ప్రకటనలు - పర్యవసానాలు

 

          ప్రకటనలు-పర్యవసానాలు అంశం నుంచి అడిగే ప్రశ్నల్లో ఒక ప్రకటన, రెండు పర్యవసానాలు ఇస్తారు. ప్రకటనల ఆధారంగా ఇచ్చిన పర్యవసానాల్లో ఏది సరైందో గుర్తించాలి. టీఎస్‌పీఎస్సీ జనరల్ స్టడీస్ పరీక్షలతోపాటు ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లోనూ 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యాంశాలు

*. ప్రకటన ఒక సమస్య అయితే దాని పరిష్కారాలు పర్యవసానాల్లో ఉంటాయి. ఇచ్చిన సమస్యకు అనుగుణంగా అభ్యర్థి పర్యవసానాలను ఎంచుకోవాలి.
*. ప్రకటనలు వివిధ రకాలుగా ఉంటాయి.
ఉదా: సమస్యలు, నిజాలు
*. ప్రకటనలను అభ్యర్థులు నిజమని నమ్మాలి.
*. ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తే పర్యవసానం ఏది సరైందో గుర్తించడం సులువే.



Q. ప్రకటన: ఎండాకాలంలో కలుషిత నీరు తాగడం వల్ల ఏటా చాలా మంది చనిపోతున్నారు.
పర్యవసానం 1: ప్రజలందరికీ రక్షిత మంచినీటిని ప్రభుత్వం సరఫరా చేయాలి.
పర్యవసానం 2: నీటి కాలుష్యం గురించి ప్రజలకు అవగాహన ఉండి, నీటి కాలుష్యానికి దూరంగా ఉండాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే

జ. Option (4)


Q. ప్రకటన: 2011 జనాభా లెక్కల్లో పురుష, స్త్రీ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది.
పర్యవసానం 1: ప్రభుత్వం మరోమారు జనాభా లెక్కలను సేకరించాలి.
పర్యవసానం 2: పురుష, స్త్రీ నిష్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్‌‌టమెంట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే

జ. Option (2)


Q. ప్రకటన: ఈ మధ్య ఇంటర్‌నెట్ చౌర్యం అధికంగా జరగడంతో ఇంటర్‌నెట్ వినియోగదారులు భయపడుతున్నారు.
పర్యవసానం 1: ఇంటర్‌నెట్ చౌర్యం చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
పర్యవసానం 2: వినియోగదారులు ఇంటర్‌నెట్‌ను తక్కువగా వినియోగించాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవే
2) పర్యవసానం 1 మాత్రమే సరైంది
3) పర్యవసానం 2 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు

జ.Option (2)


Q. ప్రకటన: దేశంలో మరోసారి ఉల్లిగడ్డల ధరలు పెరుగుతాయని కూరగాయల వర్తకులు ఆశిస్తున్నారు.
పర్యవసానం 1: ప్రభుత్వం ఉల్లిగడ్డలను నిల్వ ఉంచి భవిష్యత్‌లో ధరలు పెరగకుండా చూడాలి.
పర్యవసానం 2: కొరత ఉన్నప్పుడు తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవి కాదు
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం రెండోది మాత్రమే సరైంది
4) పర్యవసానం ఒకటోది మాత్రమే సరైంది

జ.Option (2)


Q. ప్రకటన: సీబీఐకు వచ్చిన ఫిర్యాదులో ఒక ప్రభుత్వ అధికారి లంచం అడుగుతున్నాడని రాసి ఉంది.
పర్యవసానం 1: అధికారి లంచం తీసుకుంటుండగా సీబీఐ అతన్ని బంధించి చర్యలు తీసుకోవాలి.
పర్యవసానం 2: అధికారిపై మరిన్ని ఫిర్యాదులు వచ్చే వరకు సీబీఐ వేచి చూసి తర్వాత చర్యలు తీసుకోవాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవే
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు

జ. Option (1)


Q. ప్రకటన: రైలు పట్టాలు తప్పడం వల్ల రెండు రైల్వే ట్రాక్‌లకు అంతరాయం కలిగింది.
పర్యవసానం 1: ట్రాక్‌పై పడిన బోగీలను తొలగించడానికి అవసరమైన పనిముట్లను, సంబంధిత సిబ్బందిని రైల్వే అథారిటీ వేగంగా పంపించాలి.
పర్యవసానం 2: ఆ రూట్లలో వచ్చే రైళ్లను వేరే దారిలో మళ్లించాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే

జ. Option (4)


Q. ప్రకటన: చాలా మంది టీవీల్లోనే సినిమాలు చూస్తున్నారు. కాబట్టి సినిమా థియేటర్ల యజమానులు చాలా నష్టాలు ఎదుర్కొంటున్నారు.
పర్యవసానం 1: సినిమా థియేటర్‌లను తొలగించి మల్టీషాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలి.
పర్యవసానం 2: సినిమా థియేటర్లను అద్దెకివ్వాలి. తద్వారా ఆదాయం పొందొచ్చు.
1) పర్యవసానం 2 మాత్రమే సరైంది
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం 1 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు

జ.Option (4)


Q. ప్రకటన: చిల్లర వర్తకుల దుకాణాలు ఫుట్‌పాత్‌లపై అధికంగా ఉన్నాయి.
పర్యవసానం 1: వారిని దూరం పంపడానికి పోలీసుల సహాయం అవసరం.
పర్యవసానం 2: చిల్లర వర్తకుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించి వారి వర్తకం సాగేట్లు చూడటం.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం 2 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు

జ. Option (2)


Q. ప్రకటన: ఒక పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఇవ్వడం వల్ల చాలా మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫెయిలయ్యారు.
పర్యవసానం 1: ఆ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులను సప్లిమెంటరీకి అనుమతించాలి.
పర్యవసానం 2: తప్పు జరగడానికి కారణాలు విశ్లేషించి కారకులను శిక్షించాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
2) పర్యవసానాలు రెండూ సరైనవే
3) పర్యవసానం 1 మాత్రమే సరైంది
4) పర్యవసానం 2 మాత్రమే సరైంది

జ. Option (2)


Q. ప్రకటన: హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే సరస్సుల్లోని నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి.
పర్యవసానం 1: నీటి సరఫరా విభాగం కొంచెం కొంచెం నీటి సరఫరాను తగ్గించాలి.
పర్యవసానం 2: నీటి ఆదాపై ప్రజల్లో ప్రభుత్వం అవగాహన కల్పించాలి.
1) పర్యవసానం 1 మాత్రమే సరైంది
2) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
3) పర్యవసానాలు రెండూ సరైనవే
4) పర్యవసానం 2 మాత్రమే సరైంది

జ.Option (3)


Q. ప్రకటన: చాలా మంది మెడికల్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ పాలనలో, బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
పర్యవసానం 1: వారిని అలాంటి ఉద్యోగాలకు వెళ్లకుండా నిరోధించాలి.
పర్యవసానం 2: ప్రభుత్వం ఒక కమిటీని నియమించి కారణాలు విశ్లేషించాలి. తగిన చర్యలు చేపట్టి, వారిని ఈ ఉద్యోగాల్లోకి వెళ్లకుండా చూడాలి.
1) పర్యవసానం 2 మాత్రమే సరైంది
2) పర్యవసానం 1 మాత్రమే సరైంది
3) పర్యవసానాలు రెండూ సరైనవి కావు
4) పర్యవసానాలు రెండూ సరైనవే

జ. Option (1)


Q. ప్రకటన: చాలా మంది డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిపోయారు.
పర్యవసానం 1: అందరు విద్యార్థులను డిబార్ చేయాలి.
పర్యవసానం 2: వారిని పిలిపించి మళ్లీ అలా చేయొద్దని మందలించి వదిలి పెట్టాలి.
1) పర్యవసానాలు రెండూ సరైనవే
2) పర్యవసానం 2 మాత్రమే సరైంది
3) పర్యవసానం 1 మాత్రమే సరైంది
4) పర్యవసానాలు రెండూ సరైనవి కావు

జ.Option (4)