TSPSC GR1 PRELIMINARY EXAM MASTER COPY WITH FINAL KEY

 

 TSPSC GR1 PRELIMINARY EXAM MASTER COPY

 

 

FINAL KEY

 


 

 

 

ఆర్థిక సంఘం

 

 స్వభావం

– భారత ఆర్థిక సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, అర్ధన్యాయ వ్యవస్థ (Quosi Federal)
– ఇది ఒక సలహా సంస్థ (Advisory Boards)
-భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కాబట్టి సమాఖ్యలో ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగబద్ధంగా పంపిణీ చేయాలి.
-ప్రభుత్వ ఆదాయ వనరుల విషయంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య (Verticle), రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య (Horizontal) అనేక వ్యత్యాసాలు ఉన్నాయి.
-వీటిని దృష్టిలో ఉంచుకొని వనరులను పునః పంపిణీ చేయడానికి రాజ్యాంగ నిర్మాతలు ‘ఆర్థిక సంఘాన్ని’ ఏర్పాటు చేశారు.
-ప్రపంచంలో ఏ సమాఖ్య వ్యవస్థలోనూ ఇలాంటి అధికారాలతో ఏర్పడిన మరో సంస్థ లేదు.
-ఆర్థిక సంఘం సిఫారసులను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు.
-సాధారణంగా ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేస్తారు. ఆర్థిక సంఘం సిఫారసు లను అమలు చేయాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం రాష్ట్రాలతో పాటు మరెవరికీ లేదు.

 

ఆర్థిక సంఘం నిర్మాణం

– ఆర్థిక సంఘం బహుళ సభ్యసంఘం.
– దీనిలో ఒక చైర్మన్‌, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి నియామకానికి సంబంధిం చిన అర్హతలు, ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.
-పార్లమెంట్‌ ఆర్థిక సంఘ చట్టం (ఇతర నిబంధనలు)-1951 (Finance Co mmission Miscellaneous Provi sions) Act-1951)ని రూపొందించింది.
-దీనిలో ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యుల నియామకం, అర్హతలు, అనర్హతలు, పదవీకాలం, అధికారాలు లాంటి అంశాలను పేర్కొన్నారు.

 

రాజ్యాంగ హోదా

– రాజ్యాంగంలోని XIIవ భాగంలో 280 నుంచి 281 వరకు ఉన్న నిబంధనలు ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం, విధులు, సిఫారసులను సమర్పించడం లాంటి అంశాలను వివరిస్తుంది.

 

నియామకం-అర్హతలు

-ఆర్థిక సంఘం చైర్మన్‌, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.

-అవసరమని భావించినప్పుడు రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది ఒక తాత్కాలిక సంస్థ.
ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా ప్రజావ్యవహారాల్లో అనుభవం ఉన్నవారిని నియమిస్తారు.
పలు రంగాలకు చెందిన నలుగురిని సభ్యు లుగా నియమిస్తారు.
ఎ) హైకోర్ట్ న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి నియామకానికి అర్హతగల వ్యక్తి.
బి) ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, అకౌంట్ల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తి.
సి) ఆర్థిక వ్యవహారాలు, పాలనా నిర్వహణ లో విస్తృత అనుభవం ఉన్న వ్యక్తి.
డి) అర్థశాస్త్రంలో ప్రత్యేక అనుభవం ఉన్న వ్యక్తి.

 

పదవీకాలం

– ఆర్థిక సంఘం శాశ్వత సంస్థ కాదు. కాబట్టి దీనికి నిర్ణీత పదవీకాలం ఉండదు.
-ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు నియా మక పత్రంలో రాష్ట్రపతి ప్రత్యేకంగా పేర్కొన్న కాలం వరకు విధులను నిర్వహిస్తారు.
– నిర్దేశించిన కాల పరిమితిలోపల నివేదికను సమర్పించాలి.
-ఒకసారి ఆర్థిక సంఘంలో సభ్యుడిగా పనిచేసిన వ్యక్తిని తిరిగి ఆ పదవిలో నియమించవచ్చు.
-ఆర్థిక సంఘం సభ్యుడు రాజీనామా చేయా లంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి పేరుమీద రాసి రాష్ట్రపతికి సమర్పించాలి.
-ఆర్థిక సంఘంలోని సభ్యులు పూర్తికాలం లేదా పాక్షిక కాలం రాష్ట్రపతి కోరిన విధంగా విధులను నిర్వహిస్తారు.
-ఆర్థిక సంఘం చైర్మన్‌, సభ్యుల జీతభత్యా లను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ప్రత్యేక అధికారాలు
-భారత ఆర్థిక సంఘం అర్ధ న్యాయ సంస్థ. కాబట్టి విధి నిర్వహణలో సివిల్‌ కోర్టుకు ఉన్న అధికారాలు దీనికి ఉంటాయి.
-భారతదేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి లేదా సంస్థనైనా సాక్ష్యంగా తన ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీచేయ గలరు.
-తనకు కావాల్సిన పత్రాలను (Docume nts) సమర్పించాలని ఆదేశించగలరు.
-ప్రభుత్వ రికార్డులు ఇవ్వాలని ఏ కోర్టును లేదా ప్రభుత్వ కార్యాలయాన్నయినా కోరవచ్చు.

 

విధులు

-రాజ్యాంగంలోని నిబంధన 280 (3) ప్రకారం కింది అంశాలకు సంబంధించి తగిన సూచనలు చేయాలి.
1) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ అయ్యే లేదా పంపిణీ చేయాల్సిన పన్నుల (డివిజబుల్‌ పూల్‌) నికర రాబడులను, కేంద్రం, రాష్ట్రాలకు కేటాయించడానికి అను సరించాల్సిన మార్గదర్శక సూత్రాలను సిఫారసు చేయడం.
2) భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన సహాయక గ్రాంటులను ఇవ్వడానికి తగిన నియమాలను సూచించడం (275వ రాజ్యాంగ నిబంధన
3) రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల్లోని పంచాయతీ ల ఆర్థిక వనరులను పెంచేందుకు తగిన సిఫారసులు చేయడం (73వ రాజ్యాంగ సవరణ చట్టం)
4) రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపాలిటీలకు మరిన్ని ఆర్థిక వనరులను అందజేయడానికి, రాష్ట్ర సంఘటిత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలను సూచించడం (74వ రాజ్యాంగ సవరణ చట్టం)
5) భారత దేశ ఆర్థిక, స్థిరత్వ సాధన కోసం రాష్ట్రపతి కోరిన అంశంపై తగిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను రూపొందిం చడం
-15వ ఆర్థిక సంఘం 2020-21 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర నివేదికను ఇస్తూ 41 శాతం వాటాను రాష్ట్రాలకు సిఫారసు చేసింది.
-తాజాగా రానున్న 5 ఏండ్లకు కూడా 41 శాతం వాటాను సిఫారసు చేసింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 42.2 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంచనుంది.
-మొత్తం రాష్ట్రాలకు రూ. 2,94,514 కోట్లను రెవెన్యూ లోటు గ్రాంటుగా సిఫారసు చేసింది.

 

15వ ఆర్థిక సంఘం

ఆర్థిక సంఘం చైర్మన్‌                ఏర్పాటైన ఏడాది కాలం

1 కేసీ నియోగి                              1951 -1952-57
2 కే సంతానం                              1956 – 1957-62
3 ఏకే చందా                                1960 1962-66
4 రాజమన్నార్‌                            1964 1966-69
5 మహావీర్‌ త్యాగి                         1968 1969-74
6 కే బ్రహ్మానంద రెడ్డి                     1973 1974-79
7 జేఎం షేలత్‌                              1977 1979-84
8 వైబీ చవాన్‌                              1982 1984-89
9 ఎన్‌కేపీ సాల్వే                           1987 1989-95
10 కేసీ పంత్‌                               1992 1995-2000
11 ఏఎం ఖుస్రో                             1998 2000-05
12 సీ రంగరాజన్‌                          2002 2005-10
13 కే విజయ్‌, ఎల్‌ కేల్కర్‌             2007 2010-15
14 వైవీ రెడ్డి                                  2013 2015-20
15 ఎన్‌కే సింగ్‌                              2017 2021-26

 

పంచవర్ష ప్రణాళికలు - పథకాలు, ప్రాజెక్టులు

 

1. మొదటి ప్రణాళిక 1950- 56
-హిందుస్థాన్ మెషిన్‌టూల్స్
-ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ
-సింథ్రీ ఎరువుల కర్మాగారం
-చిత్తరంజన్ రైలు ఇంజిన్ కర్మాగారం
-హిందుస్థాన్ షిప్ బిల్డర్స్
-నాగార్జునసాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు
-భాక్రానంగల్ ప్రాజెక్టు
-హీరాకుడ్ ప్రాజెక్టు
-సమాజాభివృద్ధి కార్యక్రమం – 1952
-సమాజ విస్తరణ అభివృద్ధి కార్యక్రమం- 1953
-జమీందారీ వ్యవస్థ రద్దు

2. రెండో ప్రణాళిక 1956- 61
-రూర్కెలా ఉక్కు కర్మాగారం- ఒడిషా- జర్మనీ సహకారం
-దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం- పశ్చిమబెంగాల్- బ్రిటన్ సహకారం
-భిలాయ్ ఉక్కు కర్మాగారం- ఛత్తీస్‌గఢ్- రష్యా సహకారం

3. మూడో ప్రణాళిక 1961- 66
-బొకారో ఉక్కు కర్మాగారం- రష్యా సహకారం
-1964లో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) స్థాపన
-1965లో భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ) స్థాపన
-హరిత విప్లవం ప్రారంభం

4. నాలుగో ప్రణాళిక 1960-74
-విశాఖపట్టణం స్టీల్ ఫ్యాక్టరీ- ఆంధ్రప్రదేశ్
-విజయ్‌నగర్ స్టీల్ ఫ్యాక్టరీ- కర్ణాటక
-సేలం స్టీల్ ఫ్యాక్టరీ- తమిళనాడు
-1971 గరీబీ హటావో నినాదం- ఇందిరాగాంధీ
-1970 – శ్వేత విప్లవం
-1972 – ఉపాధి హామీ పథకం (ఈజీఎస్)
-1973 కరువుపీడిత ప్రాంతాల పథకం (డీపీఎపీ)
-చిన్నకారురైతుల అభివృద్ధి ఏజేన్సీ (ఎస్‌ఎఫ్‌డీఏ)
-ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల ఏజెన్సీ (ఎంఎఫ్‌ఏఎల్‌ఏ)

5. ఐదో ప్రణాళిక 1974- 79
-జాతీయ కనీస అవసరాల పథకం- 1974
-20 సూత్రాల కార్యక్రమం- 1975
-పనికి ఆహార పథకం- 1977
-అంత్యోదయ పథకం (రాజస్థాన్‌లో ప్రారంభించారు)- 1977
-సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం- 1978-79
-ప్రాంతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు- 1975
-మొదటి జాతీయ జనాభా విధానం- 1976

6. ఆరో ప్రణాళిక 198-85
-జాతీయ గ్రామీణ ఉపాధి పథకం – 1980
-గ్రామీణ స్త్రీ, శిశు అభివృద్ధి పథకం- 1982
-గ్రామీణ భూమిలేనివారి ఉపాధి హామీ పథకం (ఆర్‌ఎల్‌ఈజీపీ)- 1983
-ఇందిరా ఆవాస్ యోజన – 1985
-నీలి విప్లవం ప్రారంభం- 1980

7. ఏడో ప్రణాళిక- 1985-90
-పట్టణ పేదల స్వయం ఉపాధి పథకం- 1986
-మిలియన్ బావుల పథకం- 1988
-జవహర్ రోజ్‌గార్‌యోజన- 1989
-నెహ్రూ రోజ్‌గార్ యోజన- 1989
-1986- సీఎపీఎఆర్‌టీ
-నేషనల్ హౌసింగ్ బ్యాంకు- 1988

8. ఎనిమిదో ప్రణాళిక 1992- 97
-ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన – 1993
-ఉపాధి హామీ పథకం (ఈఏఎస్)- 1993
-మహిళా సమృద్ధియోజన (ఎంఎస్‌వై)- 1993
-ఎంపీల్యాడ్స్- 1993
-జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎ)- 1993

9. తొమ్మిదో ప్రణాళిక 1997-2002
-స్వర్ణజయంతి షహరీ రోజ్‌గార్ యోజన – 1997
-స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్‌గార్ యోజన – 1999
-జవహర్ గ్రామ్ సమృద్ధియోజన – 1999
-జనశ్రీ బీమా యోజన- 2000
-ప్రధాన్‌మంత్రి గ్రామోదయ యోజన- 2000
-ప్రధాన్‌మంత్రి అన్నయోజన- 2000
-అన్నపూర్ణ- 2000
-సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన-2001
-వాల్మీకీ అంబేద్కర్ ఆవాస్ యోజన- 2001

10. పదో ప్రణాళిక 2002-07
-ప్రవాసీ బీమా యోజన-2003
-వందేమాతరం- 2004
-జాతీయ పనికి ఆహార పథకం- 2004
-జననీ సురక్షాయోజన (జేఆర్‌వై)- 2005
-భారత్ నిర్మాణ్ యోజన- 2005
-రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన- 2005
-జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్- 2005
-మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం- 2006
-కస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం

11. పదకొండో ప్రణాళిక 2007-12
-రాష్ట్రీయ కృషి వికాస్ యోజన- 2007
-మహాత్మాగాంధీ వెనుకబడిన వర్గాల అభివృద్ధి పథకం- 2007
-ఆమ్‌ఆద్మీ బీమా యోజన- 2007
-ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన పథకం- 2008
-ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన- 2008
-ధనలక్ష్మి- 2008
-రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన- 2008
-రాజీవ్‌గాంధీ గ్రామీణ వితరణ యోజన- 2009
-మహిళా కిసాన్ స్వశక్తి కిరణ్ పరియోజన- 2009
-ఇందిరాగాంధీ మాతృత్వ సహ్యోగ్ యోజన- 2011

12. పదకొండో ప్రణాళిక 2012-17

-ప్రణాళిక లక్ష్యం: శీఘ్రతర వృద్ధి – సుస్థిర వృద్ధి
-ప్రణాళికా సంఘం అధ్యక్షులు: మన్మోహన్‌సింగ్, నరేంద్రమోదీ
-ఉపాధ్యక్షుడు: మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
-వృద్ధిరేటు లక్ష్యం: 8 శాతం
-సాధించిన వృద్ధిరేటు: 8 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి: రూ.76,69,807 కోట్లు
ఈ ప్రణాళిక నిర్దేశిత లక్ష్యాలు
-50 మిలియన్ల అదనపు ఉద్యోగాలను సృష్టించడం
-శిశు మరణాల రేటును 25కు, ప్రసూతి మరణాల రేటును 1కి తగ్గించడం
-0 నుంచి 3 ఏండ్ల వయోగ్రూప్ పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని సగానికి తగ్గించడం
-పాఠశాల విద్య, హాజరు నిష్పత్తిలో ఉన్న లింగ, సామాజిక వ్యత్యాసాన్ని తొలగించడం
-ఉన్నత విద్యలో ప్రవేశించే వారి సంఖ్యను పెంచడానికి 2 మిలియన్ల అదనపు సీట్లను సృష్టించడం
-అడవుల విస్తీర్ణాన్ని ఏడాదికి 1 మిలియన్ హెక్టారు చొప్పున పెంచడం
-నీటిపారుదల వసతులున్న భూమి వైశాల్యాన్ని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 130 మిలియన్ హెక్టార్లకు పెంచడం
-దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర, జాతీయ రహదారులను ప్రణాళిక అంతానికి రెండు లైన్ల రోడ్లుగా తీర్చిదిద్దడం
-దేశంలో 90 శాతం కుటుంబాలకు బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పించడం
-ప్రణాళిక ముగిసే నాటికి ఆధార్‌ను ఉపయోగించుకుని అన్ని ప్రధాన సంక్షేమ సంబంధ, సబ్సిడీ సంబంధ చెల్లింపులను బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యేలా చూడటం

భారత్‌ సరిహద్దులు - ఘర్షణలు

1) భారత్‌-చైనా యుద్ధం

– ప్రారంభం- 1962, అక్టోబర్‌ 20
-ముగింపు- 1962, నవంబర్‌ 21

– కారణం- జమ్ముకశ్మీర్‌ (ప్రస్తుత లఢక్‌)లోని ఆక్సాయ్‌చిన్‌ ప్రాంతాన్ని చైనా పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ దురాక్రమణ చేయడం.
-ఫలితం- చైనా సైన్యం విజయం. ఆక్సాయ్‌చిన్‌ ఆక్రమణ. ఈ యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య ఊహాజనిత సరిహద్దు రేఖగా వాస్తవాధీన రేఖ (Line of Actual Control)ను ఏర్పాటు చేశారు.

2) నాథులా వివాదం

-దీనినే భారత్‌, చైనా యుద్ధం-1967 అని పిలుస్తారు.
– 1967, ఆగస్ట్ లో చైనా సైన్యం నాథులా పాస్ వద్ద చొరబడింది. దీంతో ఘర్షణ ప్రారంభమై 1967, సెప్టెంబర్‌ 15 వరకు కొనసాగింది. సుమారు 400 మంది చైనా సైనికులు ఈ ఘర్షణలో చనిపోయారు.
-ఇది చైనాకు పెద్ద ఎదురుదెబ్బ.

3) చో లా వివాదం

-చో లా పాస్ సిక్కిం రాష్ట్రాన్ని చైనాలోని టిబెట్‌ ప్రాంతంలో కలుపుతుంది.
– 1967, అక్టోబర్‌ 1న చైనా దళాలు చో లా కనుమ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా క్లెయిమ్‌ చేసి ఘర్షణలకు దిగింది.
– ఈ సంఘటనలో 83 మంది భారత సైనికులు చనిపోయారు.

4) అరుణాచల్‌ప్రదేశ్‌ వివాదం-1987

-1986లో అరుణాచల్‌ప్రదేశ్‌కు భారత్‌ రాష్ట్రహోదా ఇచ్చినప్పుడు చైనా నిరసన వ్యక్తం చేసింది.
– అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగం అని వాదిస్తూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని సమ్‌డోరాంగ్‌ చు లోయలోకి ప్రవేశించి హెలిప్యాడ్‌లు, శాశ్వత నిర్మాణాలు నిర్మించడం ప్రారంభించింది.
-ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి భారతసైన్యం ‘ఆపరేషన్‌ ఫాల్కన్‌ (Ope ration Falcon)ను ప్రారంభించింది.
-చైనా సైన్యం వెనక్కి తగ్గేంతవరకు భారతసైన్యం సరిహద్దుల్లోనే మోహరించింది.
-ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మొదటి అధికారిక సమావేశం జరిగింది.
-చర్చలకు రెండు దేశాలూ అంగీకరించాయి.
– ఈ ఘటన 1993 ఒప్పందానికి దారితీసింది.

1993 ఒప్పందం

-అప్పటి భారత ప్రధాని పీవీ నర్సింహారావు, చైనా అధ్యక్షుడు లీ పెంగ్‌ల మధ్య 1993, సెప్టెంబర్‌ 7న ‘సరిహద్దు శాంతి, ప్రశాంతత ఒప్పందం (Border Peace and Tranquility Agreement)’ జరిగింది.

-ఈ ఒప్పందం ప్రకారం ఎల్‌ఏసీ పశ్చిమ, తూర్పు, మధ్య సెక్టార్ల కచ్చితమైన స్థానాలు గుర్తించారు.

-ఇరుపక్షాలు 15,000 మంది కంటే ఎక్కువ మందితో సైనిక విన్యాసాలు నిర్వహించకూడదు.

భారత్‌-చైనా ఒప్పందం-1996

– అప్పటి చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది.
-ఇది చైనా అధ్యక్షుడి తొలి భారత పర్యటన.
-ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మ్యాపుల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది.

5) డెప్సాంగ్‌ ఘర్షణలు (Depsang Disputes) -2013

-ఈ ఘర్షణలు లఢక్‌ ప్రాంతంలోని దౌలత్‌ బేగ్‌ ఓల్డీ (డీబీవో) వద్ద జరిగాయి.
– 2013, ఏప్రిల్‌ 15న డీబీవో సమీపంలోని రాఖీనులా ప్రాంతం వద్ద శాశ్వత శిబిరాలను చైనా సైన్యం నిర్మించడంతో ఘర్షణలు జరిగాయి.

6) చుమార్‌ ఘర్షణ (Chumar Dispute)- 2014

-చుమార్‌ ప్రాంతం వద్ద చైనా ఒక హైవేను నిర్మించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది.
-భారత్‌ తీవ్రంగా ప్రతిఘటించడంతో చైనా హైవే నిర్మాణాన్ని నిలిపివేసింది.

7) డోక్లాం ఘర్షణ (Doklam Dispute)- 2017

– డోక్లాం అనేది భూటాన్‌లోని ఒక పీఠభూమి ప్రాంతం.

-ఇది భారత్‌, చైనా, భూటాన్‌లకు అత్యం త వ్యూహాత్మక ప్రదేశం.

-ఇది భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే సిలిగురి ప్రాంతం (Chicken Neck)ను రక్షించే ప్రధాన భూభాగం.

-చైనా ప్రతిష్ఠాత్మక వన్‌ బెల్ట్ వన్‌ రోడ్‌ కార్యక్రమంలో భాగంగా, డోక్లాం మీదుగా రోడ్డు నిర్మాణాలను చేపట్టింది చైనా.

-దీంతో భారత్‌ ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో 73 రోజుల పాటు ప్రతిష్టంభన జరిగింది.

8) 2020- గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ త్సో సరస్సు ఘర్షణలు (Galwan Valley Disputes)

-పాంగాంగ్‌ త్సో సరస్సు (గల్వాన్‌ లోయ) వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం ఘర్షణలకు దిగడంతో (2020, మే 5) యుద్ధ వాతావరణం నెలకొంది.

– భారత సైనికులు 20 మంది, చైనా సైనికులు 40 మంది మరణించినట్లు అంచనా.

-2020, జూన్‌ 16 వరకు ఈ ఘర్షణలు కొనసాగాయి.

9) అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా నామకరణం

-2020, డిసెంబర్‌ 30న అరుణాచల్‌ప్రదేశ్‌లోని 15 ప్రాంతాలకు చైనా తమ పేర్లను పెట్టింది.

– అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమంటూ, దానిని ‘జన్‌గ్నాన్‌’ పేరుతో పిలుస్తున్నట్లు చైనా వాదిస్తుంది.

– ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలున్నాయి. అవి.. 1) సెంగ్కెజాంగ్‌ 2) దాగ్లుంగ్‌ జాంగ్‌, 3) మునిగాంగ్‌ 4) డుడింగ్‌, 5) మిగ్‌పెయిన్‌
6) గోలింగ్‌, 7) డంబా 8) మెజాగ్‌

-నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్‌జుబ్‌ రి, కున్‌మింగ్‌ జింగ్‌ పెంగ్‌ అని పేర్లు పెట్టింది.
– రెండు నదులకు జెన్‌యోగ్మీ, దులైని అని, ఒక పర్వత మార్గానికి ‘సె లా’ అని పేరు పెట్టింది.
-గతంలో 2017లోనూ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు తమ పేర్లను పెట్టింది చైనా.

జాతీయ చిహ్నాలు-విశేషాలు

జాతీయజెండా

-ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం జమీందారు వద్ద పనిచేసినప్పుడు మధ్యలో రాట్నంతోగల మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ జెండాను 1931లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ నాయకులకు చూపించగా వారు ఆమోదించారు.
-స్వాతంత్య్రం సిద్ధించాక భారత ప్రజల్లో జాతీయ భావనను పెంపొందించేందుకు భారత్‌కు జాతీయ పతాక అవసరాన్ని గుర్తించారు. ఇందుకు రాజ్యాంగసభ 1947, జూన్ 23న బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, సరోజినీ నాయుడు, కేఎం ఫణిక్కర్, కేఎం మున్షీ, రాజాజీ, అంబేద్కర్‌లతో కమిటీని నియమించింది.
-ఈ కమిటీ ఆనాటి కాంగ్రెస్ పతాకాన్నే కొద్దిమార్పులతో రాట్నం స్థానంలో అశోకచక్రాన్ని చేర్చి 1947, జూలై 22న జాతీయజెండాగా ఆమోదించగా 1947, ఆగస్టు 15న ఆవిష్కరించారు.


 

 

జెండా నియమావళి
-జాతీయజెండాకు పైనగాని, జెండాకు కుడివైపునగాని ఏ ఇతర జెండాలను లేదా చిహ్నాలను ఎగురవేయరాదు.
-ఒకే వరుసలో జెండాలను ఎగురవేసినప్పుడు లేదా అమర్చినప్పుడు ఇతర జెండాలన్నీ జాతీయజెండాకు ఎడమవైపునే ఉండాలి.
-ఇతర జెండాలను ఎగురవేసినప్పుడు జాతీయజెండాను మిగిలిన అన్ని జెండాలకంటే ఎత్తులో ఉంచి ఎగురవేయాలి.
-హైకోర్టులు, సెక్రటేరియట్‌లు, కలెక్టరేట్లు, కమిషనర్ కార్యాలయాలు, రాయబార కేంద్రాలు, జైళ్లు మొదలైన ప్రభుత్వ భవనాల్లో మాత్రమే జాతీయజెండాను ఎగురవేయాలి.
-స్వాంతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు, గాంధీ జయంతి రోజుల్లో, ప్రత్యేక సందర్భాలు, జాతీయ ప్రాముఖ్యతగల రోజుల్లో జెండాను ఎగురవేయడానికి ఎటువంటి నిర్బంధాలు ఉండకూడదు.
-తప్పనిసరిగా జాతీయజెండాను సాయంత్రం అవనతం చేయాలి.

జాతీయ పతాక వివాదం
-నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త తన కార్యాలయ భవనంపై జాతీయజెండాను ఎగురవేయగా అధికారులు అడ్డుకొని జెండాను స్వాధీనం చేసుకొన్నారు. దీంతో నవీన్ జిందాల్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దేశ పౌరుడిగా జాతీయజెండాను ఎగురవేసే హక్కు తనకు ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో సుప్రీంకోర్టు జాతీయజెండాకు ఎటువంటి అవమానాలు కలుగనిరీతిలో ఎవరైనా ఎగురవేయొచ్చని, ప్రకరణ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు లభించిన హక్కుఅని 2004, జనవరి 23న తీర్పునిచ్చింది. దీంతో జాతీయజెండా నిబంధనలను సవరించి రూపొందించిన కొత్త నిబంధనలు 2002, జనవరి 26నుంచి అమల్లోకి వచ్చాయి.

నూతనజెండా నిబంధనలు
-జాతీయజెండాను ఇండ్లపైన, కార్యాలయాలపైన, దుకాణాలపైన ఎగురవేయవచ్చు.
-ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు జాతీయజెండాను ప్రదర్శించవచ్చు. ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక, క్రీడల సమయాల్లో పేపర్‌తో చేసిన జెండాలను మాత్రమే వినియోగించాలి. అన్ని రోజుల్లో జెండాను ఎగురవేయవచ్చు.
-వేదికను అలంకరించడానికిగాని, అలంకారంగాగాని, దుస్తులుగాగాని, వాణిజ్య అవసరాల కోసంగాని జాతీయజెండాను ఉపయోగించకూడదు.
-కానీ జాతీయజెండాను దుస్తులుగా ఉపయోగించరాదనే నిబంధనను కేంద్రమంత్రిమండలి 2005, జూలై 5న ఉపసంహరించింది. అదేవిధంగా చేతితొడుగులు, రుమాళ్లు, న్యాప్‌కిన్లు, అండర్‌వేర్లు, తలదిండ్లు, దుస్తులపై ఎంబ్రాయిడరీగాగాని, ప్రింటింగ్ చేయడంగాని నిషేధించింది.
-జాతీయజెండా నేలనుగాని, నీళ్లనుగాని తాకరాదు.

జాతీయ చిహ్నం: నాలుగు సింహాల తలాటం
-ఈ నాలుగు సింహాల తలాటాన్ని సారనాథ్‌లోని అశోకస్తంభం నుంచి తీసుకున్నారు. ఈ సింహాలు ఒకదానివెనుక ఒకటి కూర్చున్నట్లు ఉంటాయి. కానీ మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ సింహాల కింద ఉన్న పీఠం మధ్యభాగంలో అశోకుని ధర్మచక్రం, చక్రానికి కుడివైపు గుర్రం, ఎడమవైపు ఎద్దు బొమ్మలు ఉంటాయి. దానికింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. దీనిని జాతీయచిహ్నంగా రాజ్యాంగం 1950, జనవరి 26న ఆమోదించింది.

జాతీయగీతం: జనగణమన
రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రాసిన జనగణమన గీతాన్ని హిందీలోకి అనువదించి జాతీయగీతంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని రాజ్యాంగం 1950, జనవరి 24న ఆమోదించింది. ఈ గీతాన్ని మొదటగా 1911, డిసెంబర్ 27న కలకత్తాలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. ఈ విషయం 1912, జనవరిలో తత్వబోధిని పత్రికలో భారత విధాత అనే శీర్షికన ప్రచురితమైంది.

జాతీయగేయం: వందేమాతరం
-ఈ గేయాన్ని బంకించంద్రచటర్జీ సంస్కృతంలో రాశారు. ఇది చటర్జీ రాసిన ఆనంద్‌మఠ్ అనే బెంగాలీ నవలలోనిది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఈ గేయాన్ని ఆలపించారు. రాజ్యాంగ పరిషత్ ఈ గేయాన్ని జాతీయగేయంగా 1950, జనవరి 24న ఆమోదించింది.

ప్రతిజ్ఞ
-రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా అన్నెపర్తికి చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావు భారత్, చైనా యుద్ధసమయంలో విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి 1962, సెప్టెంబర్ 17న ఈ ప్రతిజ్ఞను రాశారు. దీన్ని మొదటిసారిగా 1963లో విశాఖలోని ఒక పాఠశాలలో చదివారు. దీనిపై చాగ్లా అధ్యక్షతన కమిషన్‌ను నియమించారు. ఈ కమిషన్ 1964 బెంగళూరులో సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆన్ ఎడ్యుకేషన్ సమావేశంలో చర్చించి అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో దీన్ని చెప్పించాలని సూచించింది. దీంతో కేంద్రప్రభుత్వం 1965, జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చింది.

జాతీయ జంతువు: పెద్దపులి
-దీన్ని కేంద్రప్రభుత్వం 1972లో జాతీయ జంతువుగా గుర్తించి 1973 ఏప్రిల్ నుంచి ప్రాజెక్టు టైగర్ అనే పులుల సంరక్షణ పథకాన్ని చేపట్టింది. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. పులి శాస్త్రీయనామం పాంథెరాటైగ్రిస్.
జాతీయ జలచరం: రివర్ డాల్ఫిన్
-జాతీయ నది అయిన గంగానదితోపాటు బ్రహ్మపుత్ర, సింధు, సింధు ఉపనదుల్లో ఈ రివర్ డాల్ఫిన్ కనిపిస్తుంది. దీని శాస్త్రీయనామం ప్లాటానిస్టా గాంగెటికా. కేంద్రప్రభుత్వం ఈ డాల్ఫిన్‌ను 2009, అక్టోబర్ 5న నేషనల్ ఆక్వాటిక్ యానిమల్‌గా గుర్తించింది.
జాతీయ క్రీడ: హాకీ
జాతీయ పుష్పం: తామర. దీని శాస్త్రీయనామం నెలుంబో నూసిఫెరా.
జాతీయ వారసత్వ జంతువు: ఏనుగు. దీని శాస్త్రీయనామం (ఎలిఫస్ మాక్సిమస్)
జాతీయ వృక్షం: మర్రిచెట్టు. దీని శాస్త్రీయనామం ఫైకస్ బెంగాలెన్సిస్.
జాతీయ ఫలం: మామిడిపండు. దీని శాస్త్రీయనామం మాంజిఫెరా ఇండికా.
జాతీయ భాష: హిందీ. రాజ్యాంగంలోని 343 ప్రకరణ ప్రకారం హిందీని జాతీయభాషగా గుర్తించారు.

 

భారత అటవీ నివేదిక-2021

 

 -నివేదిక పేరు- ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్‌ఆర్‌)
-విడుదల చేసేది- ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా (పర్యావరణ, అటవీ అండ్‌ పర్యావరణ మార్పుల మంత్రిత్వ శాఖ).

ఎడిషన్‌- 17

– తొలి ఎడిషన్‌- 1987 (ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి)
-డేటా పీరియడ్‌- 2019-20
-ఉపగ్రహం- రిసోర్సెస్ శాట్‌-2

ప్రపంచంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల దేశాలు

1) రష్యా 2) బ్రెజిల్‌
3) కెనడా 4) యూఎస్ఏ
5) చైనా 6) ఆస్ట్రేలియా
7) డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో
8) ఇండోనేషియా 9) పెరూ
10) భారత దేశం

– 2010-20 మధ్య అత్యధిక వార్షిక నికర అటవీ పెరుగుదల గల దేశాలు-

1) చైనా 2) ఆస్ట్రేలియా
3) భారత దేశం 4) చిలీ

-l దేశంలో మొత్తం కార్బన్‌ స్టాక్‌- 7204 మిలియన్‌ టన్నులు
-దేశంలో మొత్తం టైగర్‌ రిజర్వ్‍లు- 52 (అత్యధికం- మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర- 6 చొప్పున)
-దేశంలో టైగర్‌ రిజర్వ్‍ల విస్తీర్ణం- 74,710 చ.కి.మీ.
-దేశంలో మొత్తం పర్వత జిల్లాలు (Hill Districts)- 140 (అత్యధికం- జమ్ముకశ్మీర్‌-22, అరుణాచల్‌ ప్రదేశ్‌-16)

ముఖ్యాంశాలు

-మొత్తం అటవీ విస్తీర్ణం (Total Forest Area)- 24.62 శాతం (Forest+Tree )
-అటవీయేతర భూమి- 76.87 శాతం
-మొత్తం ఫారెస్ట్ కవర్‌ (Foresr Cover)- 21.71 శాతం

ఫారెస్ట్ ఏరియా/రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా

-ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా అటవీ భూమిగా చూపిన దానిని ఫారెస్ట్ ఏరియా లేదా రికార్డెడ్‌ ఫారెస్ట్‍ ఏరియా అని అంటారు. దీనికి చట్టబద్ధత (Legal Status) ఉంటుంది.

ఫారెస్ట్ కవర్‌ (Forest Cover)

– నిర్దిష్ట భూభాగంలోని చెట్ల శాతాన్ని ఫారెస్ట్‍ కవర్‌ అని అంటారు. లేదా ఒక హెక్టార్‌ కంటే ఎక్కువ విస్తీర్ణంగల భూభాగంలో 10 శాతం కంటే ఎక్కువ చెట్ల సాంద్రత ఉంది. దానిని ఫారెస్ట్‍ కవర్‌ అని అంటారు.

అటవీ విస్తీర్ణం – విభజన

-అత్యంత దట్టమైన అడవి (Very Dense)- 99,779 చ.కి.మీ.- 3.04 శాతం
– మాధ్యమిక దట్టమైన అడవి (Moderate Dense)- 3,06,890 చ.కి.మీ. – 9.33 శాతం
-ఓపెన్‌ ఫారెస్ట్ (OF) – 3,07,120 చ.కి.మీ.- 9.34 శాతం
– మొత్తం ఫారెస్ట్ కవర్‌ – 7,13,789 చ.కి.మీ.- 21.71 శాతం
– ట్రీ కవర్‌ (చెట్లు)- 95,748 చ.కి.మీ.
– 2.91 శాతం

మొత్తం ఫారెస్ట్ ఏరియా

– 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం
l పొదలు (Scrubs)- 46,539 చ.కి.మీ. – 1.42 శాతం

ప్రత్యేకతలు

– టైగర్‌ రిజర్వ్, టైగర్‌ కారిడార్స్​‍, గిర్‌ ఫారెస్ట్‍లలో తొలిసారి ఫారెస్ట్ కవర్‌ను అంచనా వేశారు.
– అత్యధిక అటవీ పెరుగుదల కనిపించిన టైగర్‌ రిజర్వ్‍- బక్సా (పశ్చిమ బెంగాల్‌), అన్నామలై (తమిళనాడు), ఇంద్రావతి (ఛత్తీస్గఢ్‌), కవ్వాల్‌ (తెలంగాణ), భద్ర (కర్ణాటక), సుందర్బన్స్​‍ (పశ్చిమ బెంగాల్‌)
-అత్యధిక ఫారెస్ట్‍ కవర్‌ (97 శాతం) కలిగిన టైగర్‌ రిజర్వ్‍- పక్కే టైగర్‌ రిజర్వ్‍ (అరుణాచల్‌ ప్రదేశ్‌)
దేశంలో మొత్తం అటవీ భూమి: 8,09,537 చ.కి.మీ.- 24.62 శాతం

-అత్యధిక అటవీ విస్తీర్ణంగల రాష్ట్రాలు (ఫారెస్ట్ + ట్రీ కవర్‌)

1) మధ్యప్రదేశ్‌ (94,689 చ.కి.మీ.)
2) మహారాష్ట్ర (61,952 చ.కి.మీ.)
3) ఒడిశా (61,204 చ.కి.మీ.)
4) ఛత్తీస్గఢ్‌ (59,816 చ.కి.మీ.)
5) అరుణాచల్‌ ప్రదేశ్‌ (51,540 చ.కి.మీ.)

ఫారెస్ట్ కవర్‌ అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మధ్యప్రదేశ్‌ (77,493 చ.కి.మీ.)
2) అరుణాచల్‌ప్రదేశ్‌
3) ఛత్తీస్గఢ్‌
4) ఒడిశా
5) మహారాష్ట్ర

శాతం పరంగా అత్యధిక ఫారెస్ట్ కవర్‌ గల రాష్ట్రాలు

1) మిజోరం (84.53 శాతం)
2) అరుణాచల్‌ప్రదేశ్‌ (79.33 శాతం)
3) మేఘాలయ (76 శాతం)
4) మణిపూర్‌ (74.34 శాతం)
5) నాగాలాండ్‌ (73.90 శాతం)

2019-21 మధ్య అత్యధిక అటవీ పెరుగుదల గల రాష్ట్రాలు

1) ఆంధ్రప్రదేశ్‌ (647 చ.కి.మీ.)
2) తెలంగాణ (638 చ.కి.మీ.)
3) ఒడిశా (537 చ.కి.మీ.)
4) కర్ణాటక (155 చ.కి.మీ.)

 2019-21మధ్య భారీగా అటవీ విస్తీర్ణం తగ్గిపోయిన రాష్ట్రాలు

1) అరుణాచల్‌ప్రదేశ్‌ (-257 చ.కి.మీ.)
2) మణిపూర్‌ (-249 చ.కి.మీ.)
3) నాగాలాండ్‌ (-235 చ.కి.మీ.)
4) మిజోరం (-186 చ.కి.మీ.)

2019-21 మధ్య దేశంలో పెరిగిన అటవీ విస్తీర్ణం- 2261 చ.కి.మీ.- ఫారెస్ట్ కవర్‌ 1540 చ.కి.మీ. + ట్రీ కవర్‌ 721 చ.కి.మీ.

-దేశంలో 33 శాతం కంటే అధికంగా అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు/యూటీలు- 17

-తమ భౌగోళిక విస్తీర్ణంలో 75 శాతం మించి అటవీ భూమి గల రాష్ట్రాలు/యూటీలు- 5 (1. లక్షద్వీప్‌, 2. మిజోరం, 3. అండమాన్‌ నికోబార్‌ దీవులు, 4. అరుణాచల్‌ ప్రదేశ్‌, 5. మేఘాలయ)

ట్రీ కవర్‌ అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మహారాష్ట్ర (12,108 చ.కి.మీ.)
2) రాజస్థాన్‌ (8733 చ.కి.మీ.)
3) మధ్యప్రదేశ్‌ (8054 చ.కి.మీ.)
4) కర్ణాటక (7494 చ.కి.మీ.)
5) ఉత్తరప్రదేశ్‌ (7421 చ.కి.మీ.)

శాతం పరంగా ట్రీ కవర్‌ అత్యధికం గల రాష్ట్రాలు/యూటీలు

1) చండీగఢ్‌ (13.16 శాతం)
2) ఢిల్లీ (9.91 శాతం)
3) కేరళ (7.26 శాతం)
4) గోవా (6.59 శాతం)

 ట్రీ అవుట్‌సైడ్‌ ఫారెస్ట్‍ అత్యధిక విస్తీర్ణం గల రాష్ట్రాలు

1) మహారాష్ట్ర (26,866 చ.కి.మీ.)
2) ఒడిశా (24,474 చ.కి.మీ.)
3) కర్ణాటక (23,676 చ.కి.మీ.)

వెదురు అరణ్యాలు అత్యధికంగా గల రాష్ట్రాలు

1) మధ్యప్రదేశ్‌
2) అరుణాచల్‌ ప్రదేశ్‌
3) మహారాష్ట్ర

దేశంలో మడ అడవులు గల రాష్ట్రాలు/ యూటీలు – 9+3 = 12

1) ఆంధప్రదేశ్‌- 405 చ.కి.మీ.
2) గోవా- 27 చ.కి.మీ.
3) గుజరాత్‌- 1175 చ.కి.మీ.
4) కర్ణాటక- 13 చ.కి.మీ.
5) కేరళ- 9 చ.కి.మీ.
6) మహారాష్ట్ర- 324 చ.కి.మీ.
7) ఒడిశా- 259 చ.కి.మీ.
8) తమిళనాడు- 45 చ.కి.మీ.
9) పశ్చిమ బంగ- 2114 చ.కి.మీ.
10) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 616 చ.కి.మీ.
11) దమన్‌ దీవ్‌ అండ్‌ దాద్రానగర్‌ హవేలీ- 3 చ.కి.మీ.
12) పుదుచ్చేరి- 2 చ.కి.మీ.

అత్యధికంగా మడ అడవులు గల రాష్ట్రాలు

1) పశ్చిమ బంగ (2114 చ.కి.మీ.)
2) గుజరాత్‌ (1175 చ.కి.మీ.)
-యూటీ- అండమాన్‌ నికోబార్‌ దీవులు (616 చ.కి.మీ.)

ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు గల జిల్లాలు- 6 (తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం). అత్యధికం తూర్పు గోదావరి (187.8 చ.కి.మీ.), అత్యల్పం పశ్చిమ గోదావరి (0 చ.కి.మీ.)
-దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం- 4992 చ.కి.మీ.

ఇతర అంశాలు

– దేశంలో మొత్తం అడవుల్లో 35.46 శాతం కార్చిచ్చు ప్రమాదంలో ఉన్నాయి.
– 2030 నాటికి 45-64 శాతం అడవుల వాతావరణ మార్పులకు గురికానున్నాయి. దీనిలో
-అత్యంత ప్రభావం చెందేది- లడఖ్‌
-2019తో పోలిస్తే దేశంలో 79.4 మిలియన్‌ టన్నుల కార్బన్‌ స్టాక్‌ దేశంలో పెరిగింది.
-2019తో పోలిస్తే దేశంలో 17 చ.కి.మీ. మడ అడవులు పెరిగాయి.

-దేశంలో దట్టమైన అడవులు (VDF), ఓపెన్‌ ఫారెస్ట్ లలో పెరుగుదల కనిపించగా, మధ్యస్థ అడవుల్లో తగ్గుదల కనిపించింది.

అతి తక్కువ అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు

1) గోవా- 1271 చ.కి.మీ.
2) హర్యానా- 1559 చ.కి.మీ.
3) పంజాబ్‌- 3084 చ.కి.మీ.
4) సిక్కిం- 5841 చ.కి.మీ.

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో శాతం పరంగా అతి తక్కువ అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు

1) హర్యానా- 3.53 శాతం
2) పంజాబ్‌- 6.12 శాతం
3) ఉత్తరప్రదేశ్‌- 7.22 శాతం
4) బీహార్‌- 7.90 శాతం

కేంద్ర పాలిత ప్రాంతాలు

1) జమ్ముకశ్మీర్‌- 20.199 చ.కి.మీ.
2) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 7171 చ.కి.మీ.
3) లడఖ్‌- 7 చ.కి.మీ.
4) దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమన్‌ దీవ్‌- 214 చ.కి.మీ.
5) ఢిల్లీ- 103 చ.కి.మీ.
6) చండీఘర్‌- 35 చ.కి.మీ.
7) పుదుచ్చేరి- 13 చ.కి.మీ.
8) లక్షద్వీప్‌- 0 చ.కి.మీ.


శాతం పరంగా

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు- 86.93 శాతం
2) జమ్ముకశ్మీర్‌- 36.98 శాతం
3) దాద్రానగర్‌ హవేలీ అండ్‌ దమన్‌ దీవి- 35.55 శాతం
4) చండీఘర్‌- 30.70 శాతం
l తెలంగాణ- 27,688 చ.కి.మీ. (24.70 శాతం)
l ఆంధ్రప్రదేశ్‌- 37,258 చ.కి.మీ. (22.86 శాతం)

ఫారెస్ట్ కవర్‌

l ఆంధ్రప్రదేశ్‌- 29,784 చ.కి.మీ. (18.28 శాతం)
l తెలంగాణ- 21,124 చ.కి.మీ. (18.93 శాతం)

పులుల గణన-2020

దేశంలోని మొత్తం పులులు- 2967 (2018), 2226 (2014 నాటికి)

రాష్ట్రాలు/జోన్ల వారీగా పులుల సంఖ్య

– శివాలిక్‌-గంగా మైదానం- 646
– మధ్య భారతదేశం+తూర్పు కనుమలు- 1033
– పశ్చిమ కనుమలు- 981
– పూర్వాంచల్‌ హిమాలయాలు+బ్రహ్మపుత్ర నదీలోయ- 219
– ఉత్తరాఖండ్‌- 442
-ఉత్తరప్రదేశ్‌- 173
– బీహార్‌- 31
– రాజస్థాన్‌- 69
-అరుణాచల్‌ ప్రదేశ్‌- 29
-అసోం- 190
– మధ్యప్రదేశ్‌- 526
-మహారాష్ట్ర- 312
-ఛత్తీస్గఢ్‌- 19
-జారండ్‌- 5
– ఒడిశా- 28
-తెలంగాణ- 26
-ఆంధ్రప్రదేశ్‌- 48
-గోవా- 3
-కర్ణాటక- 524
– కేరళ- 190
-తమిళనాడు- 264

సంవత్సరాలవారీగా పులుల పెరుగుదల

-2006- 1411
-2010- 1706
-2014- 2226
– 2018- 2967

ఇతర ముఖ్యాంశాలు

– ప్రపంచ పులుల వాటాలో భారతదేశ వాటా- 70 శాతం
-ప్రపంచంలో అత్యధిక పులుల కలిగిన దేశం- భారత్‌
– దేశంలోని మొత్తం టైగర్‌ రిజర్వ్ లు- 50
– దేశంలో ప్రతి 4 ఏండ్లకోసారి పులుల గణన జరుగుతుంది.
-దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కించే సంస్థ- నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ)
-2018-19 పులుల గణన 76,651 పులుల ఫొటోలను తీసి గిన్నిస్ రికార్డు సాధించింది.
-141 వేర్వేరు ప్రాంతాలు
-26,838 ప్రదేశాలు
– 1,21,337 చ.కి.మీ. విస్తీర్ణం
-3,48,58,623 ఫొటోలు
– 76,651 పులుల ఫొటోలు, 51,777 చిరుతలు+ఇతర జంతువుల ఫొటోలు
-పులి కూనలు- 2461

తెలంగాణాలో వెట్టి, భగీల వ్యవస్థ

 

వెట్టి విధానం

  • ఒక వ్యక్తి లేదా ఒక సంఘాన్ని శారీరక నిర్బంధానికి గురిచేసి, వారితో చాకిరీ చేయించుకుని ప్రతిఫలాన్ని ఇవ్వకపోగా, వారి నుండే వసూళ్లను (ధన రూపం/స్తు రూపం) బలవంతంగా రాబట్టుకుని వారి శ్రమను వారి జీవితాలను దోచుకునే విధానమే వెట్టి విధానం

 

దళితులు

  • ప్రతి దళిత  కుటుంబం వెట్టిచాకిరీ చేయటానికి కుటుంబంలోని ఒక్కరిని కేటాయించవలసి ఉండేది. చిన్న పల్లెలో ప్రతి ఇంటి నుండి ఒక మనిషిని పంపడం జరిగింది. పటేల్ పట్వారి, మాలి పటేల్ లేదా దేశ్ ముఖ్  ఇండ్లలో  గృహ సంబంధమైన పనులు చేయటం, పోలీస్ స్టేషన్ లకు, తాలూకాపీసులకు రిపోర్టులను మోసుకెళ్ళడం, గ్రామ చావిడికి, బందిలిదొడ్డికి కాపలా కాయడం రోజువారి పని లో భాగమే. ఇదికాక గ్రామ చావిడికి ఎవరైనా అధికారి వచ్చినప్పుడు వాళ్లకు మరింత ఎక్కువ పని ఉండేది. చిలుకూరు గ్రామంలో ప్రతి రోజు 16 మంది హరిజనులు వెట్టిచాకిరీ చేస్తుండేవారు. అడవుల నుండి కట్టెలు కొట్టి తెచ్చేవారు. టపా మోసుకెళ్లే వారు. టపా గాని, ఇతర సరఫరాలను మోసికెళ్ళినందుకు వారికి రెండున్నర మైళ్లకు ఒక అణా చొప్పున ఇవ్వబడుతునట్లు కాగితాల మీద ఉండేది. అయితే ఆచరణలో అది కూడా ఇచ్చేవారు కారు.  ఈ విధానాన్ని ‘కోసుకు వీసం’ అనేవారు

 

చర్మకారులు

  • చర్మకారుల గా పనిచేసే దళితులు తోళ్లను  పదును చేసి చెప్పులు కుట్టినందుకు, వ్యవసాయ పనులకు, బావుల నుండి నీరు తొడడానికి, అవసరమైన తోలు పరికరాలు తయారు చేసినందుకు, అరకలకు పట్టీలు తయారు చేసినందుకు భూస్వాములు ఏమీ చెల్లించేవారు కాదు. దళితులు భూస్వాములకు వాటిని ఉచితంగానే సరఫరా చేయవలసి వచ్చేది. మిగతా రైతాంగం మాత్రం ఆ దళితులకు ధాన్యరూపం లోనూ, ఇతర వ్యవసాయ పంటల రూపంలోనూ నిర్ణితమైన మేర చెల్లించేవారు

 

బోయలు, బెస్తలు, రజకులు

  • బోయలు, బెస్తలు, రజకుల వంటి మరికొన్ని ఇతర వెనుకబడిన కులాలవారు భూస్వామి కుటుంబాలకు చెందిన పురుషులను, స్త్రీలను పల్లకిలోనో, మేనాలోనో ఎక్కించుకొని తమ భుజాల మీద మోసుకు వెళ్ళవలసి వచ్చేది. తమ బంధువులను చూచి రావాలి అనుకున్నప్పుడు, తీర్థాలూ, తిరునాళ్లను సందర్శించవలసినప్పుడల్లా భూస్వాములు ఆ విధంగా వారిచే నిర్బంధంగా మోయించుకునేవారు. భూస్వామి కుటుంబాల వారు వేగంగా నడిచే ఎడ్లబండ్లలో ప్రయాణం చేసేటప్పుడు బండి ముందు దారి బాగుచేయడానికి, బండి వెనక కాపలాదారుగా వారు పరుగెత్తాల్సి వచ్చేది. వారు గుర్రాలపై స్వారీ చేసేటప్పుడు గుర్రాల వద్ద పనిచేసే వ్యక్తులు వాటి వెంట పరుగెత్తాల్సి ఉండేది .

 

కల్లు గీత కార్మికులు

  • కల్లుగీత కార్మికులు కల్లు గీత గీత గీస్తూ, భూస్వాముల కుటుంబాలకు ఉచితంగా సరఫరా చేయడం కోసం 5 నుండి 10 చెట్ల వరకు ప్రత్యేకంగా వారికోసం కేటాయించి ఉండాలి. వారికి రోజుకు ఐదు కుండల కల్లు సరఫరా చేయాలి. పండుగలు పబ్బాలప్పుడు మరింత ఎక్కువ కల్లు ఇచ్చిరావాలి.

 

చేనేత పని వారు

  • చేనేత పనివారు భూస్వాముల ఇళ్ళలో పనిచేసే నౌకర్లలకు బట్టలు సరఫరా చేయాలి. వడ్రంగులు, కమ్మరులు భూస్వాములకు వ్యవసాయ పరికరాలన్నీ ఉచితంగా సరఫరా చేయాలి. మరమ్మతులను ఈ విధంగానే చేయాలి.

 

రజకులు, దేశ్ ముఖ్ లు

  • రజకులు, దేశ్ ముఖ్ లు గ్రామ అధికారుల ఇళ్లల్లో బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, గ్రామ చావిడిలో మకాం వేసిన అధికారుల కొరకు మంచాలు, పరుపులు మోసుకెళ్లాలి. వంట చేయడానికి అవసరమైన అన్నీ చేరవేయాలి. వారే అధికారుల ఇళ్లల్లో పసుపు కారం కొట్టాలి.

 

కుమ్మరులు 

  • కుమ్మరులు అధికారులకు భూస్వాములకు అవసరమైన కుండలివ్వాలి. జాగిర్ద్రార్ గానీ, దేశ్ ముఖ్ గాని హైదరాబాదులో నివాసముంటున్నా, అంత దూరము నడిచి వెళ్లి అవసరమైన కుండలన్నీ ఇచ్చిరావాలి. గ్రామ చావడి లో మకాం వేసిన అధికారికి అవసరమైన కుండలిచ్చిరావాలి. వంట కూడా చేసి పెట్టాలి. మంగలి వారు ప్రతిరోజు దేశ్ ముఖ్ ఇండ్లలో సేవ చేసి రావాలి. రాత్రివేళ భూస్వామి పాదాలను అతని ఒళ్ళు మర్ధనా చేయాలి.

 

గొల్లవారు 

  • భూస్వాముల ఇండ్లలో ఏదైనా వేడుక జరుపుకున్న ప్రతిసారి గ్రామానికంతటికీ పండగ, పబ్బాలు వచ్చినప్పుడు గొల్లవారు ప్రతి మందనుంచి ఒక గొర్రెనిచ్చి తీరాలి. ఏదో ఒక సాకుతో నైనా భూస్వాములు ఎప్పుడు పడితే అప్పుడు కోరితే గొఱ్ఱె ఇచ్చి తీరాలి.

 

వ్యాపారులు 

  • గ్రామాలలో వ్యాపారం చేసే వారు పోలీస్ పటేల్ నుండి చీటీ అందగానే గ్రామంలోకి వచ్చిన ఏ అధికారి కైనా మంచి నెయ్యి తో సహా అవసరమైన సరుకులనీ వంతులవారీగా సరఫరా చేయవలసి ఉండేది. వాళ్ళ వద్ద ఏదైనా సరుకు లేకపోయినా ఏదైనా సరుకు ఇవ్వకపోయినా ఇవ్వటానికి వ్యతిరేకించినా నానావిధాలైన చిత్రహింసలకు, అవమానాలకు గురి చేయబడ్డారు

 

గ్రామ ప్రజలు 

  • గ్రామ ప్రజలు ప్రత్యేకించి సరఫరా చేయడానికి ఏ ఇతర వస్తువులు లేని పేద ప్రజలు ఉచితంగా కోడిపెట్టలు సరఫరా చేయవలసి వచ్చేది. ఈ వెట్టినుండి రైతులను కూడా వదిలి పెట్టేవారు కాదు. ఎవరైనా అధికారి వచ్చినప్పుడల్లా రైతులు వారిని ఉచితంగానే తమ బండ్లలో ఎక్కించుకెళ్ళాలి. ఏ వేళ పడితే ఆ వేళప్పుడు ఎడ్లకు మేత వేయడం కూడా ఆపి వారిని వారి గమ్యస్థానాలకు చేర్చాలి. తమ స్వంత పొలాల్లో పని ప్రారంభించటానికి ముందే గ్రామ అధికారుల, భూస్వాముల పొలాలు దున్ని పెట్టాలి. భూస్వాముల భూములు తడిసే అంతవరకూ రైతుల పొలాలకు నీళ్లు అందనిచ్చేవారు కాదు. అధికారులు, భూస్వాముల పొలాల్లో వ్యవసాయ కార్మికులు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలి. ఆ తర్వాత గాని వారు తమ జీవనభృతి కోసం మిగతా రైతులు పనులలోకి వెళ్ళటానికి వీలు లేదు.

 

ఉద్యోగులు 

  • వివిధ రూపాలలో సాగిన ఈ నిర్బంధ చాకిరి చేయించుకున్నది, వసూళ్లు సాగించింది భూస్వాములు మాత్రమే కాదు. చిన్న ఉద్యోగులు, పెద్ద ఉద్యోగులు, గ్రామాలలో నివసిస్తున్న వారు లేదా పర్యటన కోసమో, ప్రత్యేక తనిఖీల కోసమో గ్రామాలకు వచ్చిన వారందరూ ఈ విధమైన చాకిరీ చేయించుకోవడం, వసూళ్లు సాగించడం జరిగేది

 

బాలికలు 

  • ఈ ఫ్యూడల్ దోపిడీలలో కెల్లా దారుణమైనది భూస్వాముల ఇళ్ళలో బానిసలుగా బాలికలను పంపించే పద్ధతి . భూస్వాములు తమ కుమార్తెల పెళ్లిళ్లు చేసినప్పుడు బానిసలుగా బాలికలను బహూకరించి, పెండ్లి జరిగిన తమ కుమార్తెలతో పాటే, వారి అత్తవారింట్లో పనిచేయడానికి పంపేవారు. భూస్వాములు ఈ బానిస యువతులను ఉంపుడుగత్తెలుగా కూడా ఉపయోగించుకునేవారు.

తెలంగాణాలో రైతు గిరిజన తిరుగుబాట్లు

 బేతవోలు రైతుల పోరాటలు

  • “బేతవోలు ముఖ్తా’ కొన్ని గ్రామాల సముదాయం. దాని ముఖ్యస్థానం బేతవోలు. ఇవిగాక జెరిపోతులగూడెం, పోలినేని గూడెం, ఆచార్యులగూడెం, చెన్నారి గూడెం, కొమ్ములబండ తండా, సీతారాం తండా అనే గ్రామాలున్నవి.
  • ఆ రోజుల్లో బేతవోలు పెద్ద గ్రామం కింద లెక్క దీనిలో ముఖ్తాదారుడు ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించుకోవలసి ఉండేది. ఇదిపోగా మిగిలిన శిస్తులు రైతుల నుంచి వసూలు చేసుకొని ఆ మొత్తాన్ని తానే అనుభవించేవాడు.  ఈ మేరకు అతనికి చట్టపరమైన హక్కు ఉండేది. అయినా ఈ పరిధి దాటి చట్టవిరుద్ధంగా పెద్దఎత్తున శిస్తులు వసూలుచేసేవాడు.
    బేతవోలు ముఖ్తాదారు వసూలుచేసే అక్రమ పన్నులు ఈ విధంగా ఉండేవి.
  • సెంట్ల పన్ను: ముఖ్తా గ్రామంలోని భూములను సర్వే సెటిల్‌మెంట్‌ చేయించిన సందర్భంగా వసూలు చేసే పన్ను. నిజాం సంస్థానంలో ఇతర ప్రాంతాలలో సర్వే జరిపినట్టు తన ముఖ్తా ప్రాంతంలో జరిపించలేదు. ఆనాటి మద్రాసు రాష్ట్రంలో అమలు ఉన్నట్టు జరిపించాడు. కారణం మద్రాసు రాష్ట్రంలో ఎకరమునకు 100 సెంట్లుగా పరిగణించేవారు. కానీ సంస్థానంలో ఎకరానికి 40 గుంటలుగా పరిగణించేవారు.
    దేవుని పన్ను: రైతులంతా ఇంటికి 1 రూపాయి చొప్పున దేవునికి కానుకగా చెల్లించాలి. ఈవిధంగా పోగైన డబ్బు ముఖ్తాదారుకే చేరుతుంది.
  • పుల్లరి పన్ను: రైతులు, కూలీలంతా తమకున్న పశువులలో ఒక్కొక్క పశువుకు 1.50 పైసల చొప్పున పుల్లరి పన్ను చెల్లించేవారు. ఈ పన్ను వసూలు సమయంలో ముఖ్తాదారు ప్రజలను తీవ్రంగా బాధించేవాడు.
  • ఎవరింటికైనా చుట్టాలు వస్తే ఇంటివారు చుట్టాల కోసం పన్నులు చెల్లించుకోవలసి వచ్చేది. గ్రామస్థులు చుట్టాల ఇంటికి వెళితే వారు గ్రామాన్ని వదిలి వెళ్లినందుకు పన్ను చెల్లించుకోవాల్సి వచ్చేది.
  • చెరువుకు గండ్లు పడితే వాటిని పూడ్చాలనే పేరుతో కొంత పన్నులు చెల్లించాల్సి వచ్చేది.
  • చేనేత పనివారు మగ్గాలపైన పన్ను చెల్లించేవారు.
  • పెళ్లిళ్ల సమయంలో పన్ను చెల్లించడం తప్పనిసరి.
  • ముఖ్తాదారు స్త్రీలకు ప్రత్యేకంగా వివిధ రకాల పన్నులు విధించేవాడు.
    • 1.  మంత్రసాని పన్ను చెల్లించాలి
    • 2. వ్యభిచారిణులు పన్ను చెల్లించాలి
    • 3. అమ్మాయి రజస్వల అయితే పన్ను చెల్లించాలి
    • 4. సంతానం కలిగితే పన్ను చెల్లించాలి.
  • పుల్లరి పన్ను చెల్లించే రైతులు తమకు భూమి పట్టాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని భావించిన ముఖ్తేదార్‌ హుజూర్‌నగర్‌ తాలూకాలోని రేవూరు గ్రామానికి చెందిన ఫకీరురెడ్డి అనే వ్యక్తిని(ఏజెంటు) తెచ్చి భూమిని  అతనికి తనఖా పెట్టినట్లు కాగితాలు సృష్టించాడు
  • బేతవోలుకు తాలూకా కేంద్రమైన సూర్యాపేటలో అమృతరెడ్డి అనే ప్లీడరు రైతుల పక్షాన పనిచేసేవారు. జమిందార్‌ పక్షాన వేములపల్లి వెంకటకృష్ణయ్య పనిచేసేవారు.
  • 1938 నాటికి సుమారు 10 సంవత్సరాలపాటు బేతవోలు రైతుల పోరాటం సాగింది. వారి కోర్కెలు
  • వెట్టిచాకిరీ రద్దు, అక్రమ పన్నులు రద్దు
  • శిస్తురేట్లు తగ్గించాలి
  • రైతులకు తమ భూమిని అమ్మడానికి, కొనడానికి హక్కు ఉండాలి.
  • ముఖ్తాదారుకు పటేల్‌, పట్వారీలను తొలగించే అధికారం ఉండరాదు.
  • బేతవోలు రైతుల పోరాటానికి ప్రారంభం నుండి నడిగూడెం (మునగాల) రాజా మద్ధతు ఉంటూ వచ్చింది

 

పరిటాల జాగీరు రైతాంగ పోరాటం – ఏజెంటు హత్య

  • పరిటాల హైదరాబాదు-విజయవాడ రోడ్డుపైన విజయవాడకు సమీపానగల ఒక గ్రామం. ఇది ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉంది
  • నైజాం ఇలాకా, వరంగల్ జిల్లా మధిర తాలూకాలో నవాబ్‌ కమాల్‌ యార్‌జంగ్‌ జాగీర్జారుకు కానాత్‌ తాలూకా అనే ‘పేరుతో పరిటాల, బత్తెనపాడుగని, అత్మూరు, మొగులూరు, కొడవటికల్లు, ఉస్తేవల్లి మరియు మల్లవెల్లి మొత్తం 7 గ్రామాలుండేవి. ఈ గ్రామాల చుట్టూ బ్రిటిష్‌ వారి ప్రాంతం ఉందేది
  • పరిటాల గ్రామం తాలూకాకు ప్రధాన స్థానంగా ఉండి, అచట జాగీర్దార్‌ తరపున ఒక తహశీల్దారు, ఫస్ట్‌క్లాస్‌ మెజి(స్టేటు మరియు పోలీస్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ 15-20 మంది సిబ్బందితో ఉందేవారు. ప్రధానంగా భూభాగం బ్రిటిష్‌ భూభాగంతో
  • చుట్టబడి ఉండుటచే అచ్చటి రాజకీయ చైతన్య ప్రభావము జాగీరు గ్రామాల ప్రజల మీద పూర్తిగా ఉండేది. తత్ఫలితంగా ప్రజలలో రాజకీయ చైతన్యం అధికంగా ఉండేది.
  • నవాబ్‌ కమాల్‌ యార్‌జంగ్‌ తండ్రి ఖాన్‌ఖానాన్‌ హయాంలో లంకా సుబ్బయ్యశాస్త్రి అనే వ్యక్తి వృద్ధుడయిన నవాబు వద్ద పలుకుబడి సంపాదించి 7-8 సంవత్సరాలు నియంతగా వ్యవహరించి ప్రజలను పీడించినాడు. తత్ఫలితంగా ప్రజలలో రాజకీయ చైతన్యం ప్రబలి ఇతని యొక్క నియంతృత్వాన్ని శాసనబద్ధంగా అణచివేయుటకు అనేక ప్రయత్నాలు జరిగాయి.
    సుబ్బయ్యశాన్షి జీవితకాలంలో జాగీరు దుష్పరిపాలన గురించి విచారించుటకు హైదరాబాద్‌ ప్రభుత్వం ఒక విచారణ సంఘం నియమించి విచారణ జరిపించారు. కానీ ఈ విచారణ యొక్క ఫలితం శూన్యం అవ్వడంతో, చివరకు ప్రజలు విసుగుచెంది ఆయనను హత్యచేశారు.

 

 

మునుగోడు రైతుల పోరాటం – దేశ్‌ముఖ్‌ హత్య

  • మునుగోడు గ్రామం నల్లగొండ తాలూకాలోనిది. అక్కడ రామిరెడ్డి అనే దేశ్‌ముఖ్‌ ఉండేవాడు. ఈయన పెద్ద ఆస్తిపరుడేగాక, గ్రామానికి పోలీస్‌ పటేల్‌, పైరవీకారు కూడా. ఇతడు తహశీల్దారుకు, కలెక్టర్లకు(తాలూక్టారులు), ఇతర అధికారులకు నెయ్యిని నింపిన కుండలను, ఇతర రుచిగల పదార్థాలు, పచ్చళ్లను సప్లయి చేసి వారి అభిమానాన్ని చూరగొని, లంచాలిచ్చి, తనకు అనుకూలంగా తీర్పులు చెప్పించుకొనేవాడు.
  • దేశ్‌ముఖ్‌ యొక్క దాయాదుల్లో చాలా మంది పేదలు, సాధారణ రైతులు, పేద రైతులు. వీరు కుటుంబ పోషణకై కొంత ఆదాయాన్ని సంపాదించడానికి వారు తమ ఇళ్లలో రహస్యంగా సారాయిని తయారుచేసి అమ్మేవారు. సామాన్య ప్రజలు కూడా ఈ వృత్తిని అనుసరించేవారు.
  • దేశముఖ్‌, ఎక్సైజ్‌(ఆబ్బారీ) ఆఫీసర్లతో వీరి ఇళ్లపైన దాడులు చేయించి, స్త్రీలను అవమానించి, అందరినీ హింసించి లంచాలు తీసుకునేవాడు. దీంతో ప్రజల్లోనేకాక దాయాదుల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి దేశముఖ్‌ను చంపాలని నిర్ణయించారు.
  • దేశ్‌ముఖ్‌ను హత్యచేయడానికి ప్రయత్నించారు. కానీ దేశ్‌ముఖ్‌. తుపాకీతో కాల్చి హత్యకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్టయి కొంతకాలానికి జైలు నుంచి విడుదలయ్యాడు. కానీ దేశ్‌ముఖ్‌పై ఉన్న వ్యతిరేకత మరింత తీవ్రమైనది.
  • సుమారు 1941-42 కాలంలో ఒకనాడు దేశ్‌ముఖ్‌ తన కచ్చడంలో నల్గొండకు బయలుదేరి అధికారుల కోసం నేతి డబ్బాలు, పచ్చళ్లు తెస్తున్నాడు. దేశ్‌ముఖ్‌ యొక్క రాకపోకలను కనిపెడుతూ ఉన్న ప్రజలు, దాయాదులు మార్గంమధ్య దోమలపల్లి అనే గ్రామ శివారులో కచ్చడాన్ని ఆపేసి దేశ్‌ముఖ్‌ను కొట్టి చంపారు. కానీ ఇంకా బతికే ఉన్నాడు అనుకొని శవాన్ని కచ్చడంలో వేసి, నిప్పంటించి, కచ్చడంలో ఉన్న నెయ్యిని మంటల్లో పోశారు. దీంతో శవం కూడా కాలి బూడిదైపోయింది. కేసు నడిచింది. సుమారు 9మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
  • దేశ్‌ముఖ్‌ చనిపోయి అతని దుర్మార్గాల నుంచి ప్రజలకు విముక్తి కలిగినా భూస్వామ్య వ్యవస్థ మాత్రం దెబ్బతినలేదు

     

    విసునూరు దేశ్‌ముఖ్‌ – బందగీ హత్య

  • 1939 నాటికి ఫ్యూడల్‌ దోపిడీకి, దౌర్జన్యాలకు పేరుపడిన విసునూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కొన్ని పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలలో ఒకదానికి బందగీ అనే యువకుడు నాయకత్వం వహించాడు. ఈ పోరాటం గురించిన వివరాలు “జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు అనే పుస్తకం ప్రకారం ఈ క్రింది విధంగా ఉన్నాయి.
  • కామారెడ్డిగూడెంలో షేక్‌ బందగీ అనే మహమ్మదీయ రైతు యువకుడు ఉండేవాడు. వారంతా ఐదుగురు అన్నదమ్ములు. అందరికన్నా పెద్దవాడు అబ్బసలి. వీరంతా వ్యవసాయం చేసుకుంటూ వేరుపడి జీవించాలనుకున్నారు. పెద్దవాడయిన అబ్బసలికి జ్యేష్టభాగం క్రింద 8 ఎకరాల భూమిని ఇచ్చారు. చిన్నవారు నలుగురు కలిసి వ్యవసాయం చేసుకొనేవారు.
  • అబ్బసలి తన 8 ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఈ అబ్బసలి దేశ్‌ముఖ్‌ దగ్గర ప్రాపకం సంపాదించి ఆయన సహాయంతో తమ్ముళ్ల భూమిలో కొంత కొట్టివేయాలని నిర్ణయించాడు.
  • అబ్బసలి ఇంటికి వచ్చి తమ్ముళ్లతో భూమిని మళ్లీ పంపకం చేసి జ్యేష్టభాగం కావాలని గొడవ పెట్టాడు. మిగిలిన నలుగురు తమ్ముళ్లు దీనికి అంగీకరించలేదు. అబ్బసలి దేశ్‌ముఖ్‌ అండతో కోర్టుకెళ్లాడు. అయినా ఆ తగాదా కోర్టులో చివరకు తమ్ముళ్ల వైపునే ఫైసలా అయింది. అయితే తమ్ముళ్లవైపు పోరాటానికి బందగీ సాహెబ్‌ నాయకత్వం వహించాడు.
  • బందగీ సాహెబ్‌కు ప్రజలలో కలిసిపోయే స్వభావం అధికం కావున ప్రజలను ఉత్తేజపరిచి, సంఘటితపరచి దేశ్‌ముఖ్‌ అండజేరిన అన్నను జయించడానికి పూనుకొన్నాడు. దౌర్దన్యంతో కూడిన దేశ్‌ముఖ్‌ అధికారాన్ని మొదటిసారిగా దెబ్బతీశాడు బందగీ సాహెబ్‌.
  • ఫకీర్‌ అహ్మద్‌ బందగీ సోదరులకు దగ్గరి పాలితుడు. దేశ్‌ముఖ్‌ దగ్గర నౌకరీ చేయడం మొదలుపెట్టినాడు. దీంతో ఫకీర్‌ అహ్మద్‌, దేశ్‌ముఖ్‌ కలిసి బందగీ సోదరుల ఆస్తిని చేజిక్కించుకోవడానికి కుట్రపన్నారు.
  • దీని ప్రకారం బందగీ మరియు అతని సోదరులు అనుభవించే భూమిని వారి తండ్రి, ఫకీర్‌ అహ్మద్‌ తండ్రి వేరు అయినాక ఫకీర్‌ అహ్మద్‌ మాత్రమే సంపాదించడానీ, దానిలో బందగీ సోదరులకు హక్కు లేదని గొడవ చేయవచ్చనే ప్రణాళిక ప్రకారం కేసులు పెట్టారు. బందగీ పేదవాడు. అయినా కష్టజీవి. కావున కేసులకై తిరగడానికి అన్ని వ్యయప్రయాసలు ఎదుర్కొనలేదు. అంతేకాకుండా దేశ్‌ముఖ్‌చే పీడించబడుతున్న వేలకొద్దీ ప్రజల సహాయసానుభూతులు బందగీ వెంటనున్నవి.
  • దేశ్‌ముఖ్‌ దోసిళ్లతో రూపాయిలను కుమ్మరించి కేసులు నడిపిస్తున్నాడు. కానీ బందగీ స్థితి విచారిస్తే నౌకర్లలో నాలుగవ శ్రేణిలో కూడా చేరడు. కానీ బందగీ మానవుడిగా జీవించాలనుకున్నాడు.
  • 12 సంవత్సరాల దేశ్‌ముఖ్‌, బందగీ పోరాటంలో బందగీ తెల్లని శరీరం కందలేదు. అతని ఉత్సాహంలో మార్పులేదు. సాధిస్తున్న విజయాలను చూసి గర్వించలేదు. పోరాటం ఆఖరికి వచ్చింది. కోర్టు ఫైసలా బందగీ సోదరుల వైపు అయింది. బందగీ ధైర్య సాహసోపేతమైన పోరాట ఫలితం విజయవంతం అవటం వలన ప్రజలు హర్షించారు.
  • బందగీ ఒకరోజు ఉదయం 8 గంటలకు సూర్యాపేట నుంచి జనగామ వెళ్లే బస్సులో వెళ్లి హైకోర్టు నుంచి అహకాములు (ఆర్డర్స్‌) తెచ్చుకొని ఆస్తి విషయమై చిక్కులు తొలగించుకొందానుకొన్నాడు. ఆ రోజు బస్సు సమయానికి బందగీ బయలు దేరాడు. బస్సు నిలిచే స్థలానికి రెండు ఫర్లాంగుల దూరం ఉంటుంది. దీనికి ఇరుపక్కలా పంటచేలు దట్టంగా ఉన్నవి. బందగీ కన్నుమూసి తెరచినంతనే, పక్కనే ఉన్న కంచెలో నుంచి ఇద్దరు సాయుధులు పైనపడ్డారు. ఒకడు కొడవలితో, రెండవవాడు గొడ్డలితో బందగిపై దాడిచేసి హత్యచేశారు.
  • బందగీ చావు విన్నంతనే ఇతర ప్రదేశాలలో ఉన్న అతని సోదరులు వచ్చారు. బందగీని బస్‌ స్టేజి దగ్గరనే పూడ్చి, గోరీ కట్టారు. గోరీ కట్టడానికి రాళ్లు కావాల్సి వస్తే ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులను చంపేస్తామని బెదిరించారు. కానీ కామారెడ్డిగూడెం రైతులు దీనికి భయపడలేదు.
  • గోరీ తయారైంది. చుట్టూ చెట్లు పెరిగాయి. ప్రతి సంవత్సరం అక్కడ ఉర్సు జరుగుతుంది. హిందువులు, ముస్లింలు సమాన ఆదరాభిమానాలతో ఉర్సులో పాల్గొని తమ ప్రియమైన నాయకుడు బందగీని స్మరించుకొంటారు.
  • ఈ కాలంలో దొర భూస్వాములు స్థాపించిన సంఘం – హిందూ సమితి

 

కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం

  • కొలనుపాక నల్లగొండ జిల్లాలోని ఆలేరుకు 6 కి.మీ.ల దూరాన ఉంటుంది. ఇది అతి ప్రాచీనమైన గ్రామం. జైనుల పుణ్యక్షేత్రం. కొలనుపాక చుట్టూ ఉన్న మరికొన్ని గ్రామాలు కూదా ఈ జాగీరు ప్రాంతంలోనివే. ఈ ప్రాంతాలన్నింటికీ నవాబు తురాబ్‌యార్‌ జంగ్‌ అధిపతి. ఇక్కడ పెద్ద భూస్వాములు, చిన్న భూస్వాములు అంతా ఆంధ్రులు. ఆరుట్ల సోదరులు కొలనుపాక గ్రామస్తులే.
  • జాగీర్జారు, జాగీరు ఉద్యోగులు ప్రజలతో వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాక రైతుల నుంచి అక్రమ శిస్తు వసూలు చేసేవారు. ఇక్కడి పెద్దలకు ఆంధ్రోద్యమంతో సంబంధం ఉన్నప్పటికీ, భూస్వాములు, రైతులు చాలాకాలం దాకా అక్రమ శిస్తులు చెల్లించారు. ప్రజలంతా వెట్టిచాకిరి చేశారు.
  • జాగీర్జారు మద్ధతుతో అధికారులు మాదిగ, మాలవారిని ఇస్లాం మతంలోకి మార్చిన వెంటనే ఆరుట్ల రామచంద్రారెడ్డి, లక్ష్మీ నరసింహారెడ్డి మరికొందరు కలిసి మతమార్చిడిని వ్యతిరేకించి, ఆర్య సమాజీయులను పిలిపించి తిరిగి హిందూమతంలోకి మార్చించారు. ఈ సందర్భంగా వెట్టిచాకిరీని మానిపించారు. అక్రమ పన్నులను చెల్లించడానికి నిరాకరించి, ఖీల్సా గ్రామాల పన్నులనే చెల్లించసాగారు.

ఈ పోరాటంలోని ప్రధాన బలహీనతలు

  • మతమార్చిడితో సంబంధం : దళితులు మతం మార్చుకోవడంతో గ్రామపెద్దల్లో చలనం కలిగిందే కానీ అంతకు ముందు కలుగలేదు.
  • సమీప ప్రాంతాలలో జాగీరు ప్రజల పోరాటాలు సాగుతున్నా ఈ గ్రామాల్లో కూడా అక్రమశిస్తులు, అక్రమ పన్నులు, వెట్టిచాకిరి లాంటి సమస్యలపై స్థానిక పెద్దలు ముందే చొరవ తీసుకొని పోరాటాలు నడపలేదు.
  • అన్ని గ్రామాల్లో మాదిరిగానే కొలనుపాక గ్రామాల్లో భూమి, కూలీ సమస్యలున్నాయి. దీనివలన పోరాటానికి, ఉద్యమానికి బలం చేకూరలేదు.

తెలంగాణ ఉద్యమ సంస్థలు - రాజకీయ పార్టీలు

  • 1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ 
  • 1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ 
  • 1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి 
  • 1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు 
  • 1990 తెలంగాణ ఫోరం కుందూరు జానారెడ్డి 
  • 1996 నవంబర్​ 20 మంజీర రచయితల సంఘం సభ నందిని సిద్ధారెడ్డి 
  • 1997 జనవరి 19 ఫోరం ఫర్​ ఫ్రీడం ఎక్స్​ప్రెషన్​ సభ పాశం యాదగిరి, గూడ అంజయ్య, గద్దర్​
  • 1997 అక్టోబర్​ 16 తెలంగాణ ఐక్యవేదిక ప్రొ.జయశంకర్​, ప్రొ.కేశవరావు జాదవ్​
  • 1997 జై తెలంగాణ పార్టీ పి.ఇంద్రారెడ్డి 
  • 1998 జులై5,6 తెలంగాణ జనసభ ఆకుల భూమయ్య 
  • 1998 తెలంగాణ స్టడీస్​ ఫోరం గాదె ఇన్నయ్య 
  • 1999 సెంటర్​ ఫర్​ దళిత్​ స్టడీస్​ మల్లేపల్లి లక్ష్మయ్య 
  • 2000 తెలంగాణ కాంగ్రెస్​ లెజిస్టేటివ్​ ఫోరం జి.చిన్నారెడ్డి 
  • 2001 ఏప్రిల్​ 27 తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖర్​ రావు 
  • 2001 జులై 25 తెలంగాణ ఉద్యోగుల సంఘం సి.విఠల్​
  • 2001 సెప్టెంబర్​ 19 తెలంగాణ సాధన సమితి ఆలే నరేంద్ర 
  • 2001 అక్టోబర్​ 14 తెలంగాణ రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి 
  • 2002 అక్టోబర్​ 11 తెలంగాణ రాష్ట్ర పార్టీ గాదె ఇన్నయ్య 
  • 2004 మార్చి తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రొ.కోదండరామ్​
  • 2004 మే 31 తెలంగాణ జర్నలిస్టుల పార్టీ అల్లం నారాయణ 
  • 2005 తల్లి తెలంగాణ పార్టీ విజయశాంతి 
  • 2006 జూన్​ 6 తెలంగాణ హిస్టరీ సొసైటీ టి.వివేక్​
  • 2007 తెలంగాణ జనపరిషత్​ కేశవరావు జాదవ్​
  • 2008 జులై 11 నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేందర్​ గౌడ్​
  • 2009 జూన్​ 18 తెలంగాణ విమోచన సమితి కపిలవాయి దిలీప్​ కుమార్​
  • 2009 అక్టోబర్​ తెలంగాణ ప్రజాఫ్రంట్​ గద్దర్​
  • 2010 తెలంగాణ రీసోర్స్​ సెంటర్​ మణికొండ వేదకుమార్​
  • 2011 ఫిబ్రవరి 21 తెలంగాణ ఐక్య కమిటీ కేశవరావు జాదవ్, విమలక్క 
  • 2011 సెప్టెంబర్​ 10 తెలంగాణ నగారా సమితి నాగం జనార్ధన్​ రెడ్డి 
  • 2014 జనవరి మహాజన సోషలిస్టు పార్టీ మందక్రిష్ణ మాదిగ