డిస్ట్రిబ్యూషన్ అండ్ అరేంజ్‌మెంట్

           అనలిటికల్ ఎబిలిటీ విభాగం నుంచి అడిగే ప్రశ్నలు సాధారణంగా అభ్యర్థి విషయ విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించినవి. ఈ ప్రశ్నల్లో సమాచారాన్ని వాక్యాలు లేదా అవుట్‌లైన్స్ రూపంలో ఇస్తారు. ఇచ్చిన విషయాన్ని సమగ్రంగా చదివి, సరైన జవాబును గుర్తించాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఒక పటాన్ని రూపొందించడం ద్వారా దాదాపు 90శాతం ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవచ్చు.

Q. A, B, C, D, E అనే అయిదుగురు వ్యక్తులు 5 వేర్వేరు రంగుల టీషర్టులు - నీలం, పసుపు, తెలుపు, నలుపు, ఎరుపు (అదే వరుసలో కాదు) ధరించారు. A అనే వ్యక్తి ఎరుపు లేదా తెలుపు టీషర్టు, B అనే వ్యక్తి తెలుపు లేదా నలుపు రంగు టీషర్టు ధరించవచ్చు. D లేదా E నీలం రంగు టీషర్టు ధరించలేదు. E పసుపురంగు టీషర్టు ధరించలేదు. అయితే కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) నీలం రంగు టీషర్టు ధరించిన వ్యక్తి ఎవరు?
ఎ) D బి) C సి) B డి) E
2) పసుపు రంగు టీషర్టు ధరించిన వ్యక్తి ఎవరు?
ఎ) C బి) E సి) D డి) A
జ. సమాధానం - వివరణ: పై దత్తాంశం ఆధారంగా, కిందివిధంగా పట్టిక రూపొందించుకోవాలి.
 



 
1) పై పట్టిక ఆధారంగా నీలం రంగు టీషర్టు ధరించిన వ్యక్తి C అవుతాడు.
సమాధానం: (బి)
2) పసుపు రంగు టీషర్టు ధరించిన వ్యక్తి 'D' అవుతాడు.
సమాధానం: (సి)

Q.P, Q, R, S, T, U అనే ఆరు పుస్తకాలు ఒకదాని పక్కన మరొకటి ఉన్నాయి. Q, R, T లకు నీలి రంగు కవర్లు ఉన్నాయి. మిగిలినవి ఎరుపు రంగు కవర్లు ఉన్నవి. S, U మాత్రమే కొత్త పుస్తకాలు. మిగిలినవి పాతవి. P, R, S సైన్సు పుస్తకాలు కాగా మిగిలినవి మాన్యువల్స్. అయితే
1) ఎరుపురంగు కవరున్న కొత్త సైన్సు పుస్తకం ఏది?
ఎ) P బి) R సి) S డి) T
2) కిందివాటిలో నీలిరంగు కవర్లున్న పాత మాన్యువల్స్ జత ఏది?
ఎ) Q, U బి) T, U సి) S, U డి) Q, T
3) ఎరుపు రంగు కవరు కలిగిన కొత్త మాన్యువల్ పుస్తకమేది?
ఎ) U బి) Q సి) S డి) R
4) పాత నీలి రంగు కవర్ కలిగిన సైన్సు పుస్తకమేది?
ఎ) P బి) S సి) R డి) U
5) కిందివాటిలో సరైన జత ఏది?
ఎ) P - మాన్యువల్ బి) S - నీలం
సి) ఎరుపు - సైన్సు డి) R - కొత్తది
జ. సమాధానం - వివరణ: పై దత్తాంశం ఆధారంగా కింది పట్టికను రూపొందించుకోవాలి.

 
 
పట్టిక ఆధారంగా సమాధానాలు
1) (సి) అంటే S
2) (డి) అంటే Q, T
3) (ఎ) అంటే U
4) (సి) అంటే R
5) (సి) అంటే ఎరుపు - సైన్సు.
Q. ఒక దీర్ఘచతురస్రాకార బల్ల పొడవాటి అంచుల్లో అంచుకు ముగ్గురు చొప్పన A, B, C, D, E, F అనే వ్యక్తులు కిందివిధంగా కూర్చున్నారు.
i. E ఏ చివరనా ఉండడు.
ii. F కి ఎడమపక్క 2వ స్థానంలో D ఉన్నాడు.
iii. E కి పక్కన ఉండే C అనే బాలిక D కి కర్ణమూలంలో ఎదురుగా ఉంటుంది.
iv. B, F పక్కపక్కనే ఉంటారు.
కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
1) A కి ఎదురుగా ఎవరున్నారు?
ఎ) B బి) D సి) C డి) E
2) F కి కర్ణమూలంలో ఎదురుగా ఎవరున్నారు?
ఎ) D బి) C సి) A డి) E
3) E ఎవరి మధ్య ఉన్నాడు?
ఎ) B, C బి) A, C సి) D, F డి) E, F
జ. సమాధానం - వివరణ: పై దత్తాంశం నుంచి కిందివిధంగా చిత్రాన్ని రూపొందించవచ్చు.

 
 
1) (బి) అంటే 'D' అనే వ్యక్తి 'A' కు ఎదురుగా కూర్చున్నాడు.
2) (సి) అంటే 'F' కి కర్ణమూలంలో ఎదురుగా ఉన్న వ్యక్తి 'A'.
3) (బి) అంటే A, C మధ్య E ఉన్నాడు.
Q.షీనా, రాణి, మేరీ, రీటా అనే నలుగురు బాలికలు గ్రూప్ ఫొటో కోసం ఒక బల్ల మీద కిందివిధంగా కూర్చున్నారు.
i. రాణికి ఎడమవైపు షీనా
ii. రాణికి కుడివైపు మేరీ
iii. రీటా - రాణి, మేరి మధ్య కూర్చుంది.
అయితే ఫొటోలో ఎడమవైపు నుంచి రెండో బాలిక ఎవరు?
ఎ) రాణి బి) షీనా సి) మేరీ డి) రీటా
జ.సమాధానం: (డి)

 
 
వివరణ: పై దత్తాంశం ఆధారంగా నలుగురు బాలికలు ఫొటో కోసం కెమేరాకు ఎదురుగా ఎడమ నుంచి కుడికి కిందివిధంగా కూర్చున్నారు.
'రీటా' ఎడమవైపు నుంచి రెండో బాలిక అవుతుంది.
Q. A, B, C, D, E, F అనే వ్యక్తులు వృత్తాకార బల్ల చుట్టూ కిందివిధంగా కూర్చున్నారు.
i. F, C మధ్య B
ii. E, D మధ్య A
iii. D కి ఎడమవైపు F
అయితే A, F మధ్య ఉన్న వ్యక్తి ఎవరు?
ఎ) B బి) C సి) D డి) E
జ. సమాధానం: (సి)
 

 
వివరణ: పై దత్తాంశం నుంచి A, B, C, D, E, F స్థానాలు కింది విధంగా ఉన్నాయి.
పై చిత్రం నుంచి A, F మధ్య D ఉన్నాడు.
Q. అయిదుగురు బాలురు ఒక పందెంలో పాల్గొంటున్నారు. రామ్, మోహన్ కంటే ముందు గోపాల్ కంటే వెనుక; అబ్బాస్, శైలేష్ కంటే ముందు మోహన్ కంటే వెనుక స్థానంలో నిలిచారు. ఆ పందెంలో ఎవరు గెలిచారు?
ఎ) రామ్ బి) గోపాల్ సి) మోహన్ డి) అబ్బాస్
జ. సమాధానం: (బి)
వివరణ: దత్తాంశం నుంచి
రామ్ > మోహన్ -------- (1)
గోపాల్ > రామ్ --------- (2)
అబ్బాస్ > శైలేష్ -------- (3)
మోహన్ > అబ్బాస్ ---------- (4)
(1), (2), (3), (4) నుంచి గోపాల్ > రామ్ > మోహన్ > అబ్బాస్ > శైలేష్.
కాబట్టి గోపాల్ పందెంలో గెలిచాడు.
Q. ఒక అరలో వివిధ సబ్జెక్టులకు చెందిన 49 పుస్తకాలు ఈ విధంగా ఉన్నాయి. హిస్టరీ-8, జాగ్రఫీ-7, సాహిత్యం-13, సైకాలజీ-8, సైన్సు-13. ఈ పుస్తకాలను వాటి ఆంగ్ల అక్షర క్రమంలో ఏ రెండు సబ్జెక్టు పుస్తకాలు ఒకదాని పక్కన మరొకటి రాకుండా అమర్చారు. అన్ని పుస్తకాలను ఎడమవైపు నుంచి లెక్కించడం మొదలుపెడితే
1) 40వ పుస్తకం ఏ సబ్జెక్టుకు చెందింది?
ఎ) సైన్సు బి) సైకాలజీ సి) హిస్టరీ డి) సాహిత్యం
2) సైకాలజీలో చివరి పుస్తకం స్థానం ఎంత?
ఎ) 36 బి) 37 సి) 38 డి) 39
3) కుడివైపు నుంచి లెక్కిస్తే, 39వ పుస్తకం ఏ సబ్జెక్టుకు సంబంధించింది?
ఎ) హిస్టరీ బి) సైకాలజీ సి) జాగ్రఫీ డి) సైన్సు
జ. సమాధానం - వివరణ: దత్తాంశం నుంచి ఇచ్చిన 5 పుస్తకాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే కింది విధంగా ఉంటుంది.
జాగ్రఫీ, హిస్టరీ, సాహిత్యం, సైకాలజీ, సైన్సు పుస్తకాలను వరుసగా G, H, L, P, S లతో సూచిస్తే కింద ఇచ్చిన స్థానాల్లో ఆయా సబ్జెక్టులు వస్తాయి.
1) G1 2) H1 3) L1 4) P1 5) S1 6) G2 7) H2 8) L2 9) P2 10) S2 11) G3 12) H3 13) L3 14) P3 15) S3 16) G4 17) H4 18) L4 19) P4 20) S4 21) G5 22) H5 23) L5 24) P5 25) S5 26) G6 27) H6 28) L6 29) P6 30) S6 31) G7 32) H7 33) L7 34) P7 35) S7 36) H8 37) L8 38) P8 39) S8 40) L9 41) S9 42) L10 43) S10 44) L11 45) S11 46) L12 47) S12 48) L13 49) S13
ఈ అమరిక ఆధారంగా సమాధానాలు
1) 40వ పుస్తకం సాహిత్యం. (డి)
2) సైకాలజీలో చివరి పుస్తకం శి8, 38వ స్థానంలో ఉంది. (సి)
3) కుడివైపు నుంచి 39వ పుస్తకం అంటే ఎడమవైపు నుంచి 11వ పుస్తకం 'జాగ్రఫీ'. (సి)