?
వాదన -1: అవును. ఎందుకంటే రోజు కూలీ చేసుకునేవారికి ఇది అదనపు భారంగా మారుతుంది.
వాదన -2: లేదు. ఎందుకంటే రెవెన్యూ శాఖకు ఇది మంచి ఆదాయ వనరు అవుతుంది.
జ. Option (2)
Q. ప్రకటన: రక్షణ రంగంలా విద్యను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలా?
వాదన -1: లేదు. విద్య రాష్ట్రానికి సంబంధించింది. దీన్ని రాష్ర్ట పరిధిలోనే ఉంచాలి.
వాదన -2: అవును. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన విద్యాభివృద్ధి సాధ్యపడాలంటే ఇది ఒక్కటే మార్గం.
జ. Option (1)
Q. ప్రకటన: వ్యవసాయంలో క్రిమి సంహారక మందుల వాడకం తగ్గించాలా?
వాదన -1: అవును. భూగర్భ జలాలు కలుషితం అవకుండా పరిరక్షించవచ్చు.
వాదన -2: కాదు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుంది.
జ. Option (2)
Q. ప్రకటన: ప్రజాస్వామ్యంలో అన్ని వార్తలు ప్రభుత్వ నియంత్రణలో ఉండాలా?
వాదన -1: అవును. ప్రత్యేకమైన వార్తలు మాత్రమే ప్రజల్ని కలవరపెడతాయి.
వాదన -2: కాదు. నియంత్రించిన వార్తలు విశ్వాసం కోల్పోతాయి.
జ.Option (2)
Q. ప్రకటన: ముంబైలో మళ్లీ పెద్ద పరిశ్రమల స్థాపన అవసరమా?
వాదన -1: అవును. వాటివల్ల కొత్తగా ఉద్యోగావకాశాలు లభ్యమవుతాయి.
వాదన -2: లేదు. వాటి వల్ల కాలుష్యం స్థాయి మరింత పెరుగుతుంది.
జ. Option (4)
Q. ప్రకటన: భారత్‌లో అన్ని రంగాల్లో కంప్యూటరీకరణ అవసరమా?
వాదన -1: అవును. వాటివల్ల పనినాణ్యత, కచ్చితత్వం పెరుగుతుంది.
వాదన -2: లేదు. దీనివల్ల ఉద్యోగాల్లో అసమానతలు పెరుగుతాయి. మానవ వనరులు నిరుపయోగం అవుతాయి.
జ. Option (4)
Q. ప్రకటన: విదేశాలతో నదుల అనుసంధానంపై ప్రణాళిక అవసరమా?
వాదన -1: అవును. ఎందుకంటే అతివృష్టి, అనావృష్టిలను ఎదుర్కొనొచ్చు.
వాదన -2: కాదు. ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది.
జ. Option (4)
Q. ప్రకటన: మీడియాలో పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించాలా?
వాదన -1: అవును. కేవలం ఇలా మాత్రమే ప్రజలను కేన్సర్ నుంచి రక్షించొచ్చు.
వాదన -2: లేదు. దీనివల్ల పొగాకు అమ్మకాలు తగ్గుతాయి.
జ. Option (3)
Q. ప్రకటన: ఎవరైతే డ్రగ్స్ కు బానిసై ఇతరులను కూడా ఆ దురలవాట్లకు లోను చేస్తారో వారికి కఠిన శిక్షలు అమలు చెయ్యాలా?
వాదన -1: కాదు. ఎవరూ.. ఎవరి జీవితాన్ని ప్రభావితం చేయరు.
వాదన -2: అవును. ఎవరైతే వారి జీవితంతోపాటు ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటారో వాళ్లు చాలా ప్రమాదం.
జ. Option (2)
Q. ప్రకటన: ఐదో తరగతి వరకు ఉండే అన్ని వార్షిక పరీక్షలు రద్దు చేయాలా?
వాదన -1: అవును. చిన్న వయసులో విద్యార్థులపై అధిక భారం మోపొద్దు. అలాంటి పరీక్షలు వారి శారీరక, మానసిక ఎదుగుదలపై దుష్ర్పభావం చూపుతాయి.
వాదన -2: కాదు. అలా చేస్తే విద్యార్థులు శ్రద్ధగా చదవలేరు. అయినప్పటికీ పై తరగతులకు వెళతారు. దీనివల్ల భవిష్యత్తులో చదవబోయేది సమస్యగా మారవచ్చు.
జ. Option (2)
Q. ప్రకటన: భారతదేశంలోని పత్రికలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఇవ్వాలా?
వాదన -1: అవును. దీనివల్ల ప్రజలు రాజకీయం గురించి పూర్తిగా తెలుసుకుంటారు.
వాదన -2: లేదు. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.
జ. Option (1)
Q. ప్రకటన: మనదేశంలో వైద్యవృత్తిని జాతీయం చేయాలా?
వాదన -1: లేదు. ఏ దేశం ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలు చేపట్టదు.
వాదన -2: అవును. దీనివల్ల అవినీతి వైద్య ప్రాక్టీషనర్‌లను తొలగించవచ్చు.
జ. Option (3)