అయ్యంగార్ కమిటీ: హైదరాబాద్ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ కమిటీని నియమించాడు.
ఎం.ఎస్.భరూచ
కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు
పరిశీలించుటకు 1939లో ఈ కమిటీ నియమించారు.
కె.ఎస్.థార్
కమిషన్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలించేందుకు
భారత ప్రభుత్వం 1948లో ఈ కమిషన్ నియమించింది.
జె.వి.పి కమిటీ:
కె.ఎస్.థార్ కమిషన్ నివేదికను పరిశీలించేందుకు జేవీపీ కమిటీని 1948లో
నియమించారు.
పండిత్
సుందర్లాల్ కమిటీ: జె.ఎన్.చౌదరి పాలనలో కమ్యూనిస్టులు,
ముస్లింలపై జరిగిన దాడిపై విచారణకు భారత ప్రభుత్వం 1949లో నియమించింది.
ఎ.డి.గోర్వాలా
కమిటీ: హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి
మెరుగుపర్చడం కోసం 1950లో ఈ కమిటీని నియమించారు.
పింగిళి జగన్మోహన్
రెడ్డి: సిటీ కాలేజీలో విద్యార్థులపై జరిగిన పోలీస్
కాల్పులపై 1952లో ఈ కమిటీ నియమించారు.
వాంఛూ కమిటీ:
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో వచ్చే సమస్యలు పరిశీలించేందుకు 1953లో ఈ
కమిటీ నియమించారు.
ఫజల్ అలీ కమిషన్:
రాష్ట్రాల పునర్విభజనకు శాశ్వత ప్రాతిపదికత కల్పించుటకు ఈ కమిటీని 1953లో
నియమించారు.
తెలంగాణ ప్రాంతీయ
కమిటీ: పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా 1958లో ఈ కమిటీని
ఏర్పాటు చేశారు.
కుమార్ లలిత్
కమిటీ: తెలంగాణలో మిగులు నిధులు లెక్కించడానికి 1969లో ఈ
కమిటీని నియమించారు.
వశిష్ట భార్గవ
కమిటీ: తెలంగాణలో మిగులు నిధులు నిర్ణయించడానికి అష్ట
సూత్రంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
కె.ఎస్.వాంఛూ
కమిటీ: ముల్కీ నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ
విషయంలో సూచనలు చేయడానికి ఈ కమిటీని 1969లో నియమించారు.
తార్కుండే కమిటీ:
నక్సలైట్లపై జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై విచారణకు 1977లో ఈ
కమిటీని నియమించారు.
జయభారత్ రెడ్డి
కమిటీ: రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 సక్రమంగా అమలవుతున్నాయో
లేదో తెలుసుకోవడానికి 1984లో నియమించారు.
సుందరేషన్ కమిటీ:
జయభారత్ రెడ్డి నివేదికలోని అంశాలు పరిశీలించుటకు 1985లో ఈ కమిటీని
నియమించారు.
హితన్భయ్యా కమిటీ:
విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం 1998లో ఈ కమిటీని నియమించారు.
గిర్గ్లానీ కమిషన్: 610 జీవో, ఆరు సూత్రాల పథకం అమలు తీరు
పరిశీలించేందుకు ఈ కమిటీని 2001లో నియమించారు.
ప్రణబ్ ముఖర్జీ
కమిటీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో రాజకీయ
పార్టీలతో సంప్రదింపుల కోసం 2005లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
రోశయ్య కమిటీ:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై వివిధ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడానికి 2009లో ఈ
కమిటీ ఏర్పాటు చేశారు.
జస్టిస్ శ్రీకృష్ణ
కమిటీ: ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితుల అధ్యయనం,
సూచనల కోసం 2010లో ఈ కమిషన్ను నియమించారు.
ఆంటోని కమిటీ:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విధివిధానాల రూపకల్పనకు 2013లో ఈ కమిటీ
నియమించారు.
కమలనాథన్ కమిటీ:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన సూచించడానికి 2014లో ఈ కమిటీని
నియమించారు.
ప్రత్యూష సిన్హా
కమిటీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీసెస్
ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఈ కమిటీని నియమించారు.
హరగోపాల్ కమిటీ:
టీఎస్పీఎస్సీ పరీక్షల సిలబస్ రూపకల్పనకు ఈ కమిటీని 2015లో నియమించారు.