స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌

     పెట్రోలు, డీజిల్‌ వాహనాల తాకిడితో నానాటికీ పెరిగిపోతున్న హానికారక కర్బన ఉద్గారాలకు కళ్లెం వేయడానికి విద్యుత్‌ కార్లు, ద్విచక్ర వాహనాలు వచ్చేశాయి. ఆకాశంలో ఎగిరే విమానాల విషయంలో మాత్రం ఇంకా ఈ మార్పు రాలేదు. పూర్తిస్థాయి విద్యుత్‌ విమానం రూపకల్పన దిశగా ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తున్నారు. 

 
     తాజాగా బ్రిటన్‌ కంపెనీ రోల్స్‌ రాయిస్‌ కీలక ముందడుగు వేసింది. ఈ సంస్థ రూపొందించిన ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’ అనే పూర్తిస్థాయి విద్యుత్‌ విమానం ఇటీవల గగన విహారం చేసి పలు ఘనతలు సాధించింది. 

స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ ప్రపంచ రికార్డులు

                 వేగం                        ప్రయాణించిన దూరం

గంటకు 555.9 కిలోమీటర్లు:     3 కిలోమీటర్లు

గంటకు 532.1 కిలోమీటర్లు:     15 కిలోమీటర్లు

        విద్యుత్‌ విమానాలను సాకారం చేసేందుకు 1970ల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చిన్న విమానాలు సిద్ధమయ్యాయి. చాలావరకూ ఒక్క పైలట్‌తో కొన్ని నిమిషాలపాటు మాత్రమే అవి గగనవిహారం చేశాయి. ఇటీవల విద్యుత్‌ విమాన ప్రాజెక్టులు పెరుగుతున్నాయి.